Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

earthquake in telangana1
earthquake: తెలంగాణలో పలు చోట్ల భూకంపం

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 3.8 తీవ్రతతో సోమవారం సాయంత్రం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భూమి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొడిమ్యాలలో ఆరు సెకన్లపాటు.. పెద్దపల్లి నియోజకవర్గంలో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. అటు నిర్మల్‌ జిల్లాలోనూ భూప్రకంపనలు సృష్టించాయి. ఖానాపూర్‌, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో ప్రకంపనలు ప్రజల్ని ఆందోళనకు గురి చేశాయి. భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.మరోవైపు, మేడిపల్లి మండలంలో భూ ప్రకంపనలతో పల్లె అర్జున్ అనే రైతు ఇల్లు కూలింది. ఇల్లు కూలే సమయంలో ఇంట్లో ఉన్న అర్జున్‌ కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

BJP Leader Draws Opposition Fire For Snow Video2
ఎవరీ బీజేపీ లీడర్?..భద్రతా దళాలతో మంచులో రన్నింగ్‌! వీడియో వైరల్‌

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ.. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు భద్రతా సిబ్బందితో మంచులో పరుగెడుతూ దాని వెనుక బ్యాక్ గ్రౌండ్‌లో ఓ బాలీవుడ్ సాంగ్ ‍ ప్లే అవుతున్న వీడియో ఇప్పుడు విశేషంగా వార్తల్లో నిలిచింది.ఎవరీ బీజేపీ లీడర్?రవీందర్ రైనా.. బీజేపీలో సీనియర్ నాయకుడు. జమ్మూ కశ్మీర్ బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే ఈయన. అయితే ఎప్పుడు వార్తల్లో పెద్దగా కనిపించని రవీందర్ రైనా.. ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచారు. ఒ​క బృదం భద్రతా బలగాల్ని వెంట బెట్టుకుని ఆయన కూడా మంచులో పరుగెడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది వైరల్ గా మారింది.#JaiHind 🇮🇳🔥🔥🔥 pic.twitter.com/vH4XYKkrpI— Ravinder Raina (@RavinderRaina) May 4, 2025 మండిపడ్డ కాంగ్రెస్‌దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భద్రతా బలగాల్ని ఈ తరహాలో ఉపయోగించుకుంటారా అంటూ మండిపడింది. ఈ వీడియోపై సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినాతే ధ్వజమెత్తారు. పహల్గామ్ దాడి తర్వాత దేశం అంతా తీవ్ర శోకంలో ఉంటే ఇలా చేయడం సమంజసం కాదంటూ విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కొంతమంది తన కుమారుల్ని కోల్పోగా, మరికొంతమంది తల్లిదండ్రుల్ని, పలువురు భర్తల్ని కోల్పోయారు. మరి ఈయన అయితే మంచి రిథమ్ లో ఉన్నారు. రీల్స్ షూటింగ్ చేసుకుంటున్నారు. భద్రతా సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన చర్య’ అంటూ మండి పడ్డారు.

IPL 2025: CSK sign Urvil Patel, Indias fastest T20 centurion3
IPL 2025: సీఎస్‌కే జ‌ట్టులోకి ఫాస్టెస్ట్ సెంచ‌రీ వీరుడు..

ఐపీఎల్-2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్ర‌యాణం ముగిసిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస ఓట‌ముల‌తో మ‌రో మూడు మ్యాచ్‌లు మిగిలూండ‌గానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే నిష్క్ర‌మించింది. అయితే మిగిలిన మూడు మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి త‌మ ప‌రువు కాపాడుకోవాల‌ని సీఎస్‌కే భావిస్తోంది.సీఎస్‌కే త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో మే 7న ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్-బ్యాటర్ వన్ష్ బేడీ చీలమండ గాయం కారణంగా మిగిలిన సీజ‌న్‌కు దూర‌మ‌య్యాడు. అత‌డి స్దానంలో బ‌రోడా బ్యాట‌ర్ ఉర్విల్ పటేల్‌ను చెన్నై త‌మ జ‌ట్టులోకి తీసుకుంది. "ఎడమ చీలమండ గాయం కారణంగా టోర్నమెంట్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు వన్ష్ బేడీ దూర‌మ‌య్యాడు. అత‌డి స్దానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఉర్విల్ పటేల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది" అని ఐపీఎల్ వ‌ర్గాలు ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించాయి.26 ఏళ్ల ఉర్విల్ పటేల్‌కు టీ20 క్రికెట్‌లో అద్బుత‌మైన రికార్డు ఉంది. గ‌తేడాది స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించాడు. త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి పటేల్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డును ఉర్విల్ బద్దలు కొట్టాడు. అదే టోర్నీలో ఉత్తరాఖండ్‌పై కూడా 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే ఉర్విల్ పటేల్‌తో సీఎస్‌కే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఉర్విల్.. 47 టీ20 మ్యాచ్‌లు ఆడి 170 స్ట్రైక్ రేట్‌తో 1162 పరుగులు చేశాడు.

 Nirmala Sitharaman demands ADB to cut Pakistan funding4
అప్పు ఇవ్వొద్దు,పాక్‌పై భారత్‌ ఫైనాన్షియల్‌ స్ట్రైక్‌..

ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్‌ ఫైనాన్షియల్‌ స్ట్రైక్‌ చేస్తోంది భారత్‌. ఇప్పటికే ఐఎంఎఫ్‌ తలుపు తట్టిన ప్రధాని మోదీ సర్కార్‌ తాజాగా, ఇటలీలో ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (adb)ను సంప్రదించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌కు రుణాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఏడీబీ వార్షిక సమావేశం కోసం ఇటలీకి వెళ్లిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంక్‌ చీఫ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పాకిస్తాన్‌కు ఇస్తున్న ఏడీబీ రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదేశానికి అప్పిస్తే.. ఆ సొమ్ము మొత్తం ఉగ్ర సంస్థల ఖాతాల్లోకి వెళుతోందని వివరించారు. ఏడీబీ చీఫ్‌తో పాటు, ఇటలీ ఆర్థిక మంత్రి జియాన్‌కార్లో గియోర్గెట్టితో కూడా ప్రత్యేక సమావేశమయ్యారు. పాకిస్తాన్‌కు ఇచ్చే నిధుల విషయంలో పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. Union Minister for Finance and Corporate Affairs Smt. @nsitharaman is received by Ambassador Ms. Vani Rao and Consul General Shri Lavanya Kumar after her arrival at the Milan Malpensa Airport, Italy. The Union Finance Minister will participate in the 58th #ADBAnnualMeeting… pic.twitter.com/w63TIRpLQb— Ministry of Finance (@FinMinIndia) May 4, 2025 కాగా, మే 4 నుండి 7 వరకు జరగనున్న ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) గవర్నర్ల బోర్డు 58వ వార్షిక సమావేశంలో సీతారామన్ ఇటాలి మిలాన్‌లో పర్యటిస్తున్నారు. గవర్నర్ల బోర్డు వార్షిక సమావేశానికి నిర్మలా సీతారామన్‌ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు

Warren Buffett Sounded A Warning About The United States Growing Fiscal Deficit5
పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు

దిగ్గజ ఇన్వెస్టర్ & బెర్క్‌షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వారెన్ బఫెట్.. ఇటీవల తన వాటాదారుల ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక లోటుకు సంబందించిన విషయాలను హైలెట్ చేస్తూ.. పెట్టుబడిదారులు కేవలం యూఎస్ డాలర్ మీద మాత్రమే కాకుండా, ఇతర కరెన్సీలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.అమెరికాలో ఆర్థిక లోటు సమస్య ఎప్పటి నుంచో పరిష్కారం లేకుండా ఉంది. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో నిర్ణయించలేకపోతున్నామని బఫెట్ అన్నారు. మనం చాలా కాలంగా భరించలేని ఆర్థిక లోటుతో పనిచేస్తున్నాము. ఇది ప్రస్తుతం నియంత్రించలేని స్థాయికి చేరిందని వెల్లడించారు.యూఎస్ డాలర్ పతనావస్థలో ఉంది. ఒక దేశంగా మనకు ఎప్పుడూ చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఇది మాత్రం మనమే తెచ్చుకున్న సమస్య. అమెరికా ఆర్ధిక విధానాలు, వాణిజ్య విధానం వంటివన్నీ డాలర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని బఫెట్ వివరించారు.సీఈఓగా వారెన్‌ బఫెట్‌ పదవీ విరమణశనివారం (2025 మే 3) జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్‌ బఫెట్‌' కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్‌ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కీలక ప్రకటన: గెలిచినోళ్లకు రూ.5 లక్షల ప్రైజ్

Putin calls PM Modi, condemns Pahalgam incident6
భారత్‌కు అండగా ఉంటాం: రష్యా

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాకిస్తాన్‌ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. భారత్‌ కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్‌ చేసిన పుతిన్‌.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్‌ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతిచెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పుతిన్,. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందుకు తీసుకురావాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు స్సష్టం చేశారుఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్‌ చానెళ్ల నిలిపివేత, భారత్‌ జలాల్లోకి పాక్‌ ఓడలు రాకుండా నిషేధం, పాక్‌ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని రెండురోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.

Jagadeka Veerudu Athiloka Sundari Remuneration For Chiranjeevi And Sridevi7
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కోసం చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్‌

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం గురించి పలు పాత విషయాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమాకు ఎంత బడ్జెట్‌ అయింది..? చిరు, శ్రీదేవిల రెమ్యునరేషన్‌ ఎంత..? బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది..? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలు సోషల్‌మీడియాలో కనిపిస్తున్నాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 35 ఏళ్ల తర్వాత ఈ మూవీని రీ–రిలీజ్‌ చేస్తుండటంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న 2డీతో పాటు 3డీ వెర్షన్‌లోనూ విడుదల కానుంది.‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్‌ వండర్‌ వెనక చాలామంది ఛాంపియన్స్‌ ఉన్నారు. ఇళయరాజా అందించి ట్యూన్స్‌, దర్శకుడు రాఘవేంద్ర రావు విజన్‌, డీఓపీ విన్సెంట్‌, అద్భుతమైన సెట్స్‌తో మైమరపింపజేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌ చలం.. పాటలు, మాటలతో మెస్మరైజ్‌ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు ఇలా ఎందరో ఈ సినిమాకు పనిచేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్‌ స్టోన్‌ , ఓ హిస్టారికల్‌ ల్యాండ్‌ మార్క్‌గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కోసం రూ. 2 కోట్లు ఖర్చు అయిందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి.మే 9న రీ-రిలీజ​ కానున్న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాను మీరు చూస్తే రూ. 2 కోట్లతో ఇంతటి రిచ్‌ సినిమాను నిర్మించారా అంటూ ఆశ్చర్యపోతారు. ఇప్పట్లో అయితే, ఈ ప్రాజెక్ట్‌ కోసం కనీసం రూ. 200 కోట్లు పైగానే ఖర్చు చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా విడుదల సమయంలో భారీ వర్షాల వల్ల మొదటి వారం కలెక్షన్స్‌ పెద్దగా లేవు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ప్రింట్స్‌ పెరిగాయి. ఎక్కడ చూసిన కూడా థియేటర్స్‌ నిండిపోయాయి. అలా ఏకంగా బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 15 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమాకు గాను చిరంజీవి రూ. 25 లక్షలు, శ్రీదేవి రూ. 20 లక్షలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి.

Trump May destroy world before he goes says Actor Sean Penn8
'ట్రంప్‌తో ప్రపంచం నాశనం'

వాషింగ్టన్‌: వ్యక్తిగత జీవితంతోనే కాదు.. రాజకీయ అభిప్రాయాలతోనూ వివాదాస్పదమైన హాలీవుడ్‌ నటుడు సీన్‌ పెన్‌ (Sean Penn) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రపంచాన్ని నాశనం చేస్తారన్నారు. అంతేకాదు.. హంతకుడైన అసూయపూరిత జీవిత భాగస్వామిగా అభివర్ణించారు. డెమొక్రటిక్‌ ప్రతినిధి ఎరిక్‌ స్వాల్వెల్‌తో కలిసి జిమ్‌ అకోస్టా పాడ్‌ కాస్ట్‌ ‘ది జిమ్‌ అకోస్టా షో’లో పెన్‌ మాట్లాడారు.తనకు కాకపోతే ఇంకెవ్వరికీ దక్కవద్దన్న ధోరణి ట్రంప్‌లో ఉంటుందన్నారు. తన అధికారంతో విధ్వంసానికి పాల్పడే స్వార్థపూరిత వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించారు. మూడోసారి అధ్యక్ష పదవికోసం ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు పెన్‌ పైవిధంగా సమాధానమిచ్చారు. ఇక డెమొక్రాట్‌ అయిన ఎరిక్‌ స్వాల్వెల్‌ (Eric Swalwell) మాట్లాడుతూ.. నియంతలెప్పుడూ తమ వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రణాళికలు వేయలేదన్నారు. తనను తాను రక్షించుకోవడానికి దేశాన్ని ఏం చేయడానికైనా ట్రంప్‌ సిద్ధమవుతారని వ్యాఖ్యానించారు. చ‌దవండి: ద‌య‌లేని ట్రంప్‌.. ఈసారి సినిమాల‌పై సుంకం

AP High Court Slams Police Officers Over Varra Ravindra Reddy Case9
పోలీస్‌ అధికారులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం..

సాక్షి,విజయవాడ: పోలీస్‌ అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ వర్రా రవీందర్‌రెడ్డి కేసులో అరెస్ట్‌ సమయం, తేదీపై తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని ఫైరయ్యింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు వేసిన అఫిడవిట్లలో సమాచారం తప్పని హైకోర్టు తేల్చింది.వర్రా రవీందర్‌రెడ్డిని 2024 నవంబర్‌ 8న అరెస్ట్‌ చేసి నవంబర్‌ 10న అరెస్ట్‌ చేశామని ఎలా చెప్తారు? అని ప్రశ్నించింది. తాము తీసుకోబోయే చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. పులివెందుల అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో పుల్లప్పగారి హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై క్రైమ్‌ నంబరు 409/24, అండర్‌ సెక్షన్‌ 386 ఐపీసీ 196, 351(3), 353(1)(సి), 112(2)(బి) రెడ్‌విత్‌ 3(5) బిఎన్‌ఎస్‌ 2023 సెక్షన్‌ 3(1)(ఆర్‌)(ఎస్‌), 3(2)(వి)(ఎ) ఎస్సీ ఎస్టీ (పీఓఏ) అమెండ్‌మెంట్‌ యాక్టు 2015, 67 ఐటీ యాక్టు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.రవీంద్రారెడ్డితో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు చెందిన గుర్రంపాటి సుబ్బారెడ్డి అలియాస్‌ సుబ్బారెడ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కూడా కారులో ఉండటాన్ని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే,ఈ అక్రమ కేసులపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో వర్రా రవీంద్రారెడ్డికి పలు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసింది.

YS Jagan Teleconference With Party Leaders Over Unseasonal Rains10
రైతులకు బాసటగా వైఎస్సార్‌సీపీ: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్‌ జగన్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్‌ జగన్‌ సూచించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement