యాంటీడంపింగ్‌- కెమికల్‌ షేర్లు గెలాప్

Chemical company shares zooms on Anti dumping duty on Caustic soda - Sakshi

నవంబర్‌ 17వరకూ సుంకాల గడువు పొడిగింపు

పలు కౌంటర్లు 12-5 శాతం మధ్య హైజంప్

‌ జాబితాలో వినైల్, మంగళం ఆర్గానిక్స్‌, టైక్‌ ఇండస్ట్రీస్‌ 

గుజరాత్‌ ఆల్కలీస్‌, తిరుమలై కెమికల్స్‌, రోజారీ బయోటెక్

ఆంధ్రా పెట్రోకెమ్‌,  మంగళం డ్రగ్స్‌, పిడిలైట్‌, హిమాద్రి కెమ్

కేంద్ర ప్రభుత్వం కాస్టిక్‌ సోడా దిగుమతులపై యాంటీడంపింగ్‌ సుంకం విధింపు గడువును పొడిగించేందుకు తాజాగా నిర్ణయించింది. ప్రధానంగా చైనా, కొరియా నుంచి దిగుమతయ్యే క్యాస్టిక్‌ సోడాపై ఇప్పటికే విధించిన యాంటీడంపింగ్‌ సుంకాలను నవంబర్‌ 17వరకూ కొనసాగించనున్నట్లు ప్రకటించింది. దీంతో కెమికల్‌ రంగ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు భారీ లాభాలతో దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..

దూకుడు
ప్రస్తుతం బీఎస్‌ఈలో మంగళం ఆర్గానిక్స్‌ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 51 ఎగసి రూ. 558 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈలో మంగళం డ్రగ్స్‌ 5 శాతం ఎగసి రూ. 116 వద్ద ఫ్రీజ్‌కాగా.. తిరుమలై కెమికల్స్‌ 12 శాతం దూసుకెళ్లి రూ. 64కు చేరింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో వినైల్‌ కెమికల్స్‌ 15 శాతం పురోగమించి రూ. 109ను తాకింది. గుజరాత్‌ ఆల్కలీస్‌ 8.5 శాతం జంప్‌చేసి రూ. 348 వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో  బీఎస్‌ఈలో ఆంధ్రా పెట్రోకెమ్‌ 10 శాతం పెరిగి రూ. 25 వద్ద ఫ్రీజయ్యింది. ఈ బాటలో హిమాద్రి స్పెషాలిటీ, రోజారీ బయోటెక్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, జీహెచ్‌సీఎల్‌, కేసర్‌ పెట్రోప్రొడక్ట్స్‌, టైక్‌ ఇండస్ట్రీస్‌ తదితరాలు 2-10 శాతం మధ్య ఎగశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top