breaking news
Wages Fall
-
అమెరికాలో పెరుగుదల Vs భారత్‌లో తగ్గుదల
ఒకవైపు అమెరికన్ టెక్ నిపుణుల వేతనాల వృద్ధి పండుగ వాతావరణాన్ని తలపిస్తుంటే, మరోవైపు భారతీయ టెక్ ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ సాంకేతిక రంగంలో ఈ విచిత్రమైన వైరుధ్యం ఏర్పడడానికి కారణాలను కొన్ని సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఒకే పరిశ్రమలో, ఒకే రకమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు రెండు భిన్నమైన వేతన ధోరణులను ఎందుకు ఎదుర్కొంటున్నారో తెలియజేస్తూ పేరోల్ అండ్ కంప్లయన్స్ ప్లాట్‌ఫామ్ డీల్ (Deel), ఈక్విటీ మేనేజ్మెంట్ సంస్థ కార్టా (Carta) సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ఈ విశ్లేషణకు దారితీసిన ప్రధాన కారణాలను, ముఖ్యంగా అమెరికాలో వేతనాలు పెరగడానికి, భారత్‌లో వేతన పరిహారం తగ్గడానికి గల అంశాలను పరిశీలిద్దాం.భారత్‌లో వేతన పరిహారం తగ్గుదలకు కారణాలుభారతీయ టెక్ నిపుణుల వేతనాలు 2025లో భారీగా తగ్గాయి. ఇంజినీరింగ్, డేటా సంబంధిత ఉద్యోగుల సగటు పరిహారం 40% తగ్గి 22,000 డాలర్లకు(సుమారు రూ.19.5 లక్షలు) చేరుకుంది. ప్రొడక్షన్, డిజైన్ నిపుణుల సగటు వేతనం కూడా 23,000కు పడిపోయింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు కింది విధంగా ఉన్నాయి.వేతన పెంపులో ఒత్తిడిభారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సంప్రదాయ వేతన పెరుగుదల ఆశించినంత ఉండడంలేదు. కంపెనీలు ప్రస్తుతం ఈక్విటీ-హెవీ పరిహార నమూనాల (Equity-heavy compensation models) వైపు మొగ్గు చూపుతున్నాయి. టెక్ పరిశ్రమలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల మొత్తం పరిహారాన్ని పెంచడానికి ఈక్విటీ-ఆధారిత వేతనం (Equity-based pay) ఒక సాధనంగా మారుతోంది. కొన్ని కంపెనీల్లో టాప్ ఎగ్జిక్యూటివ్‌ల స్థూల వేతనం తగ్గినా ఈక్విటీ గ్రాంట్లు పెరగడం దీనికి సంకేతం.అధిక టాలెంట్ సప్లైభారతదేశంలో టెక్ గ్రాడ్యుయేట్లు, నైపుణ్యం కలిగిన ఇంజినీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. డిమాండ్‌ను మించి సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు వేతనాలపై సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా తక్కువ వేతనాలతో నాణ్యమైన టాలెంట్‌ను పొందడానికి భారత్ వంటి మార్కెట్లపై దృష్టి పెడుతున్నాయి.అమెరికాలో వేతనాల పెంపునకు కారణాలుభారత్లో వేతనాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ యూఎస్ టెక్ ఉద్యోగుల సగటు జీతాలు 1,22,000 డాలర్ల నుంచి 1,50,000కు పెరిగాయి. ప్రొడక్షన్, డిజైన్ నిపుణుల సగటు వేతనం 1,38,000 వద్ద ఉంది. ఈ పెరుగుదలకు దారితీసిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.అధిక డిమాండ్యూఎస్ మార్కెట్లో అత్యాధునిక సాంకేతిక రంగాల్లో(AI, మెషిన్ లెర్నింగ్ వంటివి) అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ ఉంది. సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత కారణంగా కంపెనీలు అధిక జీతాలను, ఆకర్షణీయమైన పరిహారాన్ని చెల్లించడానికి సిద్ధపడుతున్నాయి.ఈక్విటీ-ఆధారిత పరిహారంనివేదిక ప్రకారం, ఈక్విటీ ఆధారిత వేతనం ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షిస్తోంది. యూఎస్‌లోని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యంలో వాటాను (ఈక్విటీ) పెద్ద మొత్తంలో అందిస్తున్నాయి. దీని వల్ల మొత్తం పరిహారం (జీతం + ఈక్విటీ) గణనీయంగా పెరుగుతోంది.ద్రవ్యోల్బణం, జీవన వ్యయంఅమెరికాలో అధిక జీవన వ్యయం, ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు తమ ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి వేతనాలను పెంచడం అనివార్యమవుతోంది.ఇదీ చదవండి: తీర ప్రాంత వాణిజ్యం, స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంతంటే.. -
జీతాలు రావు..సెలవుల్లేవు!
