ఇద్దరు విద్యార్థినిలకు రూ.1.60 లక్షల ఆర్థికసాయం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థినిలకు రూ.1.60 లక్షల ఆర్థికసాయం

Oct 6 2025 2:04 AM | Updated on Oct 6 2025 2:04 AM

ఇద్దర

ఇద్దరు విద్యార్థినిలకు రూ.1.60 లక్షల ఆర్థికసాయం

కల్లూరు: స్ఫూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యాన ఇద్దరు విద్యార్థినుల చదువుకు రూ.1.60 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. నల్లగొండ జిల్లా చందనపేట మండలం తెల్ధేవరపల్లికి చెందిన లింగంపల్లి గోవింద్‌ – వాణి దంపతుల కుమార్తెల్లో పద్మ ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం, పావని బీటెక్‌ చదువుతోంది. కూలీపనులు చేసే గోవింద్‌కు వీరి ఫీజులు చెల్లించే స్థోమత లేక స్ఫూర్తి ఫౌండేషన్‌ బాధ్యుడు వరకా రామారావును ఆశ్రయించగా అమెరికాకు చెందిన దాత డాక్టర్‌ చిట్టిబోయిన శిరీష ద్వారా రూ.1.60లక్షల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీవ్యాల్‌, బాధ్యుడు వరక రామారావు, దాత శిరీషకు వీరి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ ఎంపీ జయంతి

ఖమ్మం సహకారనగర్‌: మాజీ ఎంపీ జి.వెంకటస్వామి జయంతిని ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి చిత్రపటం వద్ద కలెక్టరేట్‌ ఏఓ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్‌ సిబ్బంది వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సైంటిస్టు అశ్విని,

ఆమె తండ్రికి గుడి

విగ్రహాలను ఆవిష్కరించిన కుటుంబీకులు

కారేపల్లి: గత ఏడాది వరదల సమయాన ఆకేరు ప్రవాహంలో కారు కొట్టుకుపోవడంతో మండలంలోని గంగా రంతండాకు చెందిన అగ్రికల్చర్‌ సైంటిస్టు అశ్విని, ఆమె తండ్రి నూనావత్‌ మోతీలాల్‌ మృతి చెందిన విషయం విదితమే. వీరి జ్ఞాపకార్థం అశ్విని సోదరుడు అశోక్‌ గుడి నిర్మించాడు. గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో గుడి నిర్మించడమే కాక అశ్విని, మోతీలాల్‌ విగ్రహాలను ఏర్పాటు చేయగా మోతీలాల్‌ భార్య నేజీ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం అన్నదానం ఏర్పాటుచేశారు.

తాళం పగలగొట్టి చోరీ

మధిర: మధిర 21వ వార్డుకు చెందిన వెంపాటి రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దసరా సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వారం క్రితం ఏపీలోనిఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరులో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం, లోపల బీరువాను పగలగొట్టినట్లు గమనించారు. బీరువాలోని 12 గ్రాముల బంగారంతో పాటు నాలుగు బియ్యం బస్తాలు, నాలుగు ఇత్తడి కాగులు చోరీ జరిగినట్లు గుర్తించి ఫిర్యాదు చేయగా టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆరుగురు

పేకాటరాయుళ్ల అరెస్ట్‌

ఖమ్మంఅర్బన్‌: నగరంలోని ధంసలాపురం వద్ద మున్నేటి ఒడ్డున పేకాట ఆడుతున్న ఆరుగురిని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం అర్బన్‌ సీఐ భానుప్రకాష్‌ తెలిపారు. వీరి నుంచి రూ.6వేల నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

కానిస్టేబుల్‌

కుటుంబసభ్యులపై దాడి

చింతకాని: ఏపీఎస్‌పీ మూడో బెటాలియన్‌ కానిస్టేబుల్‌ కట్టెకోల శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులపై పాతర్లపాడు ఎస్సీ కాలనీకి చెందిన కొందరు ఆదివారం రాత్రి దాడిచేశారు. నేలకొండపల్లి మం డలం బోదులబండకు చెందిన శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో కలిసి కారులో ఏపీలోని పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి దైవదర్శనానికి వెళ్లి వస్తున్నాడు. చింతకాని మండలం పాతర్లపాడు ఎస్సీ కాలనీకి చెందిన మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై మక్కపేట నుంచి కారును వెంబడించారు. వత్సవాయి వద్ద కారును ఆపి దుర్భాషలాడగా కానిస్టేబుల్‌ డయల్‌ 100కు సమాచారం ఇచ్చాడు. దీంతో బో నకల్‌ పోలీసులు రోడ్డు వద్దకు చేరుకోగా ఇద్దరు తప్పించుకుని నాగులవంచ చేరుకున్నారు. అక్క డ పాతర్లపాడు ఎస్సీ కాలనీ నుంచి మరికొందరిని పిలిపించి కానిస్టేబుల్‌ కారును నాగులవంచ సెంటర్‌లో అడ్డుకుని దాడిచేశారు. ఘటనలో శ్రీని వాస్‌, ఇద్దరు మహిళలు గాయపడగా, ఓ మహిళ మెడలో ఉన్న నల్లపూసల గొలుసు లాక్కెళ్లారు. దీంతో కొద్దిసేపు ఖమ్మం–బోనకల్‌ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై వీరేందర్‌ చేరుకుని వివరాలు సేకరించారు.

ఇద్దరు విద్యార్థినిలకు రూ.1.60 లక్షల ఆర్థికసాయం1
1/2

ఇద్దరు విద్యార్థినిలకు రూ.1.60 లక్షల ఆర్థికసాయం

ఇద్దరు విద్యార్థినిలకు రూ.1.60 లక్షల ఆర్థికసాయం2
2/2

ఇద్దరు విద్యార్థినిలకు రూ.1.60 లక్షల ఆర్థికసాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement