Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

 Nirmala Sitharaman demands ADB to cut Pakistan funding1
అప్పు ఇవ్వొద్దు,పాక్‌పై భారత్‌ ఫైనాన్షియల్‌ స్ట్రైక్‌..

ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్‌ ఫైనాన్షియల్‌ స్ట్రైక్‌ చేస్తోంది భారత్‌. ఇప్పటికే ఐఎంఎఫ్‌ తలుపు తట్టిన ప్రధాని మోదీ సర్కార్‌ తాజాగా, ఇటలీలో ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (adb)ను సంప్రదించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌కు రుణాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఏడీబీ వార్షిక సమావేశం కోసం ఇటలీకి వెళ్లిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంక్‌ చీఫ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పాకిస్తాన్‌కు ఇస్తున్న ఏడీబీ రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదేశానికి అప్పిస్తే.. ఆ సొమ్ము మొత్తం ఉగ్ర సంస్థల ఖాతాల్లోకి వెళుతోందని వివరించారు. ఏడీబీ చీఫ్‌తో పాటు, ఇటలీ ఆర్థిక మంత్రి జియాన్‌కార్లో గియోర్గెట్టితో కూడా ప్రత్యేక సమావేశమయ్యారు. పాకిస్తాన్‌కు ఇచ్చే నిధుల విషయంలో పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. Union Minister for Finance and Corporate Affairs Smt. @nsitharaman is received by Ambassador Ms. Vani Rao and Consul General Shri Lavanya Kumar after her arrival at the Milan Malpensa Airport, Italy. The Union Finance Minister will participate in the 58th #ADBAnnualMeeting… pic.twitter.com/w63TIRpLQb— Ministry of Finance (@FinMinIndia) May 4, 2025 కాగా, మే 4 నుండి 7 వరకు జరగనున్న ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) గవర్నర్ల బోర్డు 58వ వార్షిక సమావేశంలో సీతారామన్ ఇటాలి మిలాన్‌లో పర్యటిస్తున్నారు. గవర్నర్ల బోర్డు వార్షిక సమావేశానికి నిర్మలా సీతారామన్‌ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు

Trump May destroy world before he goes says Actor Sean Penn2
'ట్రంప్‌తో ప్రపంచం నాశనం'

వాషింగ్టన్‌: వ్యక్తిగత జీవితంతోనే కాదు.. రాజకీయ అభిప్రాయాలతోనూ వివాదాస్పదమైన హాలీవుడ్‌ నటుడు సీన్‌ పెన్‌ (Sean Penn) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రపంచాన్ని నాశనం చేస్తారన్నారు. అంతేకాదు.. హంతకుడైన అసూయపూరిత జీవిత భాగస్వామిగా అభివర్ణించారు. డెమొక్రటిక్‌ ప్రతినిధి ఎరిక్‌ స్వాల్వెల్‌తో కలిసి జిమ్‌ అకోస్టా పాడ్‌ కాస్ట్‌ ‘ది జిమ్‌ అకోస్టా షో’లో పెన్‌ మాట్లాడారు.తనకు కాకపోతే ఇంకెవ్వరికీ దక్కవద్దన్న ధోరణి ట్రంప్‌లో ఉంటుందన్నారు. తన అధికారంతో విధ్వంసానికి పాల్పడే స్వార్థపూరిత వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించారు. మూడోసారి అధ్యక్ష పదవికోసం ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు పెన్‌ పైవిధంగా సమాధానమిచ్చారు. ఇక డెమొక్రాట్‌ అయిన ఎరిక్‌ స్వాల్వెల్‌ (Eric Swalwell) మాట్లాడుతూ.. నియంతలెప్పుడూ తమ వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రణాళికలు వేయలేదన్నారు. తనను తాను రక్షించుకోవడానికి దేశాన్ని ఏం చేయడానికైనా ట్రంప్‌ సిద్ధమవుతారని వ్యాఖ్యానించారు. చ‌దవండి: ద‌య‌లేని ట్రంప్‌.. ఈసారి సినిమాల‌పై సుంకం

Putin calls PM Modi, condemns Pahalgam incident3
భారత్‌కు అండగా ఉంటాం: రష్యా

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్తాన్‌ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. భారత్‌ కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్‌ చేసిన పుతిన్‌.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్‌ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతిచెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పుతిన్,. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందుకు తీసుకురావాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు స్సష్టం చేశారుఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్‌ చానెళ్ల నిలిపివేత, భారత్‌ జలాల్లోకి పాక్‌ ఓడలు రాకుండా నిషేధం, పాక్‌ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని రెండురోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.

