
రూ.3కోట్లు ‘హస్తార్పణం’
అశ్వారావుపేట: అధికార పార్టీ నాయకులకు లబ్ధి చేకూరేలా డిజైన్ చేసిన ఓ బీటీ రోడ్డు నిర్మాణం మూణ్ణాళ్ల ముచ్చటగానే నిలవగా స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి పేటమాలపల్లి నుంచి వ్యవసాయ క్షేత్రాల మీదుగా బోర్డర్ చెక్ పోస్టు వరకు మూడు కి.మీ. మార్గం ఉంది. ఆయిల్‌పామ్, కొబ్బరి, ఉద్యాన పంటలతో పచ్చగా కళకళలాడే వ్యవసాయ క్షేత్రాల మధ్య సాగే ఈ రోడ్డుపై ఎక్కడ గుంతలు ఉంటాయో.. ఎక్కడ రోడ్డు కోతకు గురైందో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు కాంగ్రెస్ నాయకులు ఈ రహదారిని నిర్మించగా.. వారు లాభాలు మాత్రమే చూసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్తత్తులను వాహనాల్లో తరలించేందుకు గత పాలకులు రహదారి అవసరమని గుర్తించి ఐటీడీఏ నుంచి రూ.3కోట్లు కేటాయించారు. కానీ బినామీ కాంట్రాక్టర్ల తీరుతో రోడ్డు కొద్దికాలానికే దెబ్బతినడం.. అయినా అంతా బాగుందని సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజనీర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ ఏఈఈ ప్రసాదరావు దృష్టికి తీసుకువెళ్లగా రహదారిని పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పునర్మించే వరకు కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించేది లేదని స్పష్టం చేశారు.
రహదారి నిర్మాణంలో ఇష్టారాజ్యం

రూ.3కోట్లు ‘హస్తార్పణం’