breaking news
Pokleyin
-
అక్రమంగా ఇసుక తవ్వకాలు.. ప్రశ్నిస్తే దాడులు..
► ఇదీ అధికార పార్టీ నేతల తీరు ► పోతవరంలో మాజీ ఎంపీటీసీకి తీవ్రగాయాలు ► తన పొలంలో ఇసుక తవ్వొద్దన్నందుకు దాడి చిలకలూరిపేట రూరల్ : సన్నకారు రైతులకు చెందిన కొద్దిపాటి భూమిలో ఇసుక దందా నిర్వహిస్తూ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే నిస్సిగ్గుగా.. మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శికిచెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సయ్యద్ సైదాకు మండలంలోని పోతవరంలో సర్వే నెంబర్ 551, 76 సర్వే నెంబర్లలో ఎకరం పొలం ఉంది. అక్కడ కొంతకాలం నుంచి అధికారపార్టీకి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా ఇసుక తవ్వుకుంటున్నారు. తవ్వకాలు చేపడితే పొలంలో గుంటలు ఏర్పడతాయని సైదా పలుసార్లు వారికి తెలియజేశాడు. అయినా.. ప్రయోజనం లేకపోయింది. మూకుమ్మడి దాడి.. రాత్రిళ్లు పొక్లెయిన్ ఏర్పాటు చేసి తవ్వుకుని పగటి పూట కూలీల సహాయంతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. బుధవారం సమాచారం తెలుసుకున్న సైదా అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఇసుక తవ్వకాలు చేపడుతుండటం చూసి పనులను అడ్డుకున్నాడు. కోపోద్రిక్తులైన టీడీపీకి చెందిన లింగంగుంట్ల షేక్ అల్లాబుడే, యలమంద మహ్మద్ అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బంధువులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లాలని సూచించారు. -
తండ్రి ఎదుటే.. ప్రాణాలు విడిచిన కొడుకు
ఆటోను ఢీకొన్న పొక్లెయిన్ బాలుని మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు దర్శి : ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పొక్లెయిన్ ఢీకొనడంతో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వెంకటాచలం పల్లె సమీపంలోని నడింపల్లి అడ్డ రోడ్డు వద్ద శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని తుమ్మెదలపాడు గ్రామానికి చెందిన నలదిమ్ము రమణారెడ్డి(12) శివదీక్ష తీసుకున్నాడు. ఇరుముడి కట్టుకుని సోమవారం శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. బంధువులను ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టి శ్రీశైలం వెళ్లాలనుకున్నాడు. తండ్రి వెంకటేశ్వర్లుతో కలిసి సరుకుల కోసం దర్శి వెళ్లాడు. సరుకులు తీసుకుని ఆటోలో తండ్రీకొడుకులు స్వగ్రామం బయల్దేరారు. నడింపల్లి అడ్డరోడ్డు వద్దకు రాగానే ఓ పొక్లెయిన్ వచ్చి ఆటోను బలంగా ఢీకొని బోల్తా కొట్టింది. పొక్లెయిన్ డ్రైవర్ అక్కడి నుంచి దూకి పరారయ్యాడు. ఆటోలో డ్రైవర్ పక్కన కుడివైపు రమణారెడ్డి, ఎడమ వైపు తండ్రి వెంకటేశ్వరరెడ్డి కుర్చొన్నారు. పొక్లెయిన్ కుడి వైపున బలంగా ఢీకొనడంతో రమణారెడ్డి అక్కడికక్కడే తండ్రి కళ్ల ముందే కన్నుమూశాడు. ఆటోలో ఉన్న మరో ఇద్దరు ఆవుల వెంకటనారాయణరెడ్డి, బూసిరెడ్డి సత్యనారాయణరెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసిన తల్లి రమణమ్మ, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. మృతుని సోదరుడు వెంకట కృష్ణారెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. భగవంతుడా ఎందుకు అన్యాయం చేశావన్నారు. పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.