
దాతృత్వం అభినందనీయం
సత్తుపల్లి: డబ్బు చాలా మందికి ఉన్నా ప్రజల కోసం రూ.కోట్లు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహించే గుణం ఉండదని.. అలాంటి గుణం కలిగిన దాసరి మధుమోహన్‌రెడ్డి సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి మండలం గంగారంలో దాసరి మధుమోహన్‌రెడ్డి నిర్మించిన చాకలి ఐలమ్మ భవనం, యాదవ భవనం, దుర్గాదేవి ఆలయ మండపం, దుర్గమ్మతల్లి ఆర్చి, చర్చితో పాటు ఐదు తాగునీరు బోర్లు, సీసీ కెమెరాలు, యానాధుల కాలనీ చుట్టూ ప్రహరీని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి మంత్రి గురువారం ప్రారంభించారు. అలాగే, రూ.కోటి వ్యయంతో వడ్డెర కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశాక మంత్రి మాట్లాడుతూ దాసరి వీరారెడ్డి పేరును చిరస్థాయిగా నిలిపేలా ఆయన మనువడు మధుమోహన్‌రెడ్డి చేసిన పనులు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. కాగా, వచ్చే విజయదశమికల్లా బేతుపల్లి చెరువుకు గోదావరి జలాలు తీసుకొస్తామని ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడగా డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి(చిట్టినాయన), మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్‌బాబు, నాయకులు మట్టా దయానంద్, శివ వేణు, దొడ్డా శ్రీనివాసరావు, కావేటి అప్పారావు, కోలగట్ల చెన్నకేశవరావు, ఊకే రమేష్, ఎండీ.కమల్‌పాషా, ఎస్.కే.మౌలాలి పాల్గొన్నారు.
శ్రీనాగమలేశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్ఠ
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం రేజర్లలోని శ్రీదుర్గానాగమల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రతిష్ఠా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాగమయి, టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

దాతృత్వం అభినందనీయం