gas leak
-
Rajasthan: లీకయిన విషవాయువు.. ఒకరు మృతి.. 40 మందికి అస్వస్థత
జైపూర్: రాజస్థాన్‌లోని బీవార్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి యాసిడ్ ఫ్యాక్టరీ గిడ్డంగి(Acid factory warehouse) లోపల ఆగి ఉన్న ఒక ట్యాంకర్ నుండి నైట్రోజన్ గ్యాస్ లీకయ్యింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. బడియా ప్రాంతంలోని సునీల్ ట్రేడింగ్ కంపెనీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో పలు పెంపుడు జంతువులు(Pets), వీదుల్లో తిరిగే జంతువులు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ యజమాని సునీల్ సింఘాల్ మృతి చెందారు. ఆయన గ్యాస్ లీక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో గ్యాస్ ప్రభావానికిలోనై అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతనిని అజ్మీర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం కంపెనీ గిడ్డంగిలో ఒక ట్యాంకర్ నుండి నైట్రోజన్ గ్యాస్ లీక్(Nitrogen gas leak) అయ్యింది. సెకెన్ల వ్యవధిలోనే సమీపంలోని నివాస ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. దీంతో 60 మందికి పైగా జనం చికిత్స కోసం బీవార్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, అగ్నిమాపక దళ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో గ్యాస్ లీకేజీని నియంత్రించగలిగారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు. గ్యాస్ ప్రభావం తగ్గినప్పటికీ, స్థానికులలో ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేంద్ర ఖడ్గావత్ ఫ్యాక్టరీని మూసివేయాలని ఆదేశించారు. వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. గ్యాస్ లీకేజీకి గల కారణాన్ని సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Switzerland: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం -
రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో విషవాయువులు లీక్
-
రొయ్యల ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత
సాక్షి, బాపట్ల జిల్లా: నిజాంపట్నంలోని రొయ్యల ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో విష వాయువు లీక్ కావడంతో 30 మంది కార్మికులకు అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం నిజాంపట్నం, పిట్టలవానిపాలెం ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం అందించేందుకు బాపట్ల, గుంటూరు ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా, ఒక చోట మాత్రమే విషవాయువు లీకైందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై యాజమాన్యం నిర్లక్ష్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
AP: గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు
సాక్షి, కాకినాడ జిల్లా: గోదావరి నదిలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కొనసాగుతోంది. యానాం దరియాలతిప్ప వద్ద గౌతమీ నది(గోదావరి)లో ఓఎన్జీసీ పైపు లైన్ లీక్ కావడంతో గ్యాస్ నదిలో పొంగుతూ బుడగలుగా బయటకు వెళ్తుంది. లీకేజీని ఆపేందకు ఓఎన్జీసీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా లీకేజీ అదుపులోకి రావడం లేదు.యానాం దరియాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్యలో ఈ లీకేజీ చోటుచేసుకుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిందని, మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నది ముఖ ద్వారానికి సమీపంలో గ్యాస్ లీకేజీ కావడంతో గోదావరి, సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. దీంతో మత్స్య సంపద మనుగడ ప్రశ్నార్థకం కానుందని గ్యాస్ లీకేజీపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు.గోదావరి జిల్లాల్లో గతంలోనూ ఇలాంటి గ్యాస్ లీక్ కారణంగా భారీ నష్టమే జరిగిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే! -
కెన్యాలో భారీ పేలుడు: ఇద్దరు మృతి, 300 మందికి గాయాలు
కెన్యా రాజధాని నైరోబీలో గురువారం రాత్రి భారీ పేలుడు జరిగింది. గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. మరో 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నైరోబీలోని ఎంబాకాసిలోని స్కైలైన్ ఎస్టేట్ సమీపంలోని కంటైనర్ కంపెనీలో పేలుడు జరిగినట్లు కెన్యా రెడ్‌క్రాస్ వెల్లడించింది. ఆ ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకొని చుట్టుపక్కల ప్రదేశాలకు వ్యాపించినట్లు తెలిపింది. News: Gas explosion in Nairobi, Kenya. Casualties undisclosed yet. The image is terrifying. pic.twitter.com/dFPYinmw3E — Olu 🕊️ (@empror24) February 2, 2024 ఒక్కసారిగా పేలుళ్ల శబ్ధం రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాదం తీవ్రతకు కంపెనీకి చెందిన రెండు భవనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అనేక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లకు మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న వాహనాలు, వ్యాపార సముదాయాలు, ఇళ్లు కాలిబూడిదయ్యాయి. Nairobi, Kenya - Massive explosion. Death toll could be huge as hundreds in the building 🇰🇪 pic.twitter.com/lULFLJI2HU — 🇬🇧RonEnglish🇬🇧🏴 (@RonEng1ish) February 2, 2024 పెద్ద సంఖ్యలో ప్రజలు పరిసర భవనాల్లో చిక్కుకుపోయారని అక్కడి అధికారులు తెలిపారు ఈ క్రమంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఉత్తరఖండ్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. తప్పిన ఘోర ప్రమాదం
డెహ్రాడూన్: క్లోరిన్ గ్యాస్ లీకైన ఘటన ఉత్తరఖండ్‌లో చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌కు సమీపంలోని ప్రేమ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఝంజ్రా ప్రాంతంలో ఓ ఖాళీ ఇంట్లో క్లోరిన్ సిలిండర్ల నుంచి గ్యాస్ లీకైంది. మంగళవారం ఉదయం చోటుకున్న ఈ ఘటనతో సమీపంలో ఉన్న పలు నివాసాల్లోని ప్రజలు తీవ్రమైన శ్వాస ఇబ్బందలను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పాడ్డాయి. అక్కడ నివసించే పలు కుంటుంబాలను పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. #WATCH | Uttarakhand: On receiving information about people facing difficulty in breathing due to leakage in the chlorine cylinder kept in the empty plot in the Jhanjra area of Prem Nagar police station in Dehradun, Police, NDRF, SDRF and Fire team reached the spot and are… pic.twitter.com/Xq7n71Ot3n — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 9, 2024 ఈ ఘటనపై సాహస్పూర్ ఎమ్మెల్యే సహదేవ్ సింగ్ స్పదిస్తూ... 7 క్లోరిన్ సిలిండర్లు ఖాళీగా ఉన్న ఇంట్లో నిల్వ ఉన్నాయని తెలిపారు. సిలిండర్ల నుంచి క్లోరిన్ లీకేజీ వల్ల ప్రమాదాకర పరిస్థితులు చోటు చేసుకున్నాయని అన్నారు. అయితే సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎస్ బృందాలు తీసుకున్న చర్యలు వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు. చదవండి: Ayodhya: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు? -
కరాచి బేకరీ పరిశ్రమలో..అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలోని కరాచి బేకరీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పైప్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాప్తిచెంది 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నారు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలో కరాచి బేకరీకి సంబంధించిన ఆహార తయారీ పరిశ్రమలో ఉదయం 9.40 గంటల సమయంలో ప్రధాన వంటశాలగా ఉన్న ప్రాంతంలో 20 మంది కార్మికులు కేక్‌లు, బిస్కెట్లు తయారు చేస్తున్నారు. పరిశ్రమలో భారీ స్టవ్‌లకు గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తుంటారు. స్టవ్‌ల వద్దకు వచ్చే పైప్‌లైన్‌లో ఓ చోట లీకేజీ ఏర్పడటంతో మంటలు ఒక్కసారిగా బయటికి వ్యాపించి అక్కడ పనిచేస్తున్న 15 మంది కార్మికులకు అంటుకున్నాయి. దీంతో వెంటనే గ్యాస్ సరఫరాను నిలిపివేసిన పరిశ్రమ యాజమాన్యం, గాయపడిన కార్మికులను పరిశ్రమకు చెందిన ఆటోల్లోనే శంషాబాద్ ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించింది. అనంతరం ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదంలో కార్మికులకు మంటలంటుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 మంది కార్మికుల్లో తీవ్రంగా గాయాలైన పదమూడు మందిని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మిగతా వారు ట్రైడెంట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కాగా, అగ్నిప్రమాదంలో గాయపడిన పదిహేను మంది కూడా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారే. బలరాం (25), శుభం ప్రజాపతి (19), అదితి కుమార్ (19), సందీప్ ప్రజాపతి (27), దీపక్ శుక్లా (18), అన్వే‹Ùకుమార్ (20), ముఖే‹Ùకుమార్ (28), దారే సింగ్ (37), సోను (30), కోమల్ కిషోర్ (24), ప్రమోద్‌కుమార్ (23), సుజిత్ (19), సందీప్‌కుమార్ (25), సన్నీ (20), ప్రదీప్ (20)లలో ఐదుగురికి యాభై శాతం నుంచి ఎనభై శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గతంలోనూ ఇదే పరిశ్రమలో... గతేడాది అక్టోబర్‌లో కూడా ఈ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఘటన రాత్రి సమయంలో జరగడం, కార్మికులెరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దేశీయంగా, అంతర్జాతీయ బ్రాండెడ్‌గా ఉన్న పరిశ్రమలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం కార్మిక శాఖతో పాటు పరిశ్రమ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి కరాచి పరిశ్రమలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీచేశారు. ఒక్కసారిగా మంటలంటుకున్నాయి.. మేము ఇరవై మంది అప్పుడే కేకులు, బిస్కెట్లు తయారీ ప్రారంభించాం. స్టవ్‌లకు సరఫరా అయ్యే గ్యాస్‌పైప్ లైన్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో 15 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. – ప్రమోద్‌కుమార్, బాధితుడు -
పచ్చని కుటుంబంలో పెనువిషాదం
మధురవాడ/పీఎం పాలెం : ఆనందాల పొదరిల్లు అగ్నికి ఆహుతైపోయింది.. జీవితంపై ఎన్నో ఆశలు.. మరెన్నో కలలతో రెక్కల కష్టంతో ముందుకు సాగుతున్న ఆ కుటుంబం కలలన్నీ అగ్నికీలల్లో బూడిదైపోయాయి.. చేతికి అందొచ్చిన కుమారులను చూసుకుని మురిసిపోతున్న తల్లిదండ్రులను... ఆ తల్లిదండ్రులకు ఏ కష్టం రాకుండా వారు హాయిగా శేష జీవితం గడిపితే చూడాలనుకున్న కుమారులపై విధి కన్నెర్ర చేసింది.. ఒకరి వెంట ఒకరుగా వారం రోజుల వ్యవధిలో నలుగురినీ గ్యాస్ ప్రమాదం రూపంలో కబళించింది. బతుకుతెరువు కోసం నగరానికి పొట్ట చేత పట్టుకుని వచ్చిన ఈ కుటుంబం అర్ధంతరంగా కనుమరుగవడంతో మధురవాడ వాంబే కాలనీలో విషాదం నెలకొంది. వారం రోజుల కిందట ఇంటిలో గ్యాస్ లీకై సంభవించిన ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి ఇద్దరు కుమారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికులు, పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... రెక్కల కష్టంతో జీవనం విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లి గ్రామానికి చెందిన యామల బాలరాజుకు అదే జిల్లా చింతలవలస సమీపంలోని బెల్లాంకు చెందిన చిన్నితో గతంలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు గిరి, కార్తీక్. వారికి మంచి భవిష్యత్ అందించాలన్న ఉద్దేశంతో బతుకుతెరువు కోసం పిల్లలను తీసుకుని విశాఖ నగరానికి వలస వచ్చేశారు. అలా పలుచోట్ల జీవించి 15 ఏళ్ల నుంచి మధురవాడ సమీప వాంబేకాలనీలో బ్లాక్ నంబర్ 27 బీలోని ఎఫ్ఎఫ్ 1, 2 ఇళ్లలో అద్దెకి ఉంటున్నారు. భార్య చిన్ని ఇళ్లల్లో పనులు చేస్తుండగా, బాలరాజు కార్పెంటర్. కుమారులు గిరి ఓ కంపెనీ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండగా, కార్తీక్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బాలరాజు, గిరి, కార్తీక్ కొద్ది రోజుల కిందట భవానీ మాల ధరించారు. గ్యాస్ సిలిండర్ పిన్ బ్లాక్ అవ్వడంతో.. ఈ నెల 24న శుక్రవారం ఉదయం ఎఫ్ఎఫ్ 2 ఇంట్లో భవానీ మాలధారుల కోసం ప్రసాదం తయారు చేస్తున్నారు. ఆ సమయంలో సిలిండర్‌లో గ్యాస్ అయిపోవడంతో మరో సిలిండర్ అమర్చే క్రమంలో దాని పిన్ లోపలికి వెళ్లిపోయి బ్లాక్ అయిపోయింది. దీంతో బాగా గ్యాస్ లీకయింది. ఆ సమయంలో ఏమీ కనిపించక లైట్ వేయడంతోపాటు గదిలో దీపం కూడా ఉండడంతో... అప్పటికే ఇళ్లంతా వ్యాపించిన గ్యాస్ అంటుకుని అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మంటలను ఆర్పేందుకు కుటుంబ సభ్యులంతా తీవ్రంగా యత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో నలుగురూ మంటల్లో తీవ్రంగా కాలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే 108 సాయంతో కేజీహెచ్‌కు తరలించారు. మరోవైపు అగ్నిమాపక శకటం మంటలను ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అలుముకున్న విషాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ అగ్ని ప్రమాదంలో కాలిపోయి నాలుగు రోజుల వ్యవధిలోనే మృతి చెందడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాలిన గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చిన్న కుమారుడు కార్తీక్(20) ఆదివారం మరణించాడు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే పెద్ద కుమారుడు గిరి (21) మంగళవారం మధ్యాహ్నం మృతిచెందాడు. అతనికి అంత్యక్రియలు నిర్వహించడం ఆలస్యమవుతుందని మృతదేహాన్ని బుధవారం ఉదయం తీసుకొద్దామని బంధువులు ఆస్పత్రిలోనే ఉంచేశారు. ఇంతలో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజు (60), అతని భార్య చిన్ని (55) బుధవారం వేకువజామున మరణించారు. మాలధారణలో ఉండగా తండ్రి, ఇద్దరు కుమారులూ చనిపోవడంతో బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కుటుంబంలో అందరూ చనిపోవడంతో తలకొరివి పెట్టే వారు కూడా కరువయ్యారని, ఇలాంటి పరిస్థితి పగవారికి కూడా రాకూడదని స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. నాయకులు ఇచ్చిన డబ్బులతోపాటు స్థానికులు చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించి పెద్ద మనస్సు చాటుకున్నారు. మృతదేహాలకు వైఎస్సార్సీపీ భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి ముత్తంశెట్టి మహేష్ నివాళులర్పించారు. -
పంజాబ్‌లో విషాద ఘటన.. ఇంటిల్లిపాదీ సరదాగా క్రికెట్ మ్యాచ్ చూస్తూండగా.. అకస్మాత్తుగా..
-
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్
-
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్
సాక్షి, బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా: రాజోలు మండలం శివకోడులో రొయ్యల చెరువులకు నీళ్లు కోసం తవ్విన బోరుబావి నుంచి ఓఎన్జీసీ గ్యాస్ బయటకు వస్తుంది. గ్యాస్ లీక్‌తో మంటలు ఉద్ధృతంగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు(ఓఎన్జీసీ) సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఓఎన్జీసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలలను ఆర్పడంతోపాటు బోరుబావిలోంచి గ్యాస్ రావడానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి మూడు వైపులా మూసేసిన ఓఎన్జీసీ ఆన్ షోర్ బావులు ఉన్నాయి. అయితే నివాస స్థలాలకు దూరంగా ఉండటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: అదుర్స్.. సిరి ధాన్యాల టిఫిన్స్.. తింటే లాభాలేంటో తెలుసా? -
టాటా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్: కార్మికులకు గాయాలు
ఒడిశాలోని మేరమండలిలోని టాటా స్టీల్ లిమిటెడ్ ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కొంతమంది కార్మికుల తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గ్యాస్ లీక్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. దాదాపు 19 మంది గాయపడగా, ఆరుగురికి 40శాతం కంటే ఎక్కువ గాలిన గాయాలైనట్టు సమాచారం. BFPP2 పవర్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిందని ధృవీకరించిన సంస్థ అత్యవసర సేవలందిస్తున్నామని తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు ప్రమాదం సంభవించిందని, గాయపడిన కార్మికులకు ప్రాథమిక చికిత్స అనంతరం ముందు జాగ్రత్త చర్యగా తదుపరి చికిత్స కోసం కటక్‌కు తరలించినట్టు కంపెనీ తెలిసింది. Tata Steel Statement on Accident at BFPP2 Power Plant, Tata Steel Meramandali pic.twitter.com/sISjI2Wlaa — Tata Steel (@TataSteelLtd) June 13, 2023 అలాగే బాధిత ఉద్యోగుల కుటుంబ సభ్యులను సంప్రదించామని, వారికి తగిన సాయం అందిస్తున్నామని, ఆందోళన అవసరం లేదని కూడా పేర్కొంది. #WATCH | Gas leak in Odisha's Tata Steel plant: A total of 19 patients from Tata Steel's Meramandali plant in Dhenkanal were brought here. They have all suffered burns. Out of the 19 patients, 2 patients have also sustained fractures, and 6 of them are burnt above 40%. One… pic.twitter.com/LCKV9PU39i — ANI (@ANI) June 13, 2023 -
పరిస్థితి భయంకరం.. ఊపిరి తీసుకోరాలేదు.. ఎక్కడివాళ్లక్కడ పడిపోయారు
చండీగఢ్: పంజాబ్ లుధియానాలోని గియాస్పూరలో కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకై 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువ మంది వలస కార్మికులే ఉన్నారు. అయితే ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి అరవింద్ చౌబె.. ఉదయం గ్యాస్ లీకైనప్పుడు పరిస్థితి ఎలా ఉందో కళ్లకుగట్టినట్లు వివరించారు. ఊపిరి పీల్చుకోవడానికి స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని, ఎక్కడివాళ్లు అక్కడ స్పృహ తప్పిపడిపోయారని తెలిపారు. 'నేను మా సోదరుడు ఉదయం క్రికెట్ మ్యాచ్ ఆడాలనుకున్నాం. 7 గంటలకు గ్యాస్ లీకైందని నా సోదురుడు చెప్పాడు. వెంటనే మేం అక్కడకు చేరుకున్నాం. స్థానికులకు కాపాడేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. స్పృహ తప్పి పడిపోయిన వాళ్లలో ఒక వ్యక్తి బతికున్నాడని గమనించి వెంటనే అంబులెన్సు వరకు తీసుకెళ్లాం. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మేము ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డాం. ప్రాణాలతో బతికున్నామంటే నిజంగా మా అదృష్టం.' అని అరవింద్ చెప్పారు. అరవింద్ సోదరుడు ఆశీశ్ మాట్లాడుతూ.. తమ వాళ్లను కాపాడుకునేందుకు వెళ్లే క్రమంలో కొంతమంది విషవాయువు పీల్చి రోడ్డుపైనే కుప్పకూలారని తెలిపారు. ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్న తన భార్యపై నీళ్లుచల్లుతూ సాయం కోసం పిలిస్తే దగ్గరకు వెళ్లానని, ఈలోగా అతను కూడా స్పృహ కోల్పోయాడని వివరించాడు. ఈ ప్రాంతమంతా పొగ అలుముకుందని, ఎవరికీ ఊపిరాడలేదని పేర్కొన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి వచ్చారని తెలిపారు. మరో ప్రత్యక్ష సాక్షి అర్జూ ఖాన్ మాట్లాడుతూ.. విషవాయువు పీల్చి తన 12 సోదరుడు చనిపోయాడని బోరున విలపించాడు. గ్యాస్ లీకైనప్పుడు అతను గదిలోనే ఉన్నాడని పేర్కొన్నాడు. ఘటనలో చనిపోయినవారంతా దాదాపు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారేనని పేర్కొన్నాడు. కాగా.. గ్యాస్ లీకైన ప్రాంతాన్ని విపత్తు నిర్వహణ దళాలు నిర్బంధించాయి. ఇళ్లలో ఉన్నవారికి ఆస్పత్రికి తరలించాయి. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ -
ఉగాది రోజు విషాదం.. విషవాయువుతో ఊపిరాడక అన్నాదమ్ములు మృతి
సాక్షి, భద్రాద్రి: ఉగాది పండగ రోజున ఓ వలస కార్మికుల కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. అట్టల ఫ్యాక్టరీలో పల్ఫ్ (పేపర్‌గుజ్జు) ఉండే బావిని శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అన్నదమ్ములు విషవాయువుతో ఊపిరాడక ప్రాణాలొదిలారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఎస్ఎస్ అట్టల ఫ్యాక్టరీలో బుధవారం చోటుచేసుకుంది. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఫల్ప్ బావిని శుభ్రం చేసేందుకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కావాసి జోగా (21), కావాసి బుద్ధరామ్ (23) అనే వలస కార్మిక సోదరులు పది అడుగుల లోతు ఉన్న బావిలోకి నిచ్చెన సాయంతో దిగారు. వెంటనే ఇద్దరూ ఊపిరాడక కుప్పకూలారు. గమనించిన తోటి కార్మికులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకుని, వారిని బయటకు తీసేందుకు ఐదుగురు బావిలోకి దిగారు. వారిని బయటకు తీసుకొస్తున్న క్రమంలో మరో ఇద్దరు కూడా విషవాయువులతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వీరిలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొగ్గలి రాంబాబును భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొదట బావిలోకి దిగిన వలస కారి్మకులను బయటకు తీసుకురాగానే బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో కావాసి జోగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బుద్ధరామ్ భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. మృతులిద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా కాంకిపొర గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఫ్యాక్టరీలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పది మంది కారి్మకులు పని చేస్తున్నారు. సోదరులిద్దరూ ఒకేసారి మృత్యువాత పడటంతో అక్కడున్న వారిలో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హ్యాండ్ గ్రెనేడ్లు పేల్చేశారు! -
గ్యాస్ లీకై రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం
భవానీపురం(విజయవాడపశ్చిమ): కంప్రెషర్ నేచురల్ (సీఎన్జీ) గ్యాస్ లీకయిన కారణంగాఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో రెండు బస్సులు దగ్ధం అయ్యాయి. ఒకటి పూర్తిగా దగ్ధం కాగా పక్కనే ఉన్న మరో బస్ పాక్షికంగా కాలిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ 11 జడ్ 7482 నంబర్‌గల మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ శుక్రవారం రాజమండ్రిలో ఏకలవ్య మోడల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిమిత్తం స్పెషల్ సర్వీస్‌గా వెళ్లింది. తిరిగి రాత్రి సుమారు 2.30 గంటల సమయానికి డిపోకు చేరుకుంది. డిపో ఆవరణలోనే ఉన్న సీఎన్జీ గ్యాస్ బంక్‌లో గ్యాస్ నింపుకుని మెయింటెనెన్స్ కోసం గ్యారేజీలో పెట్టారు. అనంతరం గ్యారేజీ వెనుక భాగంలో పార్కింగ్ చేసేందుకు వెళుతుండగా గ్యాస్ సిలెండర్ల నుంచి గ్యాస్ లీకవ్వటాన్ని గమనించిన సిబ్బంది దగ్గరకు వెళ్లి చూసేలోపే మంటలు చెలరేగి బస్‌కు అంటుకున్నాయి. దీంతో అది పూర్తిగా దగ్ధం అయ్యింది. దాని పక్కనే పార్క్ చేసి ఉన్న ఏపీ జడ్ 7430 నంబర్‌గల మరో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌కు మంటలు అంటుకుని పాక్షికంగా (డ్రైవర్ క్యాబిన్‌తోపాటు వెనుక భాగాన కొన్ని సీట్లు) కాలిపోయింది. ఘటన జరిగిన విధానాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు పరిశీలించారు. -
సికింద్రాబాద్ కస్తూర్బాలో గ్యాస్ లీక్.. స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి కస్తూర్బా విద్యాసంస్థలో గ్యాస్ లీక్ కావడంతో కలకలం రేగింది. 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాలేజీ సైన్స్ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తుండగా విష వాయువు లీక్ కావడంతో విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రేపటి దాకా అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు వెల్లడించారు. చదవండి: వరంగల్‌లో నకిలీ నోట్ల కలకలం.. గుట్టలుగా రూ.2 వేల కట్టలు -
జీరో కోవిడ్ పాలసీ నా కొడుకుని పొట్టనబెట్టుకుంది..ఓ తండ్రి ఆవేదన
జీరో కోవిడ్ పాలసి నిబంధనల కారణంగానే నా మూడేళ్ల కొడుకు చనిపోయాడంటూ ఓ తండ్రి ఆగ్రహావేశాలతో విరుచుకుపడ్డాడు. ఈ కరోనా నిబంధనలే నా కొడుకు నిండు నూరేళ్ల జీవితాన్ని పరోక్షంగా పొట్టన బెట్టుకుందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తువో షిలీ గన్సు ప్రావిన్షియల్ రాజధాని లాన్‌జౌకి చెందిన టువో ఈ కోవిడ్-19 కఠిన నిబంధనల కారణంగానే తన కొడుకుని పొగొట్టుకున్నాని స్థానికి మీడియాకు తెలిపాడు. తన భార్య వంట చేస్తుండగా గ్యాస్ లీకైందని, మొదటగా తన భార్య స్ప్రుహతప్పి పడిపోయిందని, ఆ తర్వాత తన కొడుకు వెన్క్సువాన్ కూడా అపస్మారక స్థితిలో వెళ్లిపోయినట్లు చెప్పాడు. దీంతో తన కొడుకును వెంటనే సీఆర్పీ చేయించేందుకు స్థానిక కమ్యూనిటి ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కానీ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది టువోని లోనికి వెళ్లనివ్వలేదు. కొందురు అంబులెన్స్‌కి ఫోన్ చేయమని సలహ ఇచ్చారు. అక్కడే 30 నిమిషాలు వృధా కావడంతో వెన్స్కువాన్ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో అంబులెన్స్ కోసం చూడకుండా, స్థానికుల సాయంతో ట్యాక్సిలో కొడుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ ప్రాంతమంతా లాక్డౌన్ విధించడంతో పలుచోట్ల చెక్‌పోస్ట్‌ల వద్ద అనుమతి లిభించలేదు. ఏదోలా ప్రయాసపడి ఆస్పత్రికి చేరుకున్న తన కొడుకు ప్రాణాలు మాత్రం దక్కలేదని ఆవేదనగా చెప్పాడు. ఈ విషయమై లాన్జౌ ప్రభుత్వం, ఆరోగ్య శాఖ స్పందించలేదు. ఈ కరోనా కఠిన ఆంక్షలు పరోక్షంగా నా కొడుకు ప్రాణాన్ని పొట్టనబెట్టుకుందంటూ టువో భోరున విలపించాడు. ఈ ఘటన సోషల్ మాధ్యమంలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదీగాక రిటైర్డ్ స్థానిక అధికారి ఈ విషయామై ఆందోళన చేయను, పరిహారం కోరను అనే అగ్రిమెంట్‌పై సంతకం చేస్తే సుమారు రూ. 11 లక్షలు ఇస్తానంటూ ఒక ఆఫర్ ఇచ్చినట్లు టువో చెబుతున్నాడు. తాను దాన్ని తిరస్కరించినట్లు తెలిపాడు. ఆఖరికి తన కొడుకు అంత్యక్రియలు తన ఇంటి సమీపంలోనే జరిగాయని, క్యారంటైన్లో ఉండాల్సి వస్తుందన్న భయంతో హాజరు కాలేకపోయానని వాపోయాడు. (చదవండి: లాక్డౌన్ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం) -
బ్రాండిక్స్ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ సమీక్ష
-
గ్యాస్ లీకేజీ: ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి గుడివాడ అమర్నాథ్
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో ఎస్ఈజెడ్లోని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. గ్యాస్ లీక్ ఎలా అయింది అన్న విషయంపై ఆరా తీశారు. అయితే, దీనిపై స్పష్టత లేకపోవడంతో మంత్రి అమర్నాథ్ ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించాము. రెండు కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారు. ఎక్కడ నుంచి విష వాయువులు వచ్చాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎస్ఈజెడ్లో ప్రమాదాల నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తాము. ముందుగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే మా ఉద్దేశ్యం’’ అని అన్నారు కోలుకుంటున్న బాధితులు ఇదిలా ఉండగా.. గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులు కోలుకుంటున్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులు డిశ్చార్జి అవుతున్నారు. శనివారం ఉదయం ఎలమంచిలి ఆసుపత్రి నుంచి కోలుకున్న బాధితులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక, మరికొన్ని ఆసుపత్రుల్లో కొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. వారికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి డిశ్చార్జి చేయాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. ఇది కూడా చదవండి: '124 మంది చికిత్స పొందుతున్నారు.. ఎవరికీ ప్రాణాపాయం లేదు' -
అచ్యుతాపురం: బ్రాండిక్స్ కంపెనీలో విషవాయువు లీక్
అచ్యుతాపురం (అనకాపల్లి): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడ (ఎస్ఈజెడ్) లోని బ్రాండిక్స్ అపరెల్ పార్కు సిటీలో శుక్రవారం ఉదయం విషవాయువు లీకైంది. ఒక్కసారిగా కళ్ల మంటలు, శ్వాస తీసుకోలేకపోవడం, వాంతులతో అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులు విలవిల్లాడారు. అందరూ బయటకు పరుగులు తీశారు. సుమారు 178 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇద్దరికి విశాఖ కేజీహెచ్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, అస్వస్థతకు గురైన వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో బ్రాండిక్స్ సంస్థకు చెందిన దుస్తులు తయారు చేసే పెద్ద అపెరల్ పార్కు ఉంది. ఇక్కడ అందరూ మహిళలే పని చేస్తుంటారు. ఈ అపరెల్ పార్కులోని దుస్తులకు సంబంధించిన సీడ్స్ కంపెనీలో శుక్రవారం మ«ధ్యాహ్నం 11.20 గంటల సమయంలో గ్యాస్ లీకైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. కళ్ల మంటలు, వాంతులతో అల్లాడిపోయారు. ఆ సమయంలో సుమారు 800 మంది మహిళలు పనిచేస్తున్నట్లు సమాచారం. వారంతా బయటకు పరుగులు తీశారు. కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. విషవాయువు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అక్కడి సిబ్బంది అంచనా వేసి ముందుగా ప్రాథమిక చికిత్స చేసే యత్నం చేశారు. సొమ్మసిల్లి పడిపోయిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. అయితే, ఈ గ్యాస్ ఎక్కడి నుంచి లీకయిందన్న విషయం వెల్లడి కాలేదు. గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి ఆరా అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో హోంమంత్రి సమీక్షించారు. సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ పీల్చి ఇబ్బందిపడ్డ బాదితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, గ్యాస్ లీక్ అవుతున్న పరిశ్రమని అధికారులు కంట్రోల్ లోకి తీసుకోవాలని ఆదేశించారు. -
చైనాలో మరో విపత్తు!
బీజింగ్: చైనాలోని దక్షిణ గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న తైషాన్ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ గ్యాస్ లీకవుతోందని, ఇదొక భారీ విపత్తుగా మారనుందని అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక బహిర్గతం చేసింది. గత రెండు వారాల నుంచి గ్యాస్ లీకేజీ కొనసాగుతున్నట్లు తైషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో భాగస్వామ్యం ఉన్న ఫ్రాన్స్ సంస్థ ఫ్రామటోమ్ తెలిపింది. ఫ్రామటోమ్ ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఈ సమాచారాన్ని అమెరికాకు చేరవేసింది. దీంతో అమెరికన్ ఏజెంట్లు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. లీకేజీని ఆపకపోతే ఇది పెద్ద విపత్తుకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలను తైషాన్ ప్లాంట్ యజమాన్యం కొట్టిపారేస్తోంది. అంతా సాధారణంగానే ఉందని చెబుతోంది. తైషాన్ ప్లాంట్ నుంచి గ్యాస్ బయటకు వెళ్తున్నట్లు మే చివర్లో గుర్తించినట్లు ఫ్రాన్స్ సంస్థ తెలిపింది. జూన్ 3న అమెరికాకు చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ ఎనర్జీకి(డీఓఈ) తెలియజేసింది. సమస్యను› పరిష్కరించేందుకు సహకరించాలని కోరింది. అమెరికా నుంచి స్పందన రాకపోవడంతో జూన్ 8న మరోసారి విజ్ఞప్తి చేసింది. ప్లాంట్‌ను మూసివేసేందుకు చైనా యాజమాన్యం అంగీకరించడం లేదని పేర్కొంది. దీంతో అమెరికా పరిశోధకులు రంగంలో దిగారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేశారు. ప్రజల ప్రాణాలను హరించే విపత్తుగా మారకముందే గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తాము క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫ్రామటోమ్ సంస్థ సోమవారం తెలియజేసింది. తైషాన్ ప్లాంట్ కూలింగ్ సిస్టమ్ నుంచి ప్రమాదకర వాయువులు వెలువడుతున్నట్లు ఫ్రాన్స్ ఇంధన సంస్థ ఈడీఎఫ్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అలాంటి వాయువుల జాడలేదు అణు విచ్ఛిత్తిలోని ఉప ఉత్పత్తుల్లో నోబుల్ గ్యాసెస్ ఉంటాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని కూలింగ్ వ్యవస్థలో ఈ వాయువుల ఉనికి ఉన్నట్లయితే రియాక్టర్ లీకలవుతున్నట్లు లెక్క. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో పెద్ద అణువును చిన్న అణువులుగా విచ్ఛిత్తి చెందిస్తారు. ఈ ప్రక్రియలో అత్యధిక ఉష్ణోగ్రతతోపాటు వృథా వాయువులు వెలువడుతుంటాయి. తైషాన్ ప్లాంట్‌ను చైనా ప్రభుత్వ పరిధిలోని జనరల్ న్యూక్లియర్ పవర్ గ్రూప్ నిర్వహిస్తోంది. ప్లాంట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రమాదరకరమైన వాయువుల జాడ లేదని, పరిస్థితి మొత్తం సవ్యంగానే ఉందని ఈ గ్రూప్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్లాంట్ పరిసరాల్లో రేడియో ధార్మికత ఎంతుండాలనే దానికి ఒక పరిమితి ఉంటుంది. తాజా ఘటన నేపథ్యంలో చైనా ఈ పరిమితిని పెంచిందనే ఆరోపణలు వస్తున్నాయి. -
విషాదం: స్టౌని అలాగే ఉంచి అగ్గిపుల్లతో వెలిగించడంతో..
సామర్లకోట: వంట చేయడానికి వంట గదిలోకి వెళ్లిన ఓ మహిళ గ్యాస్ మంటలకు ఆహుతైన విషాద సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బ్రౌన్ పేట కుమ్మర వీధికి చెందిన గుబ్బల భవాని (35) శనివారం వంట చేయడానికి గ్యాస్ స్టౌను అగ్గిపుల్లతో వెలిగిస్తోంది. స్టౌ వెలగకపోవడంతో అలాగే ఉంచి పలుమార్లు అగ్గిపుల్లలు వెలిగింది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో గ్యాస్ లీకైంది. ఆ సమయంలో అగ్గిపుల్ల వెలగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి, భవాని సజీవ దహనమైంది. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న భర్త చిన్న కుమారుడిని తీసుకొని బయటకు వెళ్లాడు. ఇంటి సమీపంలో భవాని ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తోంది. షాపు వద్ద పెద్ద కుమారుడు, అత్తను ఉంచి, మధ్యా హ్నం వంట చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంటి నుంచి మంటలు రావడం, భవాని కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న ఆమె బావ కుమారుడు గమనించి, భవాని పెద్ద కుమారుడిని తీసుకుని అక్కడకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న నీటితో మంటలు అదుపు చేశారు. అప్పటికీ గ్యాస్ లీకవడం గమనించి వారు అదుపు చేశారు. విషయం తెలిసిన వెంటనే పెద్దాపురం సీఐ వి.జయకుమార్, ఎస్సై వీఎల్‌వీకే సుమంత్, వార్డు కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్టౌ వద్ద ఐదు అగ్గిపుల్లలు ఉండటం గమనించారు. వెంటనే స్టౌ వెలగకపోవడం, గ్యాస్ వ్యాపించి ఉన్న సమయంలో మరో అగ్గిపుల్ల వెలగడంతో మంటలు వ్యాపించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాకినాడ రూరల్ పెనుమర్తికి చెందిన భవానీకి 16 ఏళ్ల క్రితం సామర్లకోట బ్రౌన్‌పేటకు చెందిన గుబ్బల రామకృష్ణతో వివాహమైంది. అత్త లక్ష్మి, పెద్ద కుమారుడు అర్జున్ గణేష్, చిన్న కుమారుడు వేణుతేజ ఉన్నారు. కుమార్తె మరణ వార్త తెలుసుకొని తల్లిదండ్రులు దెయ్యాల మహలక్ష్మి, కామరాజులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం తరలించి, ఎస్సై సుమంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్’ సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు -
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ముగ్గురి మృతి
సాక్షి, నెల్లూరు: వింజమూరు మండలం చండ్రపడియాలో విషాదం చోటు చేసుకుంది. చండ్రపడియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ లీకై ముగ్గురు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో గతంలోనూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. చదవండి: ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం మామిళ్లపల్లి పేలుడు కేసులో ఇద్దరి అరెస్ట్ -
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. నలుగురు మృతి
ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో బుధవారం గ్యాస్ లీకవ్వడం వల్ల నలుగురు కార్మికులు మృత్యువాత పడగా, మరి కొంత మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నసెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లోని ఓ యూనిట్లో బుధవారం ఉదయం ఒక్కసారిగా విషపూరిత గ్యాస్ లీకయ్యింది. ప్లాంట్‌లోని కోల్ కెమికల్ డిపార్ట్మెంట్ ప్లాంట్ నుంచి కలుషిత గాలి వ్యాపించింది. దాన్నిపీల్చి స్పృహ తప్పి పడిపోయిన వారిని ప్లాంట్ సమీపంలో ఉన్న హాస్పిటల్లో చేర్పించగా. అనంతరం ఐసీయూలో చికిత్స పొందుతూ నలుగురు కార్మికులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ప్లాంట్‌లో 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. చదవండి: రతన్ టాటా కారుకు ఈ-చలాన్లు..? మరికొందరు క్షతగాత్రులను ఇస్పాట్ జనరల్ హాస్పిటల్‌కి తరలించారు. మిగిలినవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. కాగా మరణించిన నలుగురు ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. యూనిట్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదల కావడం వల్ల ఈ నలుగురు కార్మికులు మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. గ్యాస్ లీకేజీకి సంబంధించి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆర్ఎస్పీ అధికారులు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. -
‘ఆయన రాజకీయం కోసమే పనిచేస్తారు’
-
చంద్రబాబు.. యూటర్న్ నాయుడు
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ నుంచి 13 వేల టన్నుల స్టైరిన్‌ను విదేశాలకు తరలిస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. రేపు (బుధవారం) ఉదయం 8వేల స్టైరిన్‌ను ఒక షిప్ ద్వారా వెనక్కి పంపిస్తున్నామని.. మే 17లోపు మిగిలిన స్టైరిన్‌ను కూడా పంపిస్తామని వెల్లడించారు. బాధిత గ్రామాల్లో మెడికల్ బృందాలు అనుక్షణం పనిచేస్తాయని తెలిపారు. బాధిత గ్రామం వెంకటాపురంలో ప్రత్యేకంగా వైఎస్సార్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్యాస్ లీకేజ్ ఘటనపై కమిటీలు పనిచేస్తున్నాయని తెలిపారు. (స్టైరీన్‌ను వెనక్కి పంపిస్తున్నాం: కన్నబాబు) ఆ కంపెనీతో సంబంధం లేదు.. ఇప్పటివరకు మృతుల కుటుంబాల్లో 8 మందికి రూ.కోటి సాయం అందించామని.. మిగిలిన వారికి రేపటిలోగా పరిహారం వారి ఖాతాల్లో వేస్తామన్నారు. తనకు, ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలో రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి పనిచేస్తున్నాడని.. తనకు బంధువని టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాలను ఆయన ఖండించారు. చంద్రబాబును యూటర్న్ నాయుడిగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. (చదవండి: స్టైరిన్ తరలింపు ప్రక్రియ ప్రారంభం) -
‘చంద్రబాబుకు మనసు లేదు’
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ ఘటనను రాజకీయం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై బురదచల్లే విధంగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు, ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రమాద సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందన్నారు. పోలీసులు వెంటనే స్పందించకుండా ఉంటే ప్రమాద తీవ్రత మరోలా ఉండేదన్నారు. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులను పరామర్శించడమే కాకుండా మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని తెలిపారు. (‘అది టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ’) మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ఐఏఎస్‌లపై అవమానకరంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబుకు తన మంత్రులపై నమ్మకం లేక తానే పనిచేసినట్లు ప్రచారం చేసుకోవడం అలవాటని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్‌కు ప్రచారం అవసరంలేదన్నారు. ఏడుగురు మంత్రులు, సీఎస్‌ను విశాఖలోనే ఉండాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ఫ్యాక్టరీతో తమకు సంబంధంలేదని, ఆ కంపెనీపై ప్రత్యేక ప్రేమలేదని మంత్రి స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఐదు గ్రామాల ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తమకు ప్రజలే ముఖ్యమని తెలిపారు. చంద్రబాబుకు మనసు లేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో కూర్చోని ట్వీట్లు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. (‘ప్రచార్భాటంతో ఆయనలా చేసి ఉంటే..’) -
‘ప్రచార్భాటంతో ఆయనలా చేసి ఉంటే..’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని.. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌లో కుర్చోని బురద చల్లుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. విశాఖ గ్యాస్ లీక్ సంఘటనలో సాయం అందించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సఫలమయ్యిందన్నారు. హుదూద్ తుఫాను సమయంలో చంద్రబాబు ప్రచార్భాటాలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా గ్యాస్ లీకేజీ ఘటనలో నష్టపోయిన కుటుంబాలను వైఎస్ జగన్ ఆదుకున్నారని తెలిపారు. చంద్రబాబు రూ.25 లక్షలు డిమాండ్ చేస్తే.. సీఎం జగన్ కోటి రూపాయలను ప్రకటించారని తెలిపారు. మళ్ళి కోటి రూపాయలు ఎందుకంటూ చంద్రబాబు బురదచల్లుతున్నారని దుయ్యబట్టారు. (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం) పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రచార్భాటాలు 29 మందిని పొట్టన పెట్టుకున్నాయని.. అప్పట్లో మృతులను ఉద్దేశించి ఆయన నీచంగా మాట్లాడారని గుర్తుచేశారు. ప్రతిపక్షం గట్టిగా నిలదీస్తే కేవలం పదిలక్షలు మాత్రమే ప్రకటించారని ధ్వజమెత్తారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం తప్పిదం లేకపోయిన సహయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబులా ప్రచార్భాటాలకు పోయి నిర్లక్ష్యం చేసి ఉంటే వేలాది మంది మృత్యువాత పడేవారని తెలిపారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రధాని మోదీని, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వం అన్నారని.. నేడు శవ రాజకీయాలు చేసేందుకు సిగ్గులేకుండా విశాఖకు వెళ్లడానికి కేంద్రం అనుమతి అడిగారని విమర్శలు గుప్పించారు. (విశాఖ విషాదం: ఎల్జీ పాలిమర్స్ క్షమాపణ) కరోనాను ఎదుర్కొనేందుకు కరకట్టపై అక్రమంగా నిర్మించుకున్న కట్టడంలో క్వారంటైన్ లో వుండి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు అనుమతి అడిగావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన ప్రజా సంక్షేమం కన్నా శవ రాజకీయానికే పెద్దపీట వేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశానికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శంగా నిలిచారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. -
విష వాయువు లీకేజీ
రాయ్‌పూర్: లాక్డౌన్ కారణంగా కొంతకాలంగా మూతబడి ఉన్న కాగితం తయారీ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించే క్రమంలో విషవాయువు లీక్ అయి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. టెట్లా గ్రామానికి సమీపంలోని శక్తి పేపర్ మిల్ లాక్డౌన్ కారణంగా కొంతకాలంగా మూతబడి ఉంది. కర్మాగారాన్ని మళ్లీ ప్రారంభించేందుకు గాను బుధవారం సాయంత్రం కార్మికులు ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏడుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