AP High Court Slams Police Officers Over Varra Ravindra Reddy Case4
పోలీస్‌ అధికారులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం..

సాక్షి,విజయవాడ: పోలీస్‌ అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ వర్రా రవీందర్‌రెడ్డి కేసులో అరెస్ట్‌ సమయం, తేదీపై తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని ఫైరయ్యింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు వేసిన అఫిడవిట్లలో సమాచారం తప్పని హైకోర్టు తేల్చింది.2024 నవంబర్‌ 8న అరెస్ట్‌ చేసి 10న చేశామని ఎలా చెప్తారు? అని ప్రశ్నించింది. తాము తీసుకోబోయే చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. పులివెందుల అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో పుల్లప్పగారి హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై క్రైమ్‌ నంబరు 409/24, అండర్‌ సెక్షన్‌ 386 ఐపీసీ 196, 351(3), 353(1)(సి), 112(2)(బి) రెడ్‌విత్‌ 3(5) బిఎన్‌ఎస్‌ 2023 సెక్షన్‌ 3(1)(ఆర్‌)(ఎస్‌), 3(2)(వి)(ఎ) ఎస్సీ ఎస్టీ (పీఓఏ) అమెండ్‌మెంట్‌ యాక్టు 2015, 67 ఐటీ యాక్టు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.రవీంద్రారెడ్డితో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు చెందిన గుర్రంపాటి సుబ్బారెడ్డి అలియాస్‌ సుబ్బారెడ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కూడా కారులో ఉండటాన్ని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే,ఈ అక్రమ కేసులపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో వర్రా రవీంద్రారెడ్డికి పలు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసింది.

Warren Buffett Sounded A Warning About The United States Growing Fiscal Deficit5
పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు

దిగ్గజ ఇన్వెస్టర్ & బెర్క్‌షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వారెన్ బఫెట్.. ఇటీవల తన వాటాదారుల ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక లోటుకు సంబందించిన విషయాలను హైలెట్ చేస్తూ.. పెట్టుబడిదారులు కేవలం యూఎస్ డాలర్ మీద మాత్రమే కాకుండా, ఇతర కరెన్సీలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.అమెరికాలో ఆర్థిక లోటు సమస్య ఎప్పటి నుంచో పరిష్కారం లేకుండా ఉంది. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో నిర్ణయించలేకపోతున్నామని బఫెట్ అన్నారు. మనం చాలా కాలంగా భరించలేని ఆర్థిక లోటుతో పనిచేస్తున్నాము. ఇది ప్రస్తుతం నియంత్రించలేని స్థాయికి చేరిందని వెల్లడించారు.యూఎస్ డాలర్ పతనావస్థలో ఉంది. ఒక దేశంగా మనకు ఎప్పుడూ చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఇది మాత్రం మనమే తెచ్చుకున్న సమస్య. అమెరికా ఆర్ధిక విధానాలు, వాణిజ్య విధానం వంటివన్నీ డాలర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని బఫెట్ వివరించారు.సీఈఓగా వారెన్‌ బఫెట్‌ పదవీ విరమణశనివారం (2025 మే 3) జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్‌ బఫెట్‌' కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్‌ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కీలక ప్రకటన: గెలిచినోళ్లకు రూ.5 లక్షల ప్రైజ్

Riyan Parag Gives Angry Reaction To RR Star After His Wicket Vs KKR6
ఇదేం ఆట?.. గుడ్లు ఉరిమి చూసిన రియాన్‌.. ఒక్క చూపుతోనే..

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR vs RR)తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (Riyan Parag) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినా వృథాగానే పోయింది. 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఊహించని రీతిలో కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు.45 బంతుల్లో 95 పరుగులుఇరవై ఏడు బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రియాన్‌ పరాగ్‌.. ఆ తర్వాత ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది స్కోరు బోర్డును దౌడు తీయించాడు. కేకేఆర్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలీ బౌలింగ్‌ (13వ ఓవర్‌)లో వరుస సిక్స్‌లతో అలరించి వహ్వా అనిపించాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి 95 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 45 బంతుల్లో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టడంతో రియాన్‌ పరాగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఐదు, ఆరో నంబర్‌ బ్యాటర్లు ధ్రువ్‌ జురెల్‌, వనిందు హసరంగ డకౌట్‌ కావడం పట్ల రియాన్‌ ఆగ్రహానికి లోనయ్యాడు.రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌ తొలి బంతికి వరుణ్‌ చక్రవర్తి ధ్రువ్‌ జురెల్‌ (0)ను బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత మరో రెండు బంతులకు అదే రీతిలో వనిందు హసరంగ (0)ను కూడా బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు.చూపుతోనే చంపేసేలాఇక హసరంగ అవుట్‌ కావడాన్ని రియాన్‌ పరాగ్‌ సహించలేకపోయాడు. సహచర ఆటగాడిని ఒ క్క చూపుతోనే బెంబెలెత్తేలా ఓ రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో కొంత మంది రియాన్‌ ఆగ్రహంలో అర్థం ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం కెప్టెన్‌గా ఉండటం మామూలు విషయం కాదని అతడికి ఇప్పుడే తెలిసి వస్తోందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆదివారం కోల్‌కతాతో తలపడింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో టాస్‌ గెలిచిన కేకేఆర్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు సాధించింది.ఒక్క పరుగు తేడాతో ఓడిభారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినా.. రియాన్‌ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఆఖరి బంతి వరకు రాజస్తాన్‌ పోరాడిందంటే అందుకు కారణం కెప్టెన్‌. అయితే, రియాన్‌ అవుటైన తర్వాత పరిస్థితి మారిపోయింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన వేళ.. శుభమ్‌తో కలిసి పరుగు పూర్తి చేసిన జోఫ్రా ఆర్చర్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో రాజస్తాన్‌ ఓటమి ఖరారైంది. కేకేఆర్‌ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడి.. ఈ సీజన్‌లో పన్నెండింట తొమ్మిదో పరాజయం నమోదు చేసింది.రాజస్తాన్‌ బ్యాటర్లలో రియాన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరవగా.. యశస్వి జైస్వాల్‌ (34), షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (29), శుభమ్‌ దూబే (14 బంతుల్లో 25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా వాళ్లలో వైభవ్‌ సూర్యవంశీ(4) పూర్తిగా విఫలం కాగా.. కునాల్‌ సింగ్‌ రాథోడ్‌, ధ్రువ్‌ జురెల్‌, హసరంగ డకౌట్లుగా వెనుదిరిగారు. ఆర్చర్‌ ఆఖర్లో 12 పరుగులు చేశాడు.చదవండి: వైభవ్‌ సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. ఆయుశ్‌కు ధోని చెప్పిందిదే!Through the gate ✖ 2️⃣ \|/Varun Chakaravarthy is weaving his magic in Kolkata! 👏Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @chakaravarthy29 | @KKRiders pic.twitter.com/vHcMTObTrL— IndianPremierLeague (@IPL) May 4, 2025

YS Jagan Teleconference With Party Leaders Over Unseasonal Rains7
రైతులకు బాసటగా వైఎస్సార్‌సీపీ: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్‌ జగన్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్‌ జగన్‌ సూచించారు.

Donald Trump's 100 Percent Movie Tariffs Effect On Indian Cinema8
‘సినిమా’ చూపించిన ట్రంప్‌.. అమెరికాలో కష్టమే!

‘అమెరికా ఫస్ట్‌’అనే విధానంతో ప్రపంచ దేశాలపై ‘సుంకాల యుద్ధం’ ప్రకటించాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. ఇప్పటికే వివిధ రంగాలపై భారీగా టారీఫ్‌ విధించిన ట్రంప్‌..ఇప్పుడు సినిమా రంగంపై విరుచుపడ్డాడు. అమెరికాలో కాకుండా ఇతర దేశాలలో నిర్మించిన చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించి సినిమా రంగానికి షాకిచ్చాడు. ట్రంప్‌ నిర్ణయం భారత సినీ పరిశ్రమపై ముఖ్యంగా టాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు.గతకొన్నేళ్లుగా అమెరికాలో బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాకు మంచి డిమాండ్‌ ఉంది. అక్కడ భారీగా కలెక్షన్స్‌ రాబట్టే చిత్రాలలో టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలు అగ్రస్థానంలో ఉంటాయి. పటాన్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, డంకీ, పుష్ప, జవాన్‌ లాంటి చిత్రాలు అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టాయి. (చదవండి: దయలేని ట్రంప్‌.. ఈసారి సినిమాపై 100% సుంకం)ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఉత్తర అమెరికాలో భారీ క్రేజీ ఉంది. ఇండియా కంటే ఒక్క రోజు ముందుగానే అక్కడ సినిమాను రిలీజ్‌ చేస్తారు. అక్కడ హిట్‌ టాక్‌ వస్తే.. ఇక్కడ కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్‌ వేసిన టారీఫ్‌ బాంబుకి అక్కడి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కుదేలు అవ్వడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ట్రంప్‌ చెప్పినట్లుగా విదేశీ చిత్రాలకు 100 శాతం సుంకం విధిస్తే.. ఒక మిలియన్‌ డాలర్‌కు సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్‌ మరో మిలియన్‌ డాలర్‌ని టాక్సీగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే డిస్ట్రిబ్యూటర్‌ రెట్టింపు ధరను చెల్లించి ఇండియన్‌ సినిమాలను కొనుగోలు చేయాలన్నమాట. ఈ భారం ప్రేక్షకుడిపై వేయాల్సి ఉంటుంది. లాభాల కోసం టికెట్‌ ధరను పెంచాల్సి వస్తుంది. ఇప్పుడున్న ధరకే ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లడం లేదు. ఇక ధరలు పెంచితే.. అమెరికాలో కూడా థియేటర్స్‌ ఖాలీ అవ్వడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్‌ సినిమాలను కొనుగోలు చేయాలంటే ఇప్పుడున్న రేటుకి రెట్టింపు చెల్లించాలి కాబట్టి..అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌ వెనుకడుగు వేస్తారు. అలాగే ఓటీటీలకు కూడా ట్రంప్‌ నిర్ణయం వర్తిసుందని చెబితే మాత్రం.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి సంస్థలు ఇండియన్‌ సినిమాలకు తక్కువ డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. మొత్తంగా అమెరికా మార్కెట్‌ దృష్టిలో పెట్టుకొని భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలకు ట్రంప్‌ భారీ షాకిచ్చాడనే చెప్పాలి.పాన్‌ ఇండియా సినిమాపై ట్రంప్‌ ఎఫెక్ట్‌అమెరికా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే భారీ బడ్జెట్‌తో కొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్‌ ‘ది రాజా సాబ్‌’, ధనుష్‌ ‘కుబేర’, పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’, చిరంజీవి ‘విశ్వంభర’ తదితర చిత్రాలన్ని త్వరలోనే విడుదల కావాల్సి ఉంది. ఓవర్సిస్‌ బిజినెస్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాలకు భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ట్రంప్‌ విధించిన 100 శాతం సుంకం కారణంగా ఈ చిత్రాలకు జరిగే బిజినెస్‌లో తేడాలు వస్తాయి. ఓవర్సీస్‌లో తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. అలాగే ఓటీటీలో కూడా కొనుగోలు విషయంలో వెనకడుకు వేసే అవకాశం ఉంది. అయితే ట్రంప్‌ నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సినిమా రంగంపై విధించిన వందశాతం టారీఫ్‌ విషయంలో ఆయన మరోసారి ఆలోచన చేస్తాడా? మనసు మార్చుకొని టారిఫ్‌ తగ్గిస్తాడా లేదా చూడాలి.

Vundavalli Aruna Kumar Reacts On PSR Anjaneyulu Arrest9
ఈనాడు పేపర్‌నే కూటమి సర్కార్‌ ఫాలో అయ్యేది: ఉండవల్లి

తూర్పుగోదావరి, సాక్షి: సీనియర్‌ పోలీస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికకు ఆంజనేయులిపై చాలా కక్ష ఉండి ఉండొచ్చని.. ఈ అరెస్ట్‌ పోలీస్‌ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారాయన. ఈ కేసులో అసలు ముంబై నటి ని రేప్ చేసారన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు?. ఆంజనేయులు లాంటి అధికారులను వేధించడం సరికాదు. ఇలా అయితే పోలీసులు ఎలా పని చేస్తారు?. ముంబైలో నమోదైన కేసులో ఏం జరుగుతుందో?. ఈనాడు పేపర్‌కు ఆంజనేయులిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈనాడు పేపర్‌లో ముందురోజు ఏమి వస్తుందో.. ఆ తర్వాతి రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతోంది అని ఉండవల్లి అన్నారు. ఆంధ్రా నుంచి ఎవరూ మాట్లాడరా?ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇదేనని ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. నేనే 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాం. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు..‌ కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారు.. అందుకే ఆయనకు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

Ambati Rambabu Complaint Against Seema Raja, Kiraak RP10
సీమ రాజా, కిర్రాక్‌ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు: అంబటి

గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్‌ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.సోమవారం పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌ వైఎస్సార్‌సీపీపై, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్‌సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్‌ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్‌ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్‌ ప్రొత్సహంతో వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్‌ పర్సన్‌గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్‌ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement