
27,427 ఓటరు గుర్తింపు కార్డులు
ఖమ్మం సహకారనగర్: జిల్లా నుంచి ఓటరుగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. ఈమేరకు కలెక్టరేట్‌కు మంగళవారం 27,427 ఓటరు గుర్తింపు కార్డులు చేరాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఓటర్లుగా గుర్తించిన వారికి సంబంధించి కార్డులు జారీ అయ్యాయని అధికారులు తెలిపారు. వీటిని పోస్టల్ శాఖ ద్వారా ఓటర్లకు చేరవేయనున్నారు. ఇందులో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి 5,795, పాలేరుకు 8,245, మధిరకు 4,715, వైరాకు 3,903, సత్తుపల్లి నియోజకవర్గంలో ఓటర్లకు 4,769 గుర్తింపు కార్డులు అందించనున్నారు.
ఆర్‌ఓలు, ఏఆర్వోలకు శిక్షణ
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంపిక చేసిన ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శిక్షణ ఏర్పాటుచేయగా మాస్టర్ ట్రెయినర్లు వీరికి ఎన్నికల విధులు, నిర్వహణలో జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డీపీఓ ఆశాలత, డీఎల్‌పీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.