గ్యాస్ లీక్ ఘటనపై విచారణ జరిపిస్తాం : గౌతమ్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటన సమాచారం అందినే వెటనే అధికార యాంత్రాంగం తక్షణమే స్పందించింది. గురువారం తెల్లవారుజామున రసాయన వాయువు లీకేజీ అయిన ఘటనలో ఆరుగురు మృతిచెందగా, 200 మందికి పైగా అస్వస్థతకు లోనయ్యారు. ఈ ప్రమాదంపై సమచారం అందగానే పరిశ్రామల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. తక్షణమే ప్రాణ నష్ట నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. పరిశ్రమకు చుట్టుపక్కల గ్రామాలైన నరవ, ఆర్ఆర్ పురం, టైలర్స్ కాలనీ, బీసీ కాలనీ, బాపూజీనగర్, కంపరపాలెం, కృష్ణానగర్ ప్రజలకు సాయంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. (చదవండి : విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం) ఇందుకు సంబంధించి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్యాస్ లీకేజీ అగిపోయిందని.. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. బాధితులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. గ్యాస్ లీక్ వలన ఉన్నపలంగా ఇళ్లను వదిలివచ్చిన ప్రజలకు ఏ లోటు లేకుండా చూడాలని మంత్రి గౌతమ్‌రెడ్డి కలెక్టర్‌కు సూచించారు. జిల్లా యంత్రాంగానికి సహకారంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ను మంత్రి ఆదేశించారు. ప్రతి ఒక్కరికి సాయం అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తుందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు, యువత.. స్థానిక ప్రజలను దూరంగా తరలించడం అభినందనీయం అని చెప్పారు. కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు.. గ్యాస్ లీక్ ఘటనలో కంపెనీ యాజమాన్యంపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌తో పాటు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే మీనా మాట్లాడుతూ.. స్టేరైన్ గ్యాస్ లీక్ అవ్వడంతో గ్రామాన్ని ఖాళీ చేయించామని తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటిని డోర్ టు డోర్ సర్వే చేస్తున్నామని వెల్లడించారు. గ్యాస్ ప్రభావం ఒకటిన్నర కిలోమీటర్ల పరిధి ఉంటుందని.. గ్యాస్ ప్రభావాన్ని పూర్తిగా నిరోధించామని తెలిపారు. (చదవండి : ఎల్జీ పాలిమర్స్ పుట్టుక గురించి..) సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.. : కన్నబాబు విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటనపై విశాఖపట్నం జిల్లా ఇంచార్జ్ మంత్రి కురసాల కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. మరో 2 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని మంత్రి చెప్పారు. పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. అధికార బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని అన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. -
గ్యాస్‌లీకై పేలుడు
కర్నూలు, వెల్దుర్తి: పట్టణ సమీపంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ ఆవరణలోని ఇంట్లో బుధవారం తెల్లవారుజామున సిలిండర్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఇంటి గది పూర్తిగా ధ్వంసమైంది. వెల్దుర్తి పట్టణానికి చెందిన గొల్ల మురళి, భార్య లక్ష్మి (దివ్యాంగురాలు) రెండు సంవత్సరాలుగా.. గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు ఎల్లకృష్ణ, పరశురాముడు ఉన్నారు. ఫ్యాక్టరీ ఆవరణలోని కార్మికులకు నిర్మించిన గదిలోనే కుటుంబమంతా నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి కరెంట్ ఆఫ్ చేసుకుని, తలుపులు, కిటికీలు మూసుకుని నిద్రించారు. మురళి.. బుధవారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో నిద్ర లేచి లైట్ వేయడంతో అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో ఒక్క సారిగా పెద్ద శబ్దం వచ్చింది. మంటలు వ్యాపించడంతో మురళితోపాటు నిద్రిస్తున్న అతని భార్య, పిల్లలకు గాయాలయ్యాయి. పేలుడు ధాటికి గది తలుపులు, కిటికీలతో సహా మూడు వైపులా ఉన్న ఇటుక గోడలు చెల్లాచెదురయ్యాయి. పైకప్పు కూలిపోయింది. క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మురళి, అతని భార్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వెల్దుర్తి తహసీల్దార్ రజనీకుమారి, డోన్ రూరల్ ఎస్ఐ మధుసూదన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్దుర్తి ఎస్ఐ నరేంద్రకుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు ప్రమాదానికి కారణమేమి? కుటంబ సభ్యులు నిద్రిస్తున్న గదిలోనే వంట గది కలిసి ఉండడం, వంటకు ఉపయోగించే గ్యాస్ లీకై రాత్రంతా గదిలో వ్యాపించి, మురళి లైట్ వేయడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిద్రించే సమయంలో వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయకపోవడంతోపాటు, స్టవ్ నాబ్ పూర్తిగా ఆఫ్ చేయకపోవడమా?, లేదా సిలిండర్, పైప్ లీకేజీనా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇంత పెద్ద అగ్ని ప్రమాదంలో కేవలం కుటుంబ సభ్యులకే మంటలు వ్యాపించడం, తక్కిన ఏ వస్తువులకూ ఏమీ కాకపోవడం, గదిలోనే ఉన్న గొర్రెపిల్ల క్షేమంగా ఉండడం బట్టి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రజనీకుమారి, డోన్ రూరల్ ఎస్ఐ మధుసూదన్ రావ్ ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. పేద కుటుంబంలో తీవ్ర విషాదం గ్యాస్ ప్రమాదంలో గాయపడ్డ మురళి, భార్య లక్ష్మి 15 ఏళ్లుగా గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనిచేసుకుంటూ కాలం గడుపుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబమైనా ఫ్యాక్టరీ ఆవరణలో నిర్మించిన గదిలోనే తలదాచుకుంటూ తమ ఇద్దరు కుమారులను చదివించుకుంటున్నారు. ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి మొత్తం ధ్వంసమైంది. పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఏసీ నుంచి విషవాయువులు.. ముగ్గురు మృతి!
సాక్షి, చెన్నై : పాడైపోయిన ఏసీ ముగ్గురు ప్రాణాలను తీసింది. ఏసీ నుంచి వెలువడిన విషవాయువులను పీల్చడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన శరవణన్(38), అతడి భార్య కలైరాశి(30), కుమారుడు కార్తీక్(8)లు మృతిచెందినట్టు అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. తమిళనాడులోని కోయంబేడు సమీపంలోని మెట్టుకులమ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం శరవణన్ కుటుంబసభ్యులు ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లి చూడడంతో వారంతా విగతజీవులుగా కనిపించారు. సోమవారం రాత్రి విద్యుత్ పోవడంతో దంపతులు ఇన్వర్టర్ ఆన్ చేశారని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. అర్ధరాత్రి వేళ మళ్లీ పవర్ వచ్చిందనీ, అయితే పాడైపోయిన ఏసీ నుంచి విషవాయువులు వెలువడడంతో ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ కిల్పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
శాంసంగ్ ప్లాంట్‌లో ప్రమాదం : గ్యాస్ లీక్...
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చిప్ ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. కార్బన్ డయాక్సైడ్ లీక్ అయి ఒకరు మృతి చెందగా.. ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సియోల్‌కు దక్షిణం పక్కనున్న సువోన్‌లోని సెమీ కండక్టర్ ప్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చిప్ ప్లాంట్‌లో ఒక్కసారిగా గ్యాస్ లీకై, కార్బన్ డయాక్సైడ్ అంతా ప్లాంట్‌వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఆ ప్లాంట్‌లో పనిచేస్తున్న ముగ్గురు వర్కర్లు అపస్మారక స్థితిలోకి వెళ్లారని దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ తెలిపింది. వీరిలో 24 ఏళ్ల ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించాడు. 26, 54 ఏళ్ల వయసున్న మిగిలిన ఇద్దరు అపస్థారక స్థితిలో ఉన్నట్టు తెలిసింది. కార్బన్ డయాక్సైడ్ లీక్ కావడంతో, గాలి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అయి, ఒకరు ప్రాణాలు విడిచినట్టు శాంసంగ్ తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టినట్టు కూడా పేర్కొంది. శాంసంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్, మెమరీ చిప్‌ల తయారీదారి. ఇటీవల కాలంలో దిగ్గజ కంపెనీల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు చేసుకోవడం తరచు వార్తల్లో నిలుస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో సురక్షితమైన పద్ధతులను మెరుగుపరచడానికి కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ, ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ దేశంలో టాప్ స్టీల్ తయారీ కంపెనీ పోస్కోలో కూడా గ్యాస్ లీకై, నలుగురు వర్కర్లు చనిపోయారు. -
విషవాయువులు లీకై ఆరుగురు కార్మికులు దుర్మరణం
-
తాడిపత్రి స్టీల్ ఫ్యాక్టరీలో విషాదం ఆరుగురు మృతి
-
తాడిపత్రి స్టీల్ ఫ్యాక్టరీలో విషాదం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో గురువారం విషాదం అలముకుంది. స్థానిక గెరుడౌ స్టీల్ ఫ్యాక్టరీలో విష వాయువు విడుదల కావడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు. పెద్దగదిలో పది మంది కార్మికులు పని చేస్తుండగా విష వాయువు విడుదలైనట్లు తెలిసింది. దీంతో ఆ వాయువును పీల్చిన వారిలో రంగనాథ్, మనోజ్, లింగయ్య, గంగాధర్, వసీమ్, గురవయ్యలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని మిగిలిని కార్మికులు హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, సకాలంలో లోపాలను సవరించకుండా నిర్లక్ష్యం చేయడంతోనే విషవాయువు లీకైందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంకా వెల్లడించలేదు. కార్బన్ మోనాక్సైడ్ లీకవటంతో ప్రమాదం జరిగిట్టు ప్రాథమిక సమాచారం. 400 చదరపు అడుగుల గదిలో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా లీకైనట్టు తెలుస్తోంది. తొలుత ముగ్గురు మృతి చెందగా, వారిని కాపాడేందుకు వెళ్లి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారందరూ నిరుపేదలుగా తెలుస్తోంది. ఉపాధి కోసం వారు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. పనికి వెళ్లిన వారు విగతజీవులు కావడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి తాడిపత్రి స్టీల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం ప్రకటించారు. విష వాయువు బారినపడిన బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్టీల్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలను తాడిపత్రి ఆసుపత్రిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు పైలా నరసింహయ్య, రమేశ్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం, ఒక ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడిపత్రిలో ఉద్రిక్తత గెరుడౌ స్టీల్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చిన టీడీపీ నేత జిలాన్ బాషాను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు. గెరుడౌ స్టీల్ ఫ్యాక్టరీపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
బాత్రూంలో మంటలు.. టెకీ, భార్యకు తీవ్రగాయాలు
యశవంతపుర: స్నానం గదిలో గ్యాస్ లీకై భర్త, భార్య అనుమానాస్పదరీతిలో మరణించిన ఘటన బెంగళూరు రాజరాజేశ్వరినగర పోలీసుస్టేషన్ జరిగింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు. వివరాలు.. పట్టణగెరెలోని శివగంగా అపార్ట్మెంట్లో ఐటీ ఇంజినీరు మహేశ్ (32), భార్య శీల (29)తో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం ఉదయం స్నానం చేస్తుండగా గీజర్‌కు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు లేచి మహేశ్‌ను చుట్టుముట్టాయి. భర్త కేకలు విని శీల రక్షించేందుకు వెళ్లి ఆమె కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరూ కాలిన గాయాలతో విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతు మంగళవారం సాయంత్రం మరణించారు. అనుమానాలు.. విచారణ లీకైన గ్యాస్ వెంటిలేటర్ లేని కారణంగా బయటకు వెళ్లక పోవటంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు అనుమానించారు. ఇప్పుడు బార్యభర్తల మృతిపై పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయి. దీనితో పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు. స్నానాల గదికి వెంటిలేటర్ ఎందుకు వేయలేదు, గ్యాస్ ఎలా లీకైంది అనేది ఆరా తీస్తున్నారు. ఘటనాస్థలిని వేలిముద్రలు, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. రాజరాజేశ్వరినగర పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల స్వస్థలం చిత్రదుర్గం జిల్లాగా తెలిసింది. -
అంతర్వేదికరలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్
-
కోల్డ్ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్ లీక్
- 33 మంది విద్యార్థులకు అస్వస్థత మధ్యప్రదేశ్: అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక భరతి ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న కోల్డ్‌స్టోరేజ్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకవడంతో.. 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ప్రత్యేక అంబులెన్స్‌ల సాయంతో ఆస్పత్రికి తరలించారు. -
ఎక్స్‌ప్రెస్ రైల్లో గ్యాస్ లీక్..
చిత్తూరు: తిరుపతి నుంచి పూరి వెళ్తున్న పూరీ ఎక్స్‌ప్రెస్‌లో కలకలం రేగింది. జనరల్ కంపార్ట్మెంట్లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ప్రయాణికుల్లో ఒకరు అలారమ్ చైన్ లాగడంతో రైలు ఆగింది. ఈ సమాచారాన్ని వెంటనే రైల్వే పోలీసులకు ప్రయాణికులు తెలిపారు. ఒంగోలు నగరానికి చెందిన అనిల్ కుమార్(40) అనే వ్యక్తి తనతో మూడు చిన్న గ్యాస్ సిలిండర్ల(5 కేజీ)ను పాలిథీన్ బ్యాగులో పెట్టుకుని వచ్చాడు. దాంట్లో ఒకటి లీక్ కావడంతో విషయం బయట పడింది. పోలీసులు అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర వస్తువులతో రైలు ప్రయాణం చేయడంతో రైల్వే యాక్ట్ 164 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతర్వేదిలో మళ్లీ గ్యాస్ లీక్
సఖినేటిపల్లి: ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికం భయాందోళనలకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామ శివారులోని 20వ నెంబర్ బావి నుంచి శుక్రవారం ఉదయం గ్యాస్ లీక్ అవుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేస్తున్నారు. గ్యాస్ లీక్ ను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. -
ఢిల్లీలో ఇంకా గ్యాస్ లీక్ కలకలం
-
గ్యాస్ లీక్.. 110 మంది విద్యార్థులకు అస్వస్థత
-
గ్యాస్ లీక్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత
-
గ్యాస్ లీక్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత
దక్షిణ ఢిల్లీలో తెల్లవారుజామునే పెనుప్రమాదం త్రుటిలో తప్పింది. తుగ్లకాబాద్‌కు సమీపంలోని పుల్ పెహ్లాద్పూర్ ప్రాంతంలో ఉన్న రాణీ ఝాన్సీ స్కూలు సమీపంలో ఓ కంటెయినర్ నుంచి గ్యాస్ లీకైంది. దాంతో వంద మంది విద్యార్థులను స్కూలు నుంచి వెంటనే బయటకు తీసుకొచ్చేశారు. వారిలో 50 మంది అస్వస్థత పాలు కావడంతో వారిని వెంటనే సమీపంలో ఉన్న మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఘటన స్థలానికి అంబులెన్సులతో పాటు పోలీసులు చేరుకున్నారు. గ్యాస్ లీకేజికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్యాస్ లీకైన సమయానికి ఎక్కడా మంటలు లేకపోవడం.. సమయానికి అప్రమత్తమై విద్యార్థులను బయటకు తీసుకొచ్చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ పైపులైన్ల నుంచి గ్యాస్ లీకైనప్పుడు టీ పెట్టేందుకు స్టవ్ వెలిగించాలని అగ్గిపుల్ల గీస్తే.. ఆ మంటలు ఊరంతా వ్యాపించిన గ్యాస్‌కు అంటుకుని భారీ ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. -
కుషాయిగూడలో తప్పిన ముప్పు
కుషాయిగూడ: గ్యాస్ లీక్ అవుతుందనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో నివాసముంటున్న దేవేందర్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఇది గుర్తించిన ఇంటి యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. తక్షణమే స్పందించిన అధికారులు గ్యాస్ సిలిండర్‌ను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి గ్యాస్ లీకేజీని ఆపేశారు. అప్పటికే సిలిండర్ బాగా వేడెక్కిందని.. మరి కొంతసేపు అలాగే ఉంటే సిలిండర్ పేలి పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. -
గ్యాస్ సిలిండర్ పేలి మగ్గాలు దగ్ధం
– రూ.2 లక్షల ఆస్తినష్టం మదనపల్లెటౌన్: గ్యాస్ లీకై మంటలు వ్యాపించి మగ్గాలు దగ్ధమైన ఘటనలో రూ.2లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన మంగళవారం రాత్రి నీరుగట్టువారిపల్లెలో జరిగింది. అగ్నిమాపక అధికారి అనిల్‌కుమార్ కథనం మేరకు వివరాలు.. రామిరెడ్డి లేవుట్లోనివాసం ఉంటున్న లక్ష్మీనారయణ ఇంటిలో మగ్గాలు నేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అతని భార్య సరోజమ్మ, సాయంత్రం సిలిండర్‌తో స్టౌవ్ వెలిగించి వంటచేసింది. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకవడంతో మంటలు వ్యాపించి మగ్గాల గది అగ్నికి ఆహుతైంది. మరో ఫుల్ సిలిండర్ కూడా పేలడంతో ఇంటిలోని వంట సామగ్రి, ఫర్నీచర్, బట్టలు, మగ్గాలు, పట్టుచీరలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది రామచంద్రయ్య, సుబ్బరాజు, కిరణ్‌బాబు, సుబ్బయ్య, లక్ష్మీనారాయణ, సుబ్రమణ్యం తదితరులు మంటలను అదుపు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. పరుగులు తీసిన ప్రజలు
గొల్లప్రోలు(తూర్పుగోదావరి): వేగంగా వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా.. గ్యాస్ లీక్ అవుతుందనే భయంతో స్థానికులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చందుర్తి శివారులోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి సమీపంలోని గుమ్మళ్లదొడ్డి హెచ్‌పీ గ్యాస్ ఫిల్లింగ్‌స్టేషన్‌కు గ్యాస్ తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగనట్లు తెలిసింది. -
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్..ఇద్దరి మృతి
మల్కాజిగిరి పరిధిలోని ఐడీఏ మౌలాలీలో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో గురువారం వేకువజామున గ్యాస్ లీకేజీ అయింది. ఈ ఘటనతో అందులో పనిచేసే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ధీరజ్ మహతో(20)ది పశ్చిమ బెంగాల్ కాగా..విజయ్‌కుమార్(28)ది బిహార్. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ల్యాబ్‌లో గ్యాస్ లీక్: ఇద్దరు మృతి
హైదరాబాద్: మౌలాలీలోని ఓ కెమికల్ ల్యాబ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అవ్వడంతో ఇద్దరు మృతిచెందారు. మృతులు ధీరజ్, విజయ్‌లుగా గుర్తించారు. -
కేజీబీవీలో అగ్ని ప్రమాదం
వీరఘట్టం : రేగులపాడు గ్రామంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో పాఠశాలలోని కిచెన్ రూంలో వంటలు వండుతుండగా గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు ఉధృతంగా మారాయి. ఈ సమయంలో గ్యాస్ వండుతున్న సిబ్బంది గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చి తరగతి గదుల్లో ఉన్న విద్యార్థినిలను అప్రమత్తం చేశారు. దీంతో విద్యార్థినిలు హాహాకారాలు చేస్తూ పాఠశాల నుంచి బయటకు వచ్చేయగా, అక్కడే ఉన్న కొంతమంది సిబ్బంది, సీఆర్టీలు మేల్కొని ఇసుకను లీకైన గ్యాస్‌సిలిండర్ పైకి వేయడంతో పాటు మంటలు అదుపులోకి రాగానే కిచెన్రూంలోని మిగిలిన గ్యాస్ సిలిండర్లును బయటకు నెట్టివేశారు. గ్యాస్ లీకైన సిలెండర్లో తక్కువ గ్యాస్ ఉండడంతో ప్రమాదం అదుపులోకి వచ్చింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
మళ్లీ అదే నిర్లక్ష్యం..
సాక్షి, సిటీబ్యూరో: మళ్లీ అదే నిర్లక్ష్యం.. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద మ్యాన్‌హోల్‌లో దిగి నలుగురు కార్మికులు మృత్యువాత పడిన ఘోర దుర్ఘటనను మరువకముందే గురువారం సఫిల్‌గూడలో మరో నలుగురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. జలమండలి పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ప్రమాదాల తీరును పరిశీలిస్తే పనులు చేపట్టిన సంస్థలు, గుత్తేదారులు కార్మికుల ప్రాణాల రక్షణకు భద్రతా చర్యలు తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమే కారణంగా కనిపిస్తోంది. నూతనంగా నిర్మిస్తున్న మంచినీటి పైప్‌లైన్ జాయింట్లకు గ్యాస్ వెల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్‌పైప్ లీకై మంటలు వ్యాపించాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సాధారణంగా వెల్డింగ్‌కు ఉపయోగించే వాణిజ్య విభాగం గ్యాస్కిట్ (వెల్డింగ్ గ్యాస్కిట్) కాకుండా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్‌ను వినియోగించడమే ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మైల్డ్‌స్టీల్‌తో తయారు చేసిన ఈ భారీ పైప్‌లైన్‌కు జాయింట్ వేసే క్రమంలో కనీసం ఆక్సిజన్ సిలిండర్లు, అగ్ని నిరోధక దుస్తులు, బూట్లు, హెడ్‌లైట్, టార్చ్ వంటి ఉపకరణాలేవీ లేకుండా నేరుగా పైప్లైన్లోనికి కార్మికులను దించడంతోనే ప్రమాదం సంభవించినట్టు స్పష్టమవుతోంది. ఆగడాలకు అడ్డుకట్ట ఏదీ? జలమండలి పరిధిలో ఏటా సుమారు రూ.100 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు, నిర్వహణ పనులు జరుగుతుంటాయి. మల్కాజ్గిరి ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రూ.300 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థ పనులు జరుగుతున్నాయి. ఇవి తుది దశకు చేరుకున్నాయి. పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టు సంస్థలు ఉపగుత్తేదారులకు ఇచ్చి పనులు చేపడుతున్నాయి. ప్రధాన ఏజెన్సీలు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 30 శాతం లాభం రాబట్టుకొని మిగతా మొత్తానికి సబ్ కాంట్రాక్టులిచ్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. ప్రధాన ఏజెన్సీల పర్యవేక్షణ లేకపోవడం... నిపుణులతో అవసరమైన సలహాలు, సూచనలు అందించకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతుండడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. మరో వైపు సబ్‌కాంట్రాక్టులు పొందిన కాంట్రాక్టర్లు తమ లాభం తగ్గుతుందనే భావనతో భద్రతా ఉపకరణాల కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కార్మికుల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతుండడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఈ దుర్ఘటనకు కారణమైన కాంట్రాక్టర్లు, ప్రధాన ఏజెన్సీలు, పర్యవేక్షించని జలమండలి క్షేత్రస్థాయి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా ఉపకరణాలు లేకుండా కార్మికులను పనిలోకి దించడాన్ని నిరోధించాలని కోరుతున్నాయి. గాయాలపాలైన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. జీఎం సరెండర్ సఫిల్‌గూడ దుర్ఘటనకు బాధ్యులపై క్రిమినల్ కేసులు సాక్షి, సిటీబ్యూరో: ఈనెల 13న మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద మ్యాన్హోల్లోకి దిగి నలుగురు కార్మికులు మృతిచెందిన ఘటనకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక అందేవరకు ప్రాజెక్టు విభాగం జనరల్ మేనేజర్(పీడీ–8) సుదర్శన్‌ను బోర్డు ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేసినట్లు జలమండలి ఎమ్డీ దానకిశోర్ తెలిపారు. ఈ దుర్ఘటనపై జలమండలి శాఖాపరమైన విచారణ నివేదికలో పనులు చేపట్టిన జీఎస్కే సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలిందన్నారు. అలాగే గురువారం సఫిల్‌గూడ వద్ద పైపులైన్ జాయింట్ వెల్డింగ్ పనుల్లో గ్యాస్‌పైపు లీకైన నలుగురు కార్మికులు గాయాల పాలైన ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ఎమ్డీ స్పష్టం చేశారు. కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం జలమండలి పరిధిలో నిర్వహణ, ప్రాజెక్టు పనులు చేపడుతున్న ప్రధాన ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. -
మామిడికుదురులో గ్యాస్ లీక్
తూర్పుగోదావరి జిల్లా పామిడికుదురు మండలం పాచర్లపుడి వద్ద భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. తాటిపాక గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ పైపు లైనులు పగిలిపోవడంతో.. భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు గ్యాస్ సరఫరాను నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ శివారులోని పంట పొలాల్లో ఈ ఘటన జరగడంతో.. పెను ముప్పు తప్పిందని స్థానికులు అంటున్నారు. -
కేజీబీవీలో గ్యాస్ పైపు లీక్
సీతంపేట : సీతంపేట కస్తూరిబా గాంధీ పాఠశాలలో మంగళవారం ఉదయం గ్యాస్‌పైపు లీకైంది. దీంతో మంటలు చేలరేగాయి. విద్యార్థినులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు, ఏఎస్ఐ జగన్నాధరావు పాఠశాలకు చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యార్థినుల కోసం ఉదయం పూట రాగిజావ వండే సమయంలో పైపు లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాలికల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం కొండగొర్రె సుబ్బారావు పాలకొండ అగ్నిమాపక శకటానికి ఫోన్ చేశారు. శకటం వచ్చేసరికే మంటలను అదుపు చేశారు. ప్రమాదం తప్పడంతో ప్రత్యేకాధికారిణి రేవతితో పాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఐటీడీఏ, ఆర్వీఎంకు సమాచారం చేరవేశారు. -
ఓఎన్జీసీ బావి వద్ద గ్యాస్ లీక్
సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదికరలో సెయింట్ మేరీ స్కూల్‌కు సమీపంలో ఓఎన్జీసీ కేవీ-4 బావి వద్ద శనివారం గ్యాస్ లీకయింది. బావి నుంచి మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్(జీసీఎస్)కు వెళ్లే పైపునకు బావి వద్ద పిన్‌హోల్ నుంచి పెద్దశబ్ధంతో గ్యాస్ ఎగజిమ్మింది. స్థానికులిచ్చిన సమాచారంతో జీసీఎస్ సిబ్బంది అటు బావి వద్ద, ఇటు జీసీఎస్ వద్ద పైపును మూసివేసి లీకేజీని అరికట్టారు. అనంతరం లీకేజీకి మరమ్మతులు చేపట్టారు. కాగా బావి వద్ద పైపు పాతబడి, తుప్పు పట్టినందునే పిన్‌హోల్ నుంచి గ్యాస్ ఎగజిమ్మిందని స్థానికులు అంటున్నారు. అలాంటి పైపులను మార్చి, కొత్తవి వేయూలని కోరుతున్నారు. -
