
భక్త శబరికి స్మృత్యంజలి
● గిరిజనుల ఆటపాటల నడమ భద్రగిరి ప్రదక్షిణ ● రామయ్య కల్యాణంలో పాల్గొన్న గిరిజనులు
భద్రాచలం: గిరిజనుల ఆటపాటలు, కొమ్ము నృత్యాలు, వారి సంస్కృతి, సంప్రదాయాల నడము భక్త శబరికి స్మృత్యంజలి ఘటించారు. భద్రాద్రి రామయ్యకు అపర భక్తురాలు, ప్రేమ, భక్తితో ఆయనకు ఎంగిలి పండ్లు సమర్పించిన శబరికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం శబరి స్మృతి యాత్ర వైభవోపేతంగా నిర్వహించారు. దేవస్థానంలో 2013 నుంచి ఏటా అశ్వయుజ మాసంలో పౌర్ణమి రోజున యాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఫల, పుష్పాలతో నీరాజనం
యాత్ర నిర్వహణ కోసం వివిధ ప్రాంతాల గిరిజనుల ను బస్సుల్లో భద్రాచలం తీసుకొచ్చారు. మంగళవా రం ఉదయమే శబరి చిత్రపటంతో మేళతాళాలు, భక్తుల శ్రీరామ నామస్మరణ నడుమ గిరిప్రదక్షిణ చేశారు. ఆతర్వాత చప్టా దిగువన తూము రామదా సు, భక్త రామదాసు విగ్రహాలకు ఆలయ ఈఓ కొల్లు దామోదర్‌రావు పూలమాలలు, శబరి విగ్రహం వద్ద పూలు, పండ్లు, వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా గిరిజనుల సంప్రదాయ నృత్యాలు అలరించా యి. వీరితో పాటుగా ఈఓ దామోదర్‌రావు, ఇతర అధికారులు కొమ్ముపాగా ధరించి కాలు కదిపారు అనంతరం బేడా మండపంలో కొలువైన స్వామితో పాటు శబరికి గిరిజనులు పండ్లు, పూలను సమర్పించాక అర్చకులు పూజలు చేశారు. ఆపై చిత్రకూట మండపంలో స్వామివారి నిత్యకల్యాణం జరిపించగా గిరి జనులు కనులారా వీక్షించారు. కాగా, ఈ ఉత్సవంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్ పాల్గొని గిరిజన పెద్దలకు వస్త్రాలు, పూలు, పండ్లు అందజేసి సత్కరించారు. అలాగే, వాల్మీకి జయంతి కూడా నిర్వహించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని వరరామచంద్రాపురంలో శబరి నది వద్ద దేవస్థానం అర్చకులు పూజలు చేశారు. నది ఒడ్డున శబరి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు.

భక్త శబరికి స్మృత్యంజలి