Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Putin calls PM Modi, condemns Pahalgam incident1
భారత్‌కు అండగా ఉంటాం: రష్యా

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్తాన్‌ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. భారత్‌ కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్‌ చేసిన పుతిన్‌.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్‌ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతిచెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పుతిన్,. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందుకు తీసుకురావాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు స్సష్టం చేశారుఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్‌ చానెళ్ల నిలిపివేత, భారత్‌ జలాల్లోకి పాక్‌ ఓడలు రాకుండా నిషేధం, పాక్‌ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని రెండురోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.

AP High Court Slams Police Officers Over Varra Ravindra Reddy Case2
పోలీస్‌ అధికారులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం..

సాక్షి,విజయవాడ: పోలీస్‌ అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ వర్రా రవీందర్‌రెడ్డి కేసులో అరెస్ట్‌ సమయం, తేదీపై తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని ఫైరయ్యింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు వేసిన అఫిడవిట్లలో సమాచారం తప్పని హైకోర్టు తేల్చింది.2024 నవంబర్‌ 8న అరెస్ట్‌ చేసి 10న చేశామని ఎలా చెప్తారు? అని ప్రశ్నించింది. తాము తీసుకోబోయే చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. పులివెందుల అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో పుల్లప్పగారి హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై క్రైమ్‌ నంబరు 409/24, అండర్‌ సెక్షన్‌ 386 ఐపీసీ 196, 351(3), 353(1)(సి), 112(2)(బి) రెడ్‌విత్‌ 3(5) బిఎన్‌ఎస్‌ 2023 సెక్షన్‌ 3(1)(ఆర్‌)(ఎస్‌), 3(2)(వి)(ఎ) ఎస్సీ ఎస్టీ (పీఓఏ) అమెండ్‌మెంట్‌ యాక్టు 2015, 67 ఐటీ యాక్టు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.రవీంద్రారెడ్డితో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు చెందిన గుర్రంపాటి సుబ్బారెడ్డి అలియాస్‌ సుబ్బారెడ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కూడా కారులో ఉండటాన్ని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే,ఈ అక్రమ కేసులపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో వర్రా రవీంద్రారెడ్డికి పలు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసింది.

Riyan Parag Gives Angry Reaction To RR Star After His Wicket Vs KKR3
ఇదేం ఆట?.. గుడ్లు ఉరిమి చూసిన రియాన్‌.. ఒక్క చూపుతోనే..

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR vs RR)తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (Riyan Parag) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినా వృథాగానే పోయింది. 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఊహించని రీతిలో కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు.45 బంతుల్లో 95 పరుగులుఇరవై ఏడు బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రియాన్‌ పరాగ్‌.. ఆ తర్వాత ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది స్కోరు బోర్డును దౌడు తీయించాడు. కేకేఆర్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలీ బౌలింగ్‌ (13వ ఓవర్‌)లో వరుస సిక్స్‌లతో అలరించి వహ్వా అనిపించాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి 95 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 45 బంతుల్లో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టడంతో రియాన్‌ పరాగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఐదు, ఆరో నంబర్‌ బ్యాటర్లు ధ్రువ్‌ జురెల్‌, వనిందు హసరంగ డకౌట్‌ కావడం పట్ల రియాన్‌ ఆగ్రహానికి లోనయ్యాడు.రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌ తొలి బంతికి వరుణ్‌ చక్రవర్తి ధ్రువ్‌ జురెల్‌ (0)ను బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత మరో రెండు బంతులకు అదే రీతిలో వనిందు హసరంగ (0)ను కూడా బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు.చూపుతోనే చంపేసేలాఇక హసరంగ అవుట్‌ కావడాన్ని రియాన్‌ పరాగ్‌ సహించలేకపోయాడు. సహచర ఆటగాడిని ఒ క్క చూపుతోనే బెంబెలెత్తేలా ఓ రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో కొంత మంది రియాన్‌ ఆగ్రహంలో అర్థం ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం కెప్టెన్‌గా ఉండటం మామూలు విషయం కాదని అతడికి ఇప్పుడే తెలిసి వస్తోందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆదివారం కోల్‌కతాతో తలపడింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో టాస్‌ గెలిచిన కేకేఆర్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు సాధించింది.ఒక్క పరుగు తేడాతో ఓడిభారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినా.. రియాన్‌ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఆఖరి బంతి వరకు రాజస్తాన్‌ పోరాడిందంటే అందుకు కారణం కెప్టెన్‌. అయితే, రియాన్‌ అవుటైన తర్వాత పరిస్థితి మారిపోయింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన వేళ.. శుభమ్‌తో కలిసి పరుగు పూర్తి చేసిన జోఫ్రా ఆర్చర్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో రాజస్తాన్‌ ఓటమి ఖరారైంది. కేకేఆర్‌ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడి.. ఈ సీజన్‌లో పన్నెండింట తొమ్మిదో పరాజయం నమోదు చేసింది.రాజస్తాన్‌ బ్యాటర్లలో రియాన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరవగా.. యశస్వి జైస్వాల్‌ (34), షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (29), శుభమ్‌ దూబే (14 బంతుల్లో 25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా వాళ్లలో వైభవ్‌ సూర్యవంశీ(4) పూర్తిగా విఫలం కాగా.. కునాల్‌ సింగ్‌ రాథోడ్‌, ధ్రువ్‌ జురెల్‌, హసరంగ డకౌట్లుగా వెనుదిరిగారు. ఆర్చర్‌ ఆఖర్లో 12 పరుగులు చేశాడు.చదవండి: వైభవ్‌ సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. ఆయుశ్‌కు ధోని చెప్పిందిదే!Through the gate ✖ 2️⃣ \|/Varun Chakaravarthy is weaving his magic in Kolkata! 👏Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @chakaravarthy29 | @KKRiders pic.twitter.com/vHcMTObTrL— IndianPremierLeague (@IPL) May 4, 2025

YS Jagan Teleconference With Party Leaders Over Unseasonal Rains4
రైతులకు బాసటగా వైఎస్సార్‌సీపీ: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్‌ జగన్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్‌ జగన్‌ సూచించారు.

Waqf Act Petitions: petitioners response to govt Arguments in SC Updates5
వక్ఫ్‌ చట్టం చట్టబద్ధతపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్‌ చట్టం(Waqf Amendment Act) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ మే 15కి వాయిదా వేసిందిసీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా వక్ఫ్ కేసు విచారణను జస్టిస్ బీఆర్‌ గవాయి ధర్మాసనానికి బదిలీ చేసింది. మే 13న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా రిటైర్ కానున్న నేపథ్యంలో కేసు బదిలీపై నిర్ణయం తీసుకుంది.వక్ఫ్ కేసులలో తదుపరి విచారణ జస్టిస్ బీఆర్‌ గవాయి ధర్మాసనం విచారణ కొనసాగించనుంది.వక్ఫ్‌ (సవరణ) చట్టం2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖయ్యాయి. ఇప్పటికే పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కేంద్రం విజ్ఞప్తి మేరకు నేటి వరకు గడువు ఇచ్చింది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. మే 5వ తేదీ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపింది. గత వాదనల్లో.. వక్ఫ్‌ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. అన్నిరకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి వాదనలు వినకపోవడం సముచితం కాదని పేర్కొన్నారు. మరోవైపు.. వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్‌ జాబితా నుంచి తొలగించొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్‌ బోర్డులు, కేంద్ర వక్ఫ్‌ మండలిలో ఎక్స్‌అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ చెప్పింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్‌ అఫీషియో సభ్యులను నియమించొచ్చని.. ఈ మేరకు వక్ఫ్‌(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదించింది.