గ్యాస్ లీకై నవ వధువు సజీవదహనం
క్రోసూరు (గుంటూరు జిల్లా) : వంట గ్యాస్ లీకై సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ నవ వధువు సజీవ దహనమైన ఘటన గుంటూరు జిల్లా క్రోసూరులో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. స్థానిక మార్కెట్ యార్డు వెనుకభాగంలో ఉన్న ఎస్టీ కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. రేఖమణి వెంకటకృష్ణ, ఆదెమ్మ దంపతుల కుమార్తె లావణ్య (19)ను నరసరావుపేట ప్రాంతానికి చెందిన వనపర్తి మస్తాన్‌కు ఇచ్చి గత నెల 29న వివాహం చేశారు. అల్లుడిని కూడా తమ ఇంటి వద్దే ఉంచుకుని వ్యాపారం చేయించాలనే యోచనలో వెంకటకృష్ణ దంపతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం నవదంపతులు ఇక్కడి వచ్చారు. ఆదివారం ఉదయం లావణ్య దంపతులు పాలప్యాకెట్ కోసం బజారుకెళ్లారు. ముందుగా లావణ్య ఇంటికి వచ్చి టీ పెట్టేందుకు వరండాలోని గ్యాస్ స్టవ్ వెలిగించింది. అప్పటికే వంటగ్యాస్ లీకై ఉండడంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని చుట్టుముట్టాయి. దీంతో భయాందోళన చెందిన ఆమె ఇంట్లోకి వెళ్లింది. క్షణాల్లో మంటలు పెద్దవి కావడంతో ఆ మంటల్లో చిక్కుకుని లావణ్య సజీవ దహనమైంది. ప్రమాదంలో పక్కనే ఉన్న మూడు పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. వ్యాపారనిమిత్తం పక్క గ్రామం వెళ్లిన లావణ్య తల్లిదండ్రులు, సోదరుడు ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనాస్థలానికి సత్తెనపల్లి సీఐ కోటేశ్వరరావు, అచ్చంపేట ఎస్ఐ రాజేశ్వరరావు చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తహశీల్దార్ జేఏ ప్రసూన బాధిత కుటుంబాలకు 20 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, ఐదు వేలు ఆర్థిక సహాయం అందజేశారు. -
చైనాలో బద్దలైన గ్యాస్ పైప్ లైన్
బీజింగ్: చైనాలో పెను ప్రమాదం సంభవించింది. భూగర్భంలో ఓ గ్యాస్ పైప్ బద్దలైంది. అయితే, అక్కడ పనిచేస్తున్నవారు అప్రమత్తమవడంతో ఆ ప్రమాదం ప్రాణనష్టం, ఆస్తి నష్టం వైపు దారి తీయలేదు. బీజింగ్ మున్సిపల్ కమిషన్ పరిధిలోని డోంగ్రాగ్జియాన్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా భూమి లోపల ఉన్న గ్యాస్ పైప్ లైను పగిలిపోయింది. అయితే అప్రమత్తమైన అధికారులు అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే ప్రత్యేక బృందాన్ని దించడంతో వారు దాన్ని సరిచేశారు. సమర్థంగా దానికి మూత పెట్టగలిగారు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. -
గ్యాస్ లీక్ తో భారీ అగ్నిప్రమాదం
సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం షాపూర్లో గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బండారి దేవేందర్, ఏకాంబరంలకు చెందిన రెండు ఇళ్లు దగ్ధం అయ్యాయి. గ్యాస్ సిలిండర్లు కూడా పేలిపోయాయి. అగ్నిమాపక శకటం వచ్చేలోపే రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. స్థానికులే మంటలను ఆర్పివేశారు. సుమారు రూ. 6 లక్షల వరకు నష్టం కలిగినట్టు బాధితులు చెబుతున్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్ బాధితులను పరామర్శించనున్నారు. -
అగ్ని ప్రమాదంలో గృహిణి మృతి
వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు అంటుకోవడంతో ఓ గృహిణి మృతిచెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉష(40) అనే గృహిణి ఇంట్లో వంట చే స్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు ఎగిసిపడటంతో అందులో చిక్కుకొని ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ లీక్: నలుగురికి గాయాలు
సఖినేటిపల్లి: తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ అవడంతో నలుగురికి గాయాలు అయ్యాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలోని కలిదిండివారిమెరక ప్రాంతంలో కేజీ బేసీన్ 29, 31, 32 బావుల్లో నెల నుంచి రీడ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. బుధవారం ఇక్కడ ఓ పైపు జాయింట్ వీక్ కావడంతో భారీ శబ్ధంతో గ్యాస్ పైకి ఎగజిమ్మింది. పైన డ్రిల్లింగ్ పనులు చేస్తున్న నలుగురికి గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం మలికిపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
రాజయ్య కోడలిది ఆత్మహత్యే
* నిర్థారించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ * గ్యాస్ లీక్‌తో వ్యాపించిన మంటల వల్లే కాలిన శరీరాలు * పొగకు ఊపిరాడకపోవడంతో మృత్యువాత * ఆహారంలో ఎలాంటి విషపదార్థాలు లేవని వెల్లడి * నివేదికను సిద్ధం చేసిన ఎఫ్ఎస్ఎల్ అధికారులు * జిల్లా అధికారులకు పంపడానికి ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిర్థారించింది. గ్యాస్ లీక్ వల్ల వ్యాపించిన మంటల కారణంగానే సారికతో పాటు ముగ్గురు చిన్నారుల శరీరాలు కాలిపోయినట్టు తేల్చారు. నివేదికను సిద్ధం చేసిన ఎఫ్ఎస్ఎల్ అధికారులు.. దానిని వరంగల్ కమిషనర్‌కు పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సారిక, ముగ్గురు పిల్లల మరణంపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో సజీవదహనమైన విషయం తెలిసిందే. సారికతో పాటు ముగ్గురు చిన్నారులు దారుణంగా మృత్యువాత పడటంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. అంతేకాక వారి మరణాలపై మొదట్లో పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డెడ్‌బాడీస్‌లోని శ్యాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపిం చారు. పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం సారికది ఆత్మహత్యేనని, ఆమెతోపాటు ముగ్గురు పిల్లలు చనిపోయినట్టు ఎఫ్ఎస్ఎల్ అధికారులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను తయారు చేసి జిల్లా అధికారులకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. ఊపిరాడకపోవడం వల్లే.. రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్(7), ఆయాన్(3), శ్రీయాన్(3) ఊపిరాడకపోవడం వల్లే మృత్యువాత పడినట్లు ఎఫ్ఎస్ఎల్ అధికారులు నిర్ధారించారు. నలుగురు హత్యకు గురైనట్లు నిర్ధారించే ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. వారు తీసుకున్న ఆహారంలో ఎలాంటి విషపదార్థాల ఆనవాళ్లు లభించలేదని నివేదికలో పేర్కొన్నారు. వారు బతికుండగానే గ్యాస్ లీక్ కారణంగా వ్యాపించిన మంటలకు కాలిపోయినట్లు నిర్ధారించారు. వారి గొంతు, ఊపిరితిత్తుల్లో పొగ చేరినట్లు ఎఫ్ఎస్ఎల్లో జరిపిన పరీక్షల్లో తేల్చారు. హత్య చేసిన తర్వాత శరీరాలు కాలిపోయినట్లయితే ఊపిరి తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి శరీరంలోకి పొగ చేరదని నివేదికలో ప్రస్తావించారు. దీంతో గ్యాస్ సిలిండర్లను లీక్ చేసిన తర్వాతే సారిక నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో స్పష్టం చేశారని సమాచారం. ఇక తేలాల్సింది కారణాలే.. సారికది ఆత్మహత్యే అని ఎఫ్ఎస్ఎల్ నివేదిక స్పష్టం చేయడంతో.. వారు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి గల కారణాలు బయట పడాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును వేధింపుల కోణంలోనే విచారిస్తున్నారు. సారిక భర్త అనిల్‌కుమార్, అత్త మాధవి తరచూ తనను వేధిస్తున్నారంటూ సారిక పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక గతంలో బేగంపేట మహిళా ఠాణాలో భర్త, అత్తమామలపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది. కుటుంబ సభ్యులతో సఖ్యత లేని కారణంగానే కొంత కాలంగా సారిక ముగ్గురు పిల్లలతో కలసి వేరుగా ఉంటోంది. అయితే ఒంటరిగా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సారిక.. ఉన్నట్టుండి ఒక్కసారిగా పిల్లలతో పాటు ఆత్మహత్యకు పాల్పడటం వెనకున్న కారణాలపై పోలీసులు దృష్టి సారించారు. -
గెయిల్ బేస్ క్యాంపు వద్ద గ్రామస్తుల ఆందోళన
- తరలించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో - గెయిల్ అధికారులతో ఎంపీపీ, సర్పంచ్ చర్చలు ఓదూరు(రామచంద్రపురం) : గ్రామానికి దగ్గరలో ఉన్న గెయిల్ గ్యాస్ పంపిణీ టెర్మినల్ నుంచి తరచు గ్యాస్ లీకవుతోందని, వెంటనే దానిని గ్రామానికి దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఓదూరు గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టారు. బుధవారం రాత్రి ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో గ్రామంలో గ్యాస్ లీక్ కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురై రోడ్లపైకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ వినకోటి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కొండేపూడి జానకిరామయ్య గ్రామస్తులతో కలిసి గురువారం గెయిల్ పాయింట్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈమేరకు గెయిల్ బేస్ క్యాంపు గేటు వద్ద గ్రామస్తులు నిరసన తెలుపుతూ కాకినాడ-రామచంద్రపురం రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో గెయిల్ బేస్ క్యాంప్ ఇన్చార్జ్ పి. వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఇంజనీర్ కేవీకే త్రినాథ్‌తో ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ జానకిరామాయ్య, రామచంద్రపురం సీఐ కాశీవిశ్వనాథ్ తదితరులు చర్చలు జరిపారు. క్యాంప్ ఇన్చార్జ్ మాట్లాడుతూ సాధారణ రక్షణ చర్యల్లో భాగంగానే రాత్రి జరిగిందని, అది ప్రమాదమేమీ కాదని స్పష్టం చేశారు. గ్రామస్తుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ జానకిరామాయ్య మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమక్షంలో పంచాయతీ వద్ద గెయిల్ ఉన్నతాధికారులతో చర్చలు నిర్వహించాలని బేస్ క్యాంప్ అధికారికి తెలిపారు. దీనికి గెయిల్ అధికారులు అంగీకరించటంతో గ్రామస్తులు ఆందోళనను వివరమించారు. -
శారద కార్మాగరంలో గ్యాస్ లీక్
కొత్తవలస : విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో కంఠకాపల్లి సమీపంలో ఉన్న శారద కర్మాగారంలో మంగళవారం మధ్యాహ్నం బ్రాయిలర్వద్ద ఉన్న గ్యాస్పైప్లీకైంది. దీంతో సమీపంలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. ఇనుపరాడ్డుల తయారీకి వినియోగించే ఫెర్రోక్రోమ్ను తయారు చేసే ఈ కర్మాగారంలో కాంట్రాక్టు కార్టులిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న కొత్తవలస మండలంలో చినరావుపల్లి గేటుకు చెందిన ఎం.శ్రీనివాసరావు(32), దన్నినపేటకు చెందిన కర్రి సత్యనారాయణ(30)లకు 80 శాతానికి పైగా కాలినగాయాలయ్యాయి. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బీహార్‌కు చెందిన పూజారే(28) అనే యువకుడు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. ఈయనకు 50 శాతం కాలిన గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ విశాఖకేర్ ఆస్పత్రికి తరలించారు. -
గ్యాస్ లీకై ఐదుగురికి గాయాలు
కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం గ్యాస్ సిలిండర్ లీకైన ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... లేమూరు గ్రామానికి చెందిన ముచ్చర్ల రవి అనే వ్యక్తి ఇంట్లోని వంటగదిలో స్టవ్ వెలుగుతున్న సమయంలో గ్యాస్ లీకవడం మొదలైంది. లీకవుతున్న గ్యాస్ సిలిండర్‌ను సరిచేస్తుండగా స్టవ్ మంటలు గ్యాస్‌కు అంటుకోవడంతో ఆ ఇంట్లో ఉన్న ముచ్చర్ల రవి, బాలామణి, ప్రణీత(3), మంచాల మోహన్, శివ అనే వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
గ్యాస్ లీకైన ఘటనలో ముగ్గురి మృతి
పటాన్చెరు: గ్యాస్ లీకైన దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందారు. ఈనెల 16న పటాన్చెరు మండలం చిట్కుల్లో గ్యాస్‌లీక్ కారణంగా ఓ కుటుంబం మొత్తం మంటల్లో చిక్కుకు పోయి తీవ్ర గాయాల పాలైన సంఘటన తెలిసిందే. గురువారం తెల్లవారు జామున చిట్కుల్లో ఈ ప్రమాదం జరిగింది. చిట్కుల్ వాసులు తలారి బాబురావు(38) భార్య మాధవి(35) వారి ముగ్గురు సంతానం మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందారు. అయితే ఆదివారం భార్యభర్తలిద్దరితో పాటు వారి కుమారుడు లక్ష్మణ్(9) మృతి చెందాడు. కాగా 14 ఏళ్ల వయసున్న మనోజ్, శ్రీరాములు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీరామ్, లక్ష్మణ్‌లు కవల పిల్లలు, లక్ష్మణ్ మృతిచెందగా శ్రీరామ్ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని పోలీసులు తెలిపారు. మనోజ్ పరిస్థితి నిలకడగా ఉంది. బాబురావు కూకట్‌పల్లిలో బిల్డర్‌గా పనిచేసేవారు, భార్యభర్తల మృతితో చిట్కుల్లో విషాదం నెలకొంది. -
వంటగ్యాస్ లీకై..
తుమకూరు: వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి ముగ్గురు గాయపడ్డారు. స్థానిక తిలక్ పార్క్ పోలీసుల సమాచారం మేరకు... రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన ఆరీఫ్వుల్లా ఇంటిలో శనివారం ఉదయం అతని భార్య రియాన్ వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు భగ్గున ఎగిసిపడ్డాయి. ఆమెను కాపాడేందుకు ఇంటిలో ఉన్న ఆరీఫ్ వుల్లా, అతని కుమార్తె తమన్నా కౌన్సర్ ప్రయత్నించి వారూ గాయపడ్డారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కూతురే..కొడుకై
తండ్రి అంతిమ ‘సంస్కారాన్ని మరిచిన కుమారుడు’ తలకొరివి పెట్టిన తనయ కారేపల్లి: కన్నతండ్రి అంత్య క్రియలు చేయడం భారంగా భావించాడో కొడుకు. కనీసం కడసారి చూపుకు కూడా రాకుండా..కర్కశంగా వ్యవహరించాడు. అరుుతే కూతురు మాత్రం అన్నీ తానై తండ్రికి తలకొరివి పెట్టింది. ఈ ఘటన కారేపల్లి మండలంలోని మొట్లగూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా బలపాల గ్రామానికి చెందిన రాయల పిచ్చయ్య (75)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కాగా నెల రోజుల క్రితం బలపాలలో తన ఇంట్లో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో చిన్న కుమారుడు రాయల శ్రీనివాసరావు మృతి చెందగా, రాయల పిచ్చయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పెద్ద కుమారుడు తండ్రిని పట్టించుకోకుండా వదిలేశాడు. కారేపల్లి మండలం మాణిక్యారం గ్రామ పంచాయతీ మొట్లగూడెంలో ఉంటున్న తన చిన్న కుమార్తె గుర్రం మంగమ్మ తండ్రిని, పెద్ద కుమార్తె (మానసిక వికలాంగురాలు) రాయల వెంకటనర్సమ్మలను ఇంటికి తీసుకొచ్చి బాగోగులు చూసుకుంటోంది. ఈ క్రమంలో రాయల పిచ్చయ్య మృతి చెందడంతో..పెద్ద కుమారుడికి కబురు చేయగా..చూడడానికి సైతం రాలేదు. దీంతో అవివాహితురాలైన రాయల వెంకట నర్సమ్మ చేత తండ్రికి తల కొరివి పెట్టించారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు. -
ఓఎన్జీసీ రిగ్ నుంచి గ్యాస్ లీక్:ఆందోళనలో గ్రామస్తులు
తూ.గో:జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయిన ఘటన కలకలం సృష్టించింది. శనివారం రాత్రి మామిడికుదురు మండలం బొంతువారిమెరక సమీపంలోని ఓఎన్జీసీ రిగ్ వద్ద గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. గ్యాస్ లీక్ పై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. గత జూలై నెలలో మలికిపురం మండలంలో ఓఎన్జీసీ వెస్ట్ స్ట్రక్టర్ పరిధిలోని తూర్పుపాలెంలో గల కేశనపల్లి బ్లోఅవుట్ లో గ్యాస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల వ్యవధిలో మరోసారి గ్యాస్ లీక్ కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గ్యాస్ లీక్ ... దంపతులకు తీవ్ర గాయాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో గురువారం అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయింది. దాంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో మంటలార్పారు. స్థానికుల సహాయంతో పోలీసులు ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో అతడికి మెరుగైన వైద్య చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
భయం...భయం
విజయనగరం కంటోన్మెంట్/క్రైం : అందరిలో ఒకటే టెన్షన్... ఏ క్షణం ఏమవుతుందోనని భయాందోళన... ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు... బతికితే చాలు దేవుడా అంటూ ప్రార్థనలు చేశారు...పోలీసులు తీవ్ర హైరానాకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి నుంచి పరుగులు పెట్టారు. జిల్లా అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. 40 టన్నుల బరువున్న గ్యాస్ ట్యాంకర్ ఆర్అండ్బీ కూడలి వద్ద మలుపులో పెద్ద శబ్దంతో బోల్తాపడి, అందులోంచి గ్యాస్ లీక్ అవుతోందన్న సమాచారం తెలిసిన వెంటనే ఇటు పోలీసులు, అటు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను అటు వైపుగా వెళ్లకుండా నిరోధించారు. ట్యాంకర్ పేలితే సుమారు కిలోమీటర్ దూరం వరకూ పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఐఓసీ అధికారులు తెలపడంతో మరింత అప్రమత్తమైన పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను మళ్లించారు. రెవెన్యూ, అటవీ, అగ్నిమాపక, మున్సిపల్ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. చుట్టపక్కల ఉన్న హోటళ్లు, పాఠశాలలు, దుకాణాలు, రైతుబజార్లు, కార్యాలయాలను మూయించి వేశారు. దూరంగా వెళ్లమంటూ మైకుల్లో ప్రచారం చేశారు. పోలీసులు ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలతో ప్రజలు ఏమవుతుందోనని ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు. చాలా మంది బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. సంఘటన పూర్వాపరాలివి పట్టణంలోని ఆర్అండ్బీ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత గ్యాస్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి రాయపూర్‌కు గ్యాస్ ట్యాంకర్ సుమారు 40 టన్నుల లోడ్‌తో వెళ్తోంది. ఆర్అండ్బీ రహదారి జంక్షన్ జాతీయ రహదారి 26 మలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి పెద్ద శబ్దంతో బోల్తాపడింది. ట్యాంకర్ బోల్తా పడిన వెంటనే డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ ఎస్.అమ్మినాయుడుకు సమాచారం అందడంతో వెంటనే ట్రాఫిక్ సీఐ ఎ.రవికమార్కు సమాచారమందించారు. ట్రాఫిక్ పోలీసులు ట్యాంకర్ వద్దకు వెళ్లి చూడగా గ్యాస్ ప్రమాణాన్ని నిర్దేశించే మీటర్ (ప్రెజర్ వాల్వ్) ఊడిపోవడంతో అందులో నుంచి గ్యాస్ లీకైంది. వేకువ జామున సమీపంలోని దుకాణం వద్ద నుంచి తెచ్చిన గోధుమపిండి ముద్దను లీకవుతున్న వాల్వ్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటించాడు. కొంతవరకు గ్యాస్ లీకవ్వడం తగ్గింది. మంగళవారం ఉదయాన్నే గ్యాస్ లీకవుతున్న ప్రాంతం వద్ద ఎంసీల్ వేశారు. ఉదయం 6 గంటలకు ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.జయప్రకాష్, సహాయ అగ్నిమాపక అధికారి కె.వి.టి.ప్రసాద్‌రావు, పట్టణ అగ్నిమాపక అధికారి ఎస్.దిలీప్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మంటలు చెలరేగితే ఆర్పేందుకు ఫామ్ వాటర్‌ను సిద్ధంగా ఉంచారు. వెంటనే విశాఖపట్నంలో ఉన్న ఐఓసీ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం పది గంటల వరకూ ఆ రోడ్డులో వాహనాల రాకపోక లు సాగించాయి. ఐఓసీ అధికారుల సమాచారంతో భీతిల్లిన జనం గ్యాస్ ట్యాంకర్ పెలితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఐఓసీ అధికారులు చెప్పడంతో అధికారులందరూ ఒక్కసారిగా అప్రమత్తయ్యారు. ఆ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలయ్యపేట మలుపు వద్ద బోర్డులు పెట్టి వాహనాలను మళ్లించారు. డీఎస్పీ ఎస్.శ్రీనువాస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ రవికుమార్ ఆర్అండ్బీ జంక్షన్ నాలుగు వైపుల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆర్అండ్బీ సమీపంలో ఉన్న వ్యాపార సముదపాయాలు, పాఠశాలలు, రైతు బజార్లను, ఇళ్లల్లో ఉన్నవారిని దూరంగా వెళ్లిపోవాలని మైకులో ప్రచారం చేశారు. ఆర్‌అండ్‌బీకి కిలోమీటర్ దూరంలో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్యాస్ ట్యాంకర్ పడిన ప్రాంతంలో ఎవరూ సిగరెట్ తాగరాదని, సెల్ఫోన్లు వినియోగించరాదని, నిప్పు రగిలించే ఏ వస్తువులు వాడకుండా ఉండాలని సూచించారు. ఆలస్యంగా వచ్చిన ఐఓసీ అధికారులు గ్యాస్ ట్యాంకర్‌ను పరిశీలించడానికి ఐఓసీ అధికారులు సంఘటన స్థలానికి ఆలస్యంగా చేరుకున్నారు. ఉదయం 7.30 నుంచి ఐఓసీ అధికారులకు ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.జయప్రసాద్లు ఫోన్లో సంప్రదిస్తున్నా అదిగో వస్తున్నాం..ఇదిగో వస్తున్నాం.. అంటూ కాలయాపన చేశారు. 11 గంటల ప్రాం తంలో ఐఓసీ అధికారులు శివరామకృష్ణ తదితరులు వచ్చి బోల్తాపడిన గ్యాస్ ట్యాంకర్‌ను పరి శీలించారు. ప్రస్తుతానికి ప్రమాదం లేదని, ఒక వేళ గ్యాస్ లీకయితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు చెప్పడంతో ప్రజలను దూర ప్రాం తాలకు వెళ్లాలని సూచించారు. 40 టన్నుల బరువు గ్యాస్ ట్యాంకర్ లారీ బరువు సుమారు 40 టన్నులు ఉంటుందని అంచనా వేశారు. ఐఓసీ గ్యాస్ సరఫరా చేస్తున్న ట్యాంకర్ సామర్థ్యం 32 టన్నులని అధికారికంగా చెప్పినప్పటికీ ట్యాంకర్లో అధికస్థాయిలో గ్యాస్ ఫిల్లింగ్ చేసి ఉండవచ్చని, అందుకే వేగంగా వెళ్తున్న ట్యాంకర్ మలుపు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడిందని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు.. సంఘటన విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటవెంటనే చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రజలను, సమీపంలోని దుకాణదారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును, తొలగించే ఏర్పాట్లు ఏవిధంగా చేస్తున్నారని డీఎస్పీ ఎస్.శ్రీనువాస్‌ను అడిగితెలుసుకున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.జయప్రకాష్, సహాయ అగ్నిమాపక అధికారి కె.వి.టి.ప్రసాదరావు, పట్టణ అగ్నిమాపక అధికారి ఎస్.దిలీప్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. ఆ శాఖకు చెందిన 40 మంది సిబ్బంది సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రెండు అగ్నిమాపక శకటాలను సిద్ధంగా ఉంచారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి గణపతి, మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, ఎన్హెచ్ఎ రోడ్ల ఎస్ఐ పి.డి.విజయ్‌కుమా ర్, ఆర్టీసీ డిపో మేనేజర్ పద్మావతి, ఇండియన్ రెడ్‌క్రాస్ చైర్మన్ హేమసుందర్ ఆదేశాల మేరకు విపత్తుల నివారణ జిల్లా అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది సూర్యప్రకాష్, రామకృష్ణ, మురళీ ప్రజలను అప్రమత్తం చేశారు. పైకి ఎత్తలేకపోయిన మూడు క్రేన్లు బోల్తాపడిన గ్యాస్ ట్యాంకర్‌ను పైకి ఎత్తేందుకు జిల్లా అధికారులు అందుబాటులో ఉన్న క్రేన్లను తెప్పించా రు. విజయనగరంలో ఉన్న 14 టన్నులు ఒకటి, 12 టన్నుల సామర్థ్యం ఉన్న రెండు క్రేన్లను అధికారులు రప్పించారు. ఈ మూడు క్రేన్లు బోల్తాపడిన లారీని పైకి ఎత్తలేకపోయాయి. చాలా సేపు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరీ ఎక్కువగా ప్రయత్నిస్తే స్పార్క్‌లు వచ్చే ప్రమాదం ముందని భావించిన అధికారులు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. వాటిని వెనక్కి పంపించి వేసిన తరువాత విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి ఒక్కొక్కటీ 14 టన్నుల సామర్థ్యం ఉన్న నాలుగు క్రేన్లను రప్పించి ట్యాంకర్ పైకి లేపారు. ట్యాంకర్నుపైకి లేపే సమయంలో జరగరానిది జరగుతుందేమోనని అధికారులు భయపడ్డారు. రాత్రి 7 గంటలకు ట్యాంకర్‌ను యథాతధ స్థితిలోకి తీసుకు వచ్చిన అక్కడ నుంచి కొంతదూరం తరలించారు. తప్పిన పెను ప్రమాదం.. ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి సమయాల్లో ఎవరైన కాల్చిన సిగరేటు, నిప్పురవ్వలు లాంటికి వేస్తే ట్యాంక్ పేలి పెను ప్రమాదం సంభవించేది. అంతేగాకుండా ట్యాంకర్ లారీ బోల్తాపడిన ప్రాంతం మీదుగా మంగళవారం ఉదయం 9 వరకు అనేక వాహనాలు ప్ర యాణించాయి. వాటి నుంచి వచ్చిన నిప్పురవ్వలకు బోల్తాపడిన ట్యాంకర్ పేలితేకిలోమీటర్ వరకు తీవ్రంగా, ఐదు కిలోమీటర్ల సాధారణంగా దీని ప్రభావం ఉండేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు. -
ట్యాంకర్ బోల్తా: లీకవుతున్న గ్యాస్
-
ట్యాంకర్ బోల్తా: లీకవుతున్న గ్యాస్
విజయనగరం: విజయనగరం పట్టణంలోని ఆర్ అండ్ బీ జంక్షన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో ట్యాంకర్ నుంచి ఎల్పీజీ గ్యాస్ లీకేజీ అవుతుంది. గ్యాస్ లీకవుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతూ... పోలీసులకు సమాచారం అందించిరు. పోలీసులు ఆర్ అండ్ బీ జంక్షన్ వద్దకు చేరుకుని ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కాకుండా ప్రయత్నాలు చేపట్టారు. అయినా లీకేజీ ఆగడం లేదు. దాంతో గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్‌పీసీఎల్ అధికారులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. దాంతో హెచ్‌పీసీఎల్ అధికారులు గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు సిబ్బందిని హుటాహుటిన విజయనగరం పంపించారు. విశాఖపట్నం నుంచి ట్యాంకర్ రాయ్‌పూర్ వెళ్తుండగా ఆ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. అయితే ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. గ్యాస్ లీకవుతండటంతో ముందస్తు జాగ్రత్తగా ఆర్ అండ్ బీ జంక్షన్ పరిసర ప్రాంతాలలోని నివాసాల నుంచి ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. -
ముంబై తీరంలో గ్యాస్ లీకేజీ
తక్షణమే భద్రత చర్యలు చేపట్టిన ఓఎన్జీసీ న్యూఢిల్లీ: ముంబై సముద్ర తీరంలో ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్జీసీకి చెందిన చమురు, సహజవాయు క్షేత్రంలోని ‘ఎన్ఎస్’ అనే గ్యాస్ బావిలో శనివారం సర్వీసింగ్ జరుపుతుండగా భారీ స్థాయిలో గ్యాస్ లీక్ అయింది. భారీ ఒత్తిడితో, అత్యంత జ్వలనశీలత కలిగిన గ్యాస్ లీక్ కావడంతో ఓఎన్జీసీ వెంటనే భద్రత చర్యలు చేపట్టింది. చమురు క్షేత్రం వద్ద ఉన్న 82 మందిలో అత్యవసరం కాని 42 మంది సిబ్బందిని అక్కడి నుంచి పంపించేసింది. ‘ఓఎన్జీసీకి చెందిన సాగర్ ఉదయ్ అనే రిగ్‌తో చమురు బావిని సర్వీసింగ్ చేస్తుండగా లీకేజీని గుర్తించాం’ అని ఓఎన్జీసీ ప్రతినిధి తెలిపారు. ఎక్కడినుంచి గ్యాస్ లీక్ అవుతుందో గుర్తించగానే మరమ్మతు ప్రారంభిస్తామన్నారు. సంస్థకు చెందిన సంక్షోభ నివారణ బృందం ఘటనస్థలికి చేరుకుంది. పరిస్థితి విషమిస్తే రంగంలోకి దిగడానికి భారత నౌకాదళం, తీర రక్షక దళాలకు చెందిన రెండు నౌకలూ ఆప్రాంతానికి బయల్దేరాయి. రెండు హెలికాప్టర్లనూ సిద్ధంగా ఉంచినట్లు నౌకాదళ వర్గాలు తెలిపాయి. అయితే, అది బ్లోఅవుట్ కాదని, కేవలం గ్యాస్ లీకేజీనేనని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సంస్థ వర్గాలు వెల్లడించాయి. -
బాంబే హైలో గ్యాస్ లీక్
ముంబై: బాంబే హైలో శనివారం రాత్రి గ్యాస్ లీకయింది. ఓఎన్జీసీ వెంటనే డ్రిల్లింగ్‌ను నిలిపివేసి సిబ్బందిని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. లీకేజీ సమయంలో 80 మంది సిబ్బంది ఉండగా, 40 మందిని అక్కడి నుంచి తరలించారు. లీకేజీని అదుపు చేసేందుకు నిపుణులను రంగంలోకి దించినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం హెలీకాప్టర్లను వినియోగిస్తున్నారు. గ్యాస్ లీకయిన రిగ్ బాంబే తీరానికి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ సంఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. కిలో మీటర్ లోతున డ్రిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఇంత లోతున గ్యాస్ లీకవడం అసాధారణమని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. -
తృటిలో తప్పిన ‘బ్లో అవుట్’ ముప్పు
కేశనపల్లి: 8 బావి నుంచి భారీగా గ్యాస్‌లీక్ ,వాల్వ్‌లు మూయని నిర్లక్ష్యమే కారణం ,సకాలంలో గ్యాస్ అదుపు చేసిన వైనం మలికిపురం : తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలో ఓఎన్జీసీ వెస్ట్ స్ట్రక్టర్ పరిధిలోని తూర్పుపాలెంలో గల కేశనపల్లి : 8 బావిలో బ్లోఅవుట్ ప్రమాదం కొద్దిలో తప్పింది. బావి సమీపంలో బుధవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో కొందరు యువకులు క్రికెట్ ఆడుకుంటుండగా భారీ శబ్దం వచ్చింది. బావి నుంచి గ్యాస్ రావడం గమనించిన యువకులు అక్కడి నుంచి పరుగు తీశారు. సుమారు 45 నిమిషాల పాటు గ్యాస్ పెద్ద ఎత్తున లీకవుతూనే ఉంది. అక్కడకు దగ్గరలోని అడవిపాలెం గ్యాస్ కలెక్షన్ స్టేషన్ ఇన్చార్జి అభిషేక్ ఆధ్వర్యంలో సిబ్బంది బావి వద్దకు చేరుకుని గ్యాస్‌ను అదుపు చేశారు. సిబ్బంది నిర్లక్ష్యమే గ్యాస్ లీక్‌కు కారణమని తెలుస్తోంది. నగరం వద్ద గెయిల్ పైపులైన్ పేలుడు నేపథ్యంలో ఇక్కడి బావుల నుంచి తాటిపాక జీసీఎస్‌కు గ్యాస్ సరఫరా నిలిచింది. దీంతో కొన్ని బావులపై ఒత్తిడి పెరిగింది. అడవిపాలెం జీసీఎస్‌కు చెందిన కేశనపల్లి : 8 బావినుంచి కూడా గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఒత్తిడి అధికమైంది. జీసీఎస్‌కు ఈ బావి నుంచి వెళ్లే పైపులైన్‌కు సరఫరా నిలిపారే తప్ప, బావి వాల్వ్‌లు మూయలేదు. దీంతో ఒత్తిడి వల్ల బావి క్యాప్‌పై ఉండే డాఫ్లన్ టేప్ పగిలిపోయింది. సిబ్బంది రావడం ఆలస్యమైనా, గ్యాస్ అదుపులో జాప్యం జరిగినా క్యాప్ పైకి లేచి పోయి బ్లో అవుట్ సంభవించేది. బావికి గల మూడు వాల్వ్‌లను కూడా సంఘటన అనంతరమే మూయడం గమనార్హం. -
గ్యాస్ లీకై వ్యాపించిన మంటలు
-
భిలాయ్ ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీక్
-
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో భారీ పేలుడు...
రాజంపేట : తెల్లవారుజామున పెద్ద శబ్దం రావడంతో చుట్వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో భారీ పేలుడు సంభవించింది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు భార్యా భర్తలు మృతి చెందారు. టు ప్రక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. గ్యాస్ సిలిండర్ పేలుడే కారణమై వుండచ్చొని పోలీసులు భావిస్తున్నా, ఇంట్లో వున్న రెండు గ్యాస్ సిలెండర్లు.. సురక్షితంగా వుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ముగ్గురు పనివారు ఉండగా ఘటన జరిగిన గదిలో రెండు మృతదేహాలు పడివున్నాయి. మరో అతను మేడమీద ఉన్నట్లు తెలిసింది. కాగా అతనికి ఏమీ కాలేదు. వివరాలు ఇచ్చేందుకు మదన్ మోహన్ రెడ్డి అందుబాటులో లేరు. పేలుడు ధాటికి గది గోడలు బద్దలయ్యాయి. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో భారీ పేలుడు...
-
అమెరికాలో పేలుడు, ఇద్దరి మృతి
రెండు భవనాలు కుప్పకూలి ఇద్దరి మృతి న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరం సమీపంలోని ఈస్ట్ హార్లెమ్‌లో బుధవారం ఉదయం శక్తిమంతమైన పేలుడు సంభవించి రెండు భవనాలు కుప్పకూలాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు మరణించడంతోపాటు 20 మంది గాయపడ్డారు. మరికొంత మంది ఆచూకీ తెలియడం లేదు. ఉదయం 9 గంటల సమయంలో తొలుత గ్యాస్ లీక్ అయినట్లు వాసన వచ్చిందని, తర్వాత భారీ శబ్దంతో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు, పొగ అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీలు, అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే బాంబ్ స్క్వాడ్లతో సహా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదని, ఇది ఉగ్రవాద దాడి కాకపోవచ్చని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
తీరం దాటింది గండం గడిచింది
=బలహీనపడిన ‘లెహర్’ =వాయుగుండంగా.. అపై అల్పపీడనంగా మార్పు =చలిగాలులకు వృద్ధురాలి మృతి =మరో 24 గంటలపాటు భారీ వర్షాలు =రైతన్నకు తప్పని నష్టం మచిలీపట్నం, న్యూస్‌లైన్ : లెహర్ తుపాను గండం గడిచింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్ వద్ద ఆరు రోజుల క్రితం ఏర్పడిన లెహర్ తుపాను మచిలీపట్నానికి దక్షిణ దిశగా గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు తీరం దాటింది. అల్పపీడనంగా ఏర్పడి గుంటూరు జిల్లా బాపట్లకు సమీపంలో కేంద్రీకృతమై ఉందని, శుక్రవారం మధ్యాహ్నానికి సమసిపోతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటినప్పటికీ మరో 24 గంటల పాటు కోస్తా తీరంలో వర్షాలు కురుస్తాయని వివరించారు. తెల్లవారుజాము నుంచే వర్షాలు... తుపాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సముద్రతీరంలో బలమైన గాలులతో పాటు వర్షం కురిసింది. తుపాను తీరం దాటే సమయంలో గాలులు, వర్షం ప్రభావం అధికమైంది. తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో దాదాపు ఐదడుగులకు పైగా ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. గురువారం ఉదయం నుంచి సముద్రం హోరెత్తింది. తుపాను ప్రభావంతో చలిగాలులు వీయటంతో బందరు మండలం బుద్దాలపాలేనికి చెందిన తాడంకి ఆదిశేషమ్మ (75) మృతిచెందింది. కృత్తివెన్నులో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో వంట చేస్తుండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావటంతో అలజడి నెలకొంది. లీకేజీని సిబ్బంది అరికట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లెహర్ తుపాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. క్రమేణా బలహీనపడిన తుపాను... లెహర్ పెను తుపానుగా వస్తుండటంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఈ నెల 26 వరకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 27వ తేదీ సాయంత్రం తీవ్ర పెనుతుపాను బలహీనపడి తుపానుగా మారినట్లు ప్రకటించారు. గురువారం ఉదయానికి తుపాను కాస్తా మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మార్పు చెందింది. వాతావరణంలో పెరిగిన చలిగాలులు తుపాను తీవ్రతను తగ్గించాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దీంతో గాలుల వేగం తగ్గిపోయింది. ఈ నెల 22న హెలెన్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హెలెన్ తుపాను కంటే లెహర్ తుపాను తీవ్రత ఎక్కువగా ఉందని, గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించటంతో తీరప్రాంత వాసులు బెంబేలెత్తిపోయారు. తీరం దాటే సమయంలో గంటకు 70 కిలోమీటర్ల మేర గాలులు వీయటంతో నష్టం అంతగా జరగలేదని అధికారులు పేర్కొంటున్నారు. 34 శిబిరాలు, 6,900 మందికి పునరావాసం... లెహర్ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సముద్రతీరంలోని ఆరు మండలాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు అధికారులు కసరత్తు చేశారు. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, బందరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లోని 55 గ్రామాల పరిధిలోని 111 ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించారు. 34పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో 6,900 మందికి రక్షణ కల్పించారు. తుపాను తీరం దాటిన సమయంలో విపత్కర పరిస్థితులు ఏర్పడితే రక్షణ చర్యల కోసం 80 మంది ఆర్మీ, 160 మంది ఎన్డీఆర్ఎఫ్, 877 మంది పోలీసు, 100 మంది ఫైర్, మెరైన్ పోలీసు సిబ్బంది తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో పహరా కాశారు. మంగినపూడి బీచ్, సాగరసంగమం ప్రాంతాల వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వాయుగుండం తీరం దాటడంతో గురువారం పునరావాస కేంద్రాల్లోని వారిని ప్రత్యేక వాహనాల్లో వారి ఇళ్లకు పంపారు. కలెక్టర్ ఎం.రఘునందనరావు, జేసీ ఉషాకుమారి, డీఆర్వో విజయచందర్, ఏజేసీ చెన్నకేశవరావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు తుపాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేశారు. మచిలీపట్నం హిందూ కళాశాలలో, బంటుమిల్లి, కృత్తివెన్నులలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. హిందూ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరంలో మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని గురువారం తెల్లవారుజాము నుంచి అక్కడే ఉండి బాధితులకు సేవలందించారు. రైతన్నకు దెబ్బ మీద దెబ్బ... లెహర్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులను మరింత కుంగదీశాయి. ఈ నెల 22న సంభవించిన హెలెన్ తుపాను ప్రభావంతో కోతకు వచ్చిన వరిపైరు నేలవాలింది. ప్రస్తుత వర్షాలతో ఆ పైరుపై నీరు చేరింది. ఇప్పటికే మూడొంతుల పంటను కోల్పోయామని ఆందోళన చెందుతున్న రైతులు గురువారం కురిసిన వర్షంతో పంట చేతికిరాదని చెబుతున్నారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం నుంచి పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలను పంపుతున్నట్లు వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: నిండుగా ఉన్న సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అవడంతో కుటుంబీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన బుధవారం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని సీసీఐ కాలనీకి చెందిన ఆల్ మహారాష్ట్ర ట్రాన్స్‌పోర్టు యజమాని గోపాలకృష్ణ స్థానిక మాధుర్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన గోడౌన్ నుంచి నాలుగురోజుల క్రితం ఓ గ్యాస్ సిలిండర్‌ను తీసుకువచ్చాడు. మూడు రోజులుగా ఇంట్లో వాసన వస్తోందని కుటుంబీకులు పసిగట్టారు. ఏదో జంతు కళేబరం అయి ఉండొచ్చని భావించి మిన్నకుండిపోయారు. బుధవారం వరండాలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను పరీక్షించగా సిలిండర్ మధ్య భాగంలోని అతుకు వద్ద నుంచి గ్యాస్ లీకైతున్నట్లు గుర్తించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురై సిలిండర్‌ను ఇంటికి దూరంగా పడేవారు. కాగా గతంలో కూడా సిలిండర్ల నుంచి గ్యాస్ లీకైందని స్థానికులు తెలిపారు. సిలిండర్ లీకేజీని గుర్తించకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేదని గోపాలకృష్ణ కుటుంబీకులు గ్యాస్ ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆగ్రో కర్మాగారంలో గ్యాస్ లీక్, 50మందికి అస్వస్థత
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇందుకూరుపేట మండలం, డేవిస్‌పేటలోని స్టార్ ఆగ్రో ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా అమోనియా గ్యాస్ లీకవడంతో యాభై మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు కార్మాగారంలోని ఇతర ప్లాంట్‌లో పనిచేస్తున్న ఇతర కార్మికులను బయటకు పంపించి, గ్యాస్ లీకును అదుపులోకి తీసుకు వచ్చారు. ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావటంతో కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అయితే స్థానిక ప్రాథమిక చికిత్స కేంద్రంలో కనీస వనరులతో పాటు ఆక్సిజన్ సిలెండర్ లేకపోవటంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.