breaking news
old man crying
-
వృద్ధుడి వద్ద డబ్బులు అపహరణ
వర్ధన్నపేట వరంగల్ : తన ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన ఓ వృద్ధుడి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులను అపహరించిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై ఉపేందర్‌రావు కథనం ప్రకారం... వర్ధన్నపేట పట్టణానికి చెందిన బోయినపెల్లి కమలాకర్‌రావు తన కొడుకు పంపిన రూ.4.20లక్షలు ఈ నెల 6న బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి వెళ్లాడు. డీనామినేషన్ ఓచర్ నింపి క్యాష్‌కౌంటర్ వద్ద డబ్బులు జమచేయడానికి క్యూలో నిల్చున్నాడు. తనవంతు రాగానే కౌంటర్లో ఓచర్, డబ్బులు క్యాషియర్‌కు అందజేశాడు. క్యాషియర్ ఆ డబ్బులు లెక్కించి ఓచర్లో ఉన్న నగదుకు రూ.20వేలు తక్కువ వచ్చాయని చెప్పాడు. దీంతో తాను తాను పలుమార్లు లెక్కించి తెచ్చానని, ఆ డబ్బు కౌంటర్ వద్దే మాయమయ్యాయని వాదించాడు. మేనేజర్ దృష్టికి తీసుకెళ్దామంటే వారం రోజులు సెలవులో ఉన్నారు. బ్యాంకు మేనేజర్ రాగానే సీసీ ఫుటేజీ పరిశీలిస్తే విషయం తేలిపోతుందని బ్యాంకు సిబ్బంది కమలాకర్‌రావుకు నచ్చజెప్పి పంపారు. వారమవుతున్నా సమాచా రం లేకపోవడంతో అ తడు ఈనెల 13న పోలీ స్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బ్యాంకు మేనేజర్ గురువారం విధులకు రాగా సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కమలాకర్ రావు డబ్బులు చేతిలో పట్టుకుని క్యూలైన్లో నిల్చుని ఉండగా యువకులు చుట్టూ ఉండగా, ఓ యువకుడు డబ్బు కట్టల నుంచి నెమ్మదిగా లాగి ఆ డబ్బు కాగితంలో చుట్టి తీసుకుని బయటకు వెళ్లి నట్లు స్పష్టంగా రికార్డయ్యింది. ఇటీవల జనగామ జిల్లా బచ్చన్నపేట బ్యాంక్‌లో సైతం ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
‘క్యూ’లో వృద్ధుడి అరణ్యరోదన.. వైరల్ ఫొటో!
పెద్దనోట్ల రద్దుతో దేశంలోని ఏ బ్యాంకును చూసినా.. ఏ ఏటీఎంను పరికించినా సామాన్యుడి కష్టాలే కనిపిస్తున్నాయి. నాగుపాములా వంకలు వంకలు తిరుగుతూ భారీ క్యూలు.. ఆ క్యూలలో రెక్కాడితేగానీ డొక్కాడని పేదల ఎదురుచూపులు. తమ వద్ద ఉన్న వెయ్యి, రెండువేలు బ్యాంకు నుంచి తీసుకోవడానికి సామాన్యులు, నిరుపేదలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏ బ్యాంకు ముందు సంపన్నుడు నిలబడినా దాఖలా లేదు. సంపన్నుడు ఎలాగోలా క్యూలో నిలబడకుండానే తమ విలాసాలకు కావాల్సిన డబ్బును సమకూర్చుకోగలుగుతున్నాడు. కానీ, సామాన్యులకు క్యూలో నిలబడక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంల ముందు సామాన్యులు పడుతున్న కష్టాలకు దర్పణంగా నిలిచిన ఓ ఫొటో ఆన్లైన్లో వైరల్‌గా మారిపోయింది. గుర్గావ్లో డబ్బు కోసం బ్యాంకు ముందు భారీ క్యూలో నిలబడిన వృద్ధుడు.. అంతలో తన స్థానం గల్లంతై.. తనను క్యూ నుంచి తోసేయడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. అతడి అరణ్యరోదన ఇప్పుడు ఆన్లైన్లో నెటిజన్లను కదిలిస్తోంది. బ్యాంకుల ముందు సామాన్యల కష్టాలకు ఈ ఫొటో దర్పణం పడుతోంది. పెద్దనోట్ల రద్దుతో సంపన్నులు మాత్రమే విలపిస్తారని నేతలు ఉపన్యాసాలు దంచుతున్నారు. కానీ ఇక్కడ చూడండి.. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అంటూ పలువురు నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేసుకుంటున్నారు. హిందూస్తాన్ టైమ్స్ ఫొటోగ్రాఫర్ ప్రవీన్ కుమార్ ఈ ఫొటోను తీశారు.