Vundavalli Aruna Kumar Reacts On PSR Anjaneyulu Arrest6
ఈనాడు పేపర్‌నే కూటమి సర్కార్‌ ఫాలో అయ్యేది: ఉండవల్లి

తూర్పుగోదావరి, సాక్షి: సీనియర్‌ పోలీస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికకు ఆంజనేయులిపై చాలా కక్ష ఉండి ఉండొచ్చని.. ఈ అరెస్ట్‌ పోలీస్‌ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారాయన. ఈ కేసులో అసలు ముంబై నటి ని రేప్ చేసారన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు?. ఆంజనేయులు లాంటి అధికారులను వేధించడం సరికాదు. ఇలా అయితే పోలీసులు ఎలా పని చేస్తారు?. ముంబైలో నమోదైన కేసులో ఏం జరుగుతుందో?. ఈనాడు పేపర్‌కు ఆంజనేయులిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈనాడు పేపర్‌లో ముందురోజు ఏమి వస్తుందో.. ఆ తర్వాతి రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతోంది అని ఉండవల్లి అన్నారు. ఆంధ్రా నుంచి ఎవరూ మాట్లాడరా?ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇదేనని ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. నేనే 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాం. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు..‌ కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారు.. అందుకే ఆయనకు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

Ambati Rambabu Complaint Against Seema Raja, Kiraak RP7
సీమ రాజా, కిర్రాక్‌ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు: అంబటి

గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్‌ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.సోమవారం పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌ వైఎస్సార్‌సీపీపై, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్‌సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్‌ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్‌ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్‌ ప్రొత్సహంతో వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్‌ పర్సన్‌గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్‌ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు.

Rajasthan MLA Arrested By ACB For This Reason8
అసెంబ్లీలో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’?.. ఎమ్మెల్యే అరెస్ట్‌!

ఆయనో యువ ఎమ్మెల్యే. అవినీతి మీద చట్ట సభలో ప్రశ్నలు సంధించారు. ఆనక.. నోరు మెదపకుండా ఉండేందుకు లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. రాజస్థాన్‌లో ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యేను ఏసీబీ ఆదివారం అరెస్ట్‌ కావడం సంచలనంగా మారింది. జైపూర్‌: భారత్‌ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్‌ జైపూర్‌ జ్యోతి నగర్‌లోని తన అధికార నివాసంలో ఒక మైనింగ్‌ కంపెనీ యజమాని నుంచి రూ 20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఆ రాష్ట్ర ఏసీబీ వెల్లడించింది. కరౌలి జిల్లాలోని తోడభీమ్‌ బ్లాక్‌లోని కొన్ని మైనింగ్‌ లీజులకు సంబంధించిన మూడు ప్రశ్నలను గత అసెంబ్లీ సమావేశాల్లో అడిగారు. అయితే ఆ ప్రశ్నలను ఉపసంహరించుకునేందుకు మైనింగ్‌ యజమాని నుంచి ఎమ్మెల్యే మొత్తంగా రూ.10 కోట్లను డిమాండ్‌ చేశారు. అయితే చివరకు డీల్‌ రూ.2.5 కోట్లకు కుదరడం, కొంత కొంతగా చెల్లించేందుకు ఎమ్మెల్యే ఒప్పుకోవడం జరిగిపోయిందట. అదే సమయంలో ఈ ఏప్రిల్‌లోనే ఏసీబీకి ఆయన సమాచారం అందించాడట.ఈ క్రమంలో.. ఇప్పటికే లక్ష చెల్లించగా.. ఆదివారం మరో రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఓ యజమాని ప్రయత్నించాడు. దీంతో.. ఏసీబీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ, స్పీకర్‌ వాసుదేవ్‌కి తెలియజేసి అరెస్ట్‌కు ముందస్తుగానే అనుమతి పొందారు. సరిగ్గా డబ్బు తీసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసినట్లు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ రవి ప్రకాష్‌ మెహర్దా మీడియాకు తెలియజేశారు. అంతేకాదు.. ఎమ్మెల్యే కృష్ణ పటేల్‌ డబ్బు తీసుకుంటున్న టైంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే అనుచరుడొకరు డబ్బు సంచితో ఉడాయించినట్లు, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారాయన. లోక్‌ సభ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది జరిగిన బగిడోరా నియోజవర్గం(బంస్వారా జిల్లా) ఉప ఎన్నికల్లో కృష్ణ పటేల్‌(38) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఫస్ట్‌ టైం ఎమ్మెల్యే. భారత్‌ ఆదివాసీ పార్టీకి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అరెస్టు తరువాత ఎమ్మెల్యేను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై భారత్‌ ఆదివాసీ పార్టీ కన్వీనర్‌, బం‌స్వారా ఎంపీ రాజ్‌కుమార్‌ రావోత్‌ స్పందించారు. ఇది బీజేపీ కుట్ర అయ్యి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కృష్ణపటేల్‌ హస్తం ఉన్నట్లు తేలితే చర్యలు ఉంటాయని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్‌ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయాల్లో అవినీతి పనికి రాదని ఆ పార్టీ కీలక నేత సచిన్‌ పైలట్‌ అన్నారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలపైనా చర్చ జరగాలని కోరారాయన. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించాల్సి ఉంది.

Allu Aravind Visited To Sri Tej Who Recently Shifted To Rehabilitation Centre9
శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్‌, బన్నీవాసు

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌(Sri Tej )ను సోమవారం ఉదయం నిర్మాతలు అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ప్రస్తుతం ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న నిర్మాతలు, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.శ్రీతేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు అతని యోగక్షేమాలను నిరంతరం అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులతోపాటు, అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఆర్థిక సహాయం అందించారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని, సాధారణ స్థితికి చేరే వరకు, భవిష్యత్‌లో అతనికి ఏ అవసరమైనా అతనికి, అతని కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నుంచి రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స వరకు, అల్లు అరవింద్, బన్నీ వాసుల ద్వారా శ్రీతేజ్ ఆరోగ్య వివరాలను అల్లు అర్జున్ నిరంతరం తెలుసుకుంటున్నారు.

ITR Filing 2025 New Changes in Form 16 Here is All You Need To Know10
ఫారం 16లో జరిగిన మార్పులు ఇవే.. గమనించారా?

2024–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారంలో 16 మార్పులు వచ్చాయి. మీ యజమాని ఈ మార్పులు చేసిన తర్వాత మీకు ఫారం 16 జారీ చేస్తారు.ఫారం 16 అంటే ఏమిటి?యజమాని తన దగ్గర చేసే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం జారీ చేసేది ఫారం 16. ఇందులో మొదటి భాగంలో ఉద్యోగులు, యజమాని ప్రాథమిక వివరాలు ఉంటాయి. రెండో భాగంలో జీతభత్యాలకి సంబంధించిన పూర్తి వివరాలు .. అంటే జీతాలు, అలవెన్సులు, టాక్సబుల్‌ ఇన్‌కం వివరాలు, మినహాయింపులు, తగ్గింపులు, డిడక్షన్లు, నికరజీతం లేదా ఆదాయం, టీడీఎస్‌ వివరాలు ఉంటాయి. ‘సులభతరం, పారదర్శకత, స్పష్టత’ అనే లక్ష్యాలతో ఫారం 16 రాబోతోంది.ఫారం 16 చాలా ముఖ్యమైంది..రిటర్నులు వేయడానికి మొదటగా చూసే డాక్యుమెంటు ఇదే. లోన్‌ ఇచ్చేందుకు బ్యాంకులు, రుణ సంస్థలు ఈ ఫారంనే ప్రాతిపదికగా తీసుకుంటాయి. ఈ ఫారంతో ఉద్యోగి ‘రుణ స్తోమత’ నిర్ధారిస్తారు. దీంతోనే పన్ను భారం, చెల్లింపులు నిర్ధారించవచ్చు. రీఫండు కోసం కూడా ఇదే ఫారంని ‘బేస్‌’గా తీసుకుంటారు. ఎందుకంటే, పన్ను వసూలు చేయడం, దాన్ని ప్రభుత్వానికి చెల్లించడాన్ని దీని ద్వారానే నిర్ధారించుకుంటారు. ఇవే అంశాలు 26ఏఎస్‌లో ఉంటాయి.ప్రతి మూడు నెలలకు సమ్మరీ, జీతం, టీడీఎస్‌ చెల్లించినది, గవర్నమెంటుకు ఎలా చెల్లించారు, ఏ బ్యాంకు ద్వారా చెల్లించారు, ఏ తేదీన కట్టారు, చలాన్‌ నంబరు ఎంత వగైరా వివరాలన్నీ ఉంటాయి. జీతం, అలవెన్సులు, బోనస్‌లు, ఏరియర్స్, సెక్షన్‌ 10 ప్రకారం మినహాయింపులు, ఇంటి అద్దె అలవెన్సు, గ్రాట్యుటీ మొదలైన అన్ని డిడక్షన్లు 80 C నుంచి 80 TTA వరకు ఉంటాయి. ఆ తరువాత పన్ను భారం లెక్కింపులు, స్టాండర్డ్‌ డిడక్షన్లు ఉంటాయి. 89(1) రిలీఫ్‌ కూడా ఉంటుంది. వచ్చిన మార్పులు ఏమిటంటే..80 ఇఇఏ ప్రకారం అగ్నివీర్‌ కార్పస్‌ ఫండ్‌కి ఇచ్చిన విరాళాలకు సంబంధించిన మినహాయింపు ఉంటుంది. జీతాలకు సంబంధించిన అంశాలు వర్గీకరిస్తారు. హెచ్‌ఆర్‌ఏకి సంబంధిత వివరాలుంటాయి. అలాగే రెంట్‌ఫ్రీ వివరాలు, ఇతర ప్రిరిక్వజిట్లు, ప్రతి డిడక్షన్‌కి సంబంధించి మరిన్ని వివరాలు పొందుపరుస్తారు. కొత్త కాలమ్‌ ద్వారా టీడీఎస్, టీసీఎస్‌కి సంబంధించిన వివరాలు తెలిసేలా, సరి చేసుకునే వీలు కల్పించడానికి ఫారం 24 Q టీడీఎస్‌/టీసీఎస్‌ రిటర్నులు కనిపించేలా చేస్తారు. దీనివల్ల 26 Aను అప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్మీరు చేయాల్సిందేమింటంటే..ఫారం 16 యజమాని ఇచ్చే సర్టిఫికేట్. ఇది విలువైంది. ఎందుకంటే ఇది మీ టీడీఎస్, టీసీఎస్‌ రికవరీ అయినట్లు... చెల్లించినట్లు. గవర్నమెంటు చేతికందినట్లూ. మీ ఖాతాలో జమ అయినట్లు ధృవీకరించే ఏకైక పత్రం. అయితే ఇందులో ప్రతి అంశాన్ని మీరే సరి చూసుకోవాలి. నెలసరి శాలరీ స్లిప్పులతో మినహాయింపు, తగ్గింపులు... మొదలైనవి చెక్‌ చేసుకోవాలి. మీరు ఇచ్చే ఆదాయపు వివరాలు ఉన్నాయా లేదా ఎక్కువ పడ్డాయా చెక్‌ చేసుకోవాలి. వాటికి సంబంధించిన కాగితాలు భద్రపరుచుకోవాలి. మీరు కొత్త రెజీమ్‌లో ఉన్నారా లేక పాత పద్ధతిలో ఉన్నారో చెక్‌ చేసుకొండి. మీరు సంవత్సరంలో ఉద్యోగం మారితే రెండు ఫారం 16లు ఉంటాయి. అప్పుడు రిపోరి్టంగ్‌లో హెచ్చు తగ్గులు... డబుల్‌ క్లయిమ్‌/తప్పుడు క్లయిమ్‌ ఉండొచ్చు. చెక్‌ చేసుకోండి. యజమానికి అంటే ‘డిస్బర్సింగ్‌’ అధికారి ఇవన్నీ అదనపు భాద్యతలు... తగిన జాగత్ర వహించాలి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు, సమస్యలు కొత్త ఫారమ్‌ 16 వల్ల రావని ఆశిద్దాం! ట్యాక్సేషన్‌ నిపుణులు: కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి & కె.వి.ఎన్‌ లావణ్య

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement