breaking news
women's cricketer
-
విజ్డన్ అత్యుత్తమ క్రికెటర్‌గా స్టోక్స్
లండన్: గత ఏడాది అత్యద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఇంగ్లండ్ టాప్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యాడు. 2019 సంవత్సరానికిగాను ‘లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్’గా స్టోక్స్‌ను ఎంపిక చేసినట్లు విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ ప్రకటించింది. 2005లో ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత ఒక ఇంగ్లండ్ ఆటగాడు దీనికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. వరుసగా గత మూడు సంవత్సరాలు లీడింగ్ క్రికెటర్‌గా కోహ్లి ఎంపిక కాగా... ఇప్పుడు స్టోక్స్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇంగ్లండ్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్... ఫైనల్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే స్టోక్స్ టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు. హెడింగ్లీలో జరిగిన యాషెస్ సిరీస్ మూడో టెస్టులో 135 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు సంచలన విజయం అందించాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికైంది. 2016లోనూ ఇదే అవార్డుకు ఎంపికైన పెర్రీ...రెండుసార్లు ఈ పురస్కారానికి ఎంపికైన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ, అర్ధసెంచరీ చేయడంతో పాటు వన్డేల్లో 73 సగటుతో, టి20ల్లో 150 సగటుతో పరుగులు సాధించింది. మరో 27 వికెట్లు కూడా పడగొట్టింది. టి20ల్లో వరల్డ్ లీడింగ్ క్రికెటర్ గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రసెల్ ఎంపికయ్యాడు. -
ఎదురులేని రైల్వేస్
సాక్షి, హైదరాబాద్ : బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్ ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో రైల్వేస్ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆంధ్రతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ హిమబిందు (107 బంతుల్లో 53; 7 ఫోర్లు), సుధారాణి (35 బంతుల్లో 28; 1ఫోర్, 2 సిక్స్‌లు), పుష్పలత (22) రాణించారు. రైల్వేస్ బౌలర్లలో సుకన్య (2/19), పూనమ్ యాదవ్ (2/30) ఆకట్టుకున్నారు. 157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రైల్వేస్ మరో 8 ఓవర్లు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెల్వేస్ తరఫున కెప్టెన్ మిథాలీ రాజ్ (22; 3 ఫోర్లు), తిరుష్ కామిని (39; 5 ఫోర్లు), పూనమ్ రౌత్ (36 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో మల్లిక (2/44) ఆకట్టుకుంది. ఓటమితో ముగిసిన హైదరాబాద్ పోరు ఐదు జట్లున్న ఎలైట్ ‘ఎ’ గ్రూప్‌లోనే ఉన్న హైదరాబాద్ తమ నాలుగు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఓడింది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ గౌహర్ సుల్తానా తొలుత బ్యాటింగ్ చేసే నిర్ణయం తీసుకుంది. స్నేహ (41 బంతుల్లో 35; 7 ఫోర్లు), మహేష్ కావ్య (33, 3 ఫోర్లు), స్రవంతి నాయుడు (31, 4 ఫోర్లు) రాణించడంతో.. హైదరాబాద్ భారీ స్కోరు చేస్తుందనిపించినా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 48.3 ఓవర్లలో 202 పరుగులకే పరిమితమైంది. ప్రత్యర్థి బౌలర్లలో ఎన్ ఎస్ చౌహాన్ (2/22), హర్లీన్ డియోల్ (2/31) ఆకట్టుకున్నారు. అనంతరం 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ జట్టు 49.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హర్లీన్ డియోల్ (107 బంతుల్లో 79; 7 ఫోర్లు), నీనా చౌదరి (43), కెప్టెన్ సుష్మ (30) రాణించారు. గౌహర్ సుల్తానా (3/34) రాణించినా ఫలితం లేకపోయింది. ఒక విజయం, మూడు పరాజయాలతో హైదరాబాద్ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. -
బైక్‌పై మహిళా క్రికెటర్..