నిన్న.. మొన్నటివరకు 108, 104 వాహనాల సిబ్బంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే కోవలోకి తాజాగా 102 వాహన (తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్) సిబ్బంది చేరిపోయారు. టీడీపీ ప్రభుత్వం 2016 జనవరి ఒకటో తేదీ నుంచి ఈ వాహనాలను తెరపైకి తెచ్చినప్పటికీ ఇప్పటికీ విధివిధానాల్లేక సిబ్బంది పడరానిపాట్లు పడుతున్నారు. ఓ ఏజెన్సీకి వీటి నిర్వహణ బాధ్యతలను సర్కార్ అప్పగించింది. జీతాల్లేక, రిలీవర్లు ఉండక.. ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాశీబుగ్గ: పేరుగొప్ప..ఊరుదిబ్బ చందంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం తీరు. ఆర్భాటంగా పథకాలను ప్రారంభించి తరువాత వాటి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 102 వాహనాల విషయంలో కూడా ఇదే పరిస్థితి. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణిని.. డెలివరీ తరువాత తల్లీబిడ్డను ఇంటికి క్షేమంగా తీసుకెళ్లేందుకు 102 వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే వీటిలో పని చేస్తున్న సిబ్బందికి నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. రోజంతా ఒక్కరే డ్యూటీ చేయాల్సిన పరిస్థితి. కనీసం రిలీవర్ను కూడా కేటాయించడం లేదు. పీఎఫ్ సౌకర్యం ఉందో..లేదో తెలియక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సర్కార్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. వాహనాలు కేటాయించిన ఆస్పత్రులు శ్రీకాకుళం కేంద్ర ఆస్పత్రికి:4, నరసన్నపేటకు:2, పలాస, కొత్తూరు, టెక్కలి, సొంపేట, పాలకొండ, పాతపట్నం, రాజాం ఆస్పత్రులకు ఒకొక్కటీ. సమస్యలు పరిష్కారిస్తాం 102 వాహనాలు సక్రమంగానే నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల పేదలకు వరంగా ఉన్నాయి. సిబ్బంది సమస్యలు ఇంతవరకు మా దృష్టికిరాలేదు. జీతాలు ఏజెన్సీలు చెల్లిస్తాయి.అలస్యమైతే వారితో మాట్లాడి జీతాలు అందేలా చూస్తాం. –సనపల తిరుపతిరావు, డీఎంహెచ్‌వో,శ్రీకాకుళం -
వేతనాలు పెరగలేదు..తగ్గాయి
► కొత్త విధానంతో కాంట్రాక్ట్ కార్మికులకు తీరని నష్టం ► తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకున్నప్పటికీ, వాస్తవానికి వారి వేతనాలు తగ్గాయని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీకి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు బలయ్యారని యూనియన్ అధ్యక్షులు వి.కుమారస్వామి, ప్రధాన కార్య దర్శి ఎస్.వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కె.సత్యం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైస్కిల్డ్ కార్మికుడికి రూ.23 వేలు, స్కిల్డ్ కార్మికుడికి రూ.19 వేలు, సెమీస్కిల్డ్ కార్మికుడికి రూ.16 వేలు, అన్‌స్కిల్డ్ కార్మికుడికి రూ.14 వేల వేతనం ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారని, అయితే, ఈ నాలుగు కేటగిరీల కార్మికులకు వాస్తవానికి వచ్చేది వరుసగా రూ.16,676, రూ.13,774, రూ.11,705, రూ.10,241ల వేతనం మాత్ర మేనన్నారు. విద్యుత్ సంస్థల యాజమాన్యా లు కట్టాల్సిన పీఎఫ్, ఈఎస్‌ఐల వాటాలనూ కార్మికుల వేతనాల నుంచి కోతపెట్టి చెల్లించే విధంగా కొత్త విధానాన్ని రూపొందిం చడంతో కార్మికుల చేతికి వచ్చే వేతనాలు భారీగా తగ్గిపోయాయన్నారు. గతంలో చేసే పనిని బట్టి స్కిల్డ్ వేతనం పొందిన అనేక మంది తక్కువ చదువుకున్న కార్మికులు, చదువులేని కార్మికులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్టిజన్–4 కేటగిరీలోకి వెళ్లారన్నా రు. దీంతో రూ.15,870 వేతనం పొందు తున్న సీబీడీ గ్యాంగ్ వర్కర్లు, రూ.12,722 వేతనం పొందుతున్న చదువులేని స్కిల్డ్ వర్కర్ల వేతనం రూ.10,241కు తగ్గిపోయిం దన్నారు. పే రివిజన్ సందర్భంగా సంపాదిం చుకున్న 12 శాతం స్పెషల్ అలవెన్స్, జెన్కో లో డక్ట్ అలవెన్స్, షిఫ్టు అలవెన్స్‌లూ పోయా యన్నారు. విద్యుత్ కార్మికులకు వేతనాల చెల్లింపుల్లో జరుగుతున్న అన్యాయానికి నిర సనగా సెప్టెంబర్ 6న డిమాండ్ బ్యాడ్జీలు ధరించాలని, 12న టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని, 19న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.


