ఖమ్మంమయూరిసెంటర్: విధినిర్వహణలోఉన్న ఆర్టీసీ ఉద్యోగులు సోమవారం ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ భోజనం ప్యాకెట్లు అందజేశారు. దసరా పండుగ రద్దీ నేపథ్యాన కండక్టర్, డ్రైవర్లు, సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వీరికి భోజనం సమకూర్చారు. డిప్యూటీ రిజినల్ మేనేజర్ మల్లయ్య, డీఎం శివప్రసాద్, సెక్యూరిటీ ఎస్సై కోటాజీ పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లా ఇన్‌చార్జిగా శ్రీనివాస్
ఖమ్మంమామిళ్లగూడెం/కల్లూరు రూరల్: జాతీ య బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, సత్తుపల్లికి చెందిన నారాయణవరపు శ్రీనివాస్‌కు సంఘం భద్రాద్రి జిల్లా బాధ్యతలు కూడా అప్పగించారు. సోమవారం హైదరాబా ద్‌లో ఆయనకు సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నియామక పత్రం అందజేశారు. కాగా, బీసీ రిజర్వేషన్ల కోసం శ్రీనివాస్ ఆమరణ దీక్ష చేయడంపై అభినందించారు. నాయకులు గద్దె వెంకటరామయ్య, మరీదు ప్రసాద్‌గౌడ్, రాజేందర్, అనంతయ్య, రేగా రమేష్, రాజు కోటి, కర్రీ కమలాకర్, జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఏఐ టాపర్‌కు ఎస్‌బీఐ అధికారుల సన్మానం
తిరుమలాయపాలెం/ఖమ్మం గాంధీచౌక్: ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ప్రోగ్రామింగ్‌లో జాతీయ స్థాయి టాపర్‌గా నిలిచిన ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులకు చెందిన తాల్లూరి పల్లవి ఇటీవల ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా పల్లవితో పాటు ఆమె తల్లిదండ్రులను సోమవారం ఎస్‌బీఐ రీజియన్ అధికారులు సన్మానించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన పల్లవి జిల్లాకు కీర్తి తీసుకొచ్చిందని కొనియాడారు. ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్లు వెంకటేశ్వర్లు, శ్రీలక్ష్మి, బ్రాంచ్ మేనేజర్లు షేక్ ఇబ్రహీం, ఉదయ్, చేతన్ పాల్గొన్నారు. అలాగే, ఆరెంపుల హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పల్లవిని పర్యావరణ వేత్త డాక్టర్ కడవెండి వేణుగోపాల్ సత్కరించారు.
అండర్–19 టీ.టీ. జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 జూనియర్ కళాశాలల టేబుల్ టెన్నిస్ జట్లను సోమవారం ఎంపిక చేశారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ చాటిన వారితో బాలబాలికల జట్లను ఎంపిక చేయగా, త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వీ.వీ.ఎస్. మూర్తి, క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డీ.మూసీ కలీం తెలిపారు. కాగా, బాలుర జట్టుకు పి.మోహిత్‌కృష్ణ, ఈ.తరుణ్, జి. జెస్సీ, ఏ.వివేక్, కె.శశాంక్, టి.అఖిలేష్, బాలికల జట్టుకు జి.చంద్రికరాణి, కె.నవ్య, జి.షర్మిల, టి.శ్రీఅమృత, వి.సుప్రియ, శౌర్య ఎంపికయ్యారని వెల్లడించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు భోజనం