ఫస్ట్‌టైమ్‌ డేట్‌కి వెళ్తే.. ఫ్రెండ్స్‌ ఏం చేశారంటే.. | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌టైమ్‌ డేట్‌కి వెళ్తే.. ఫ్రెండ్స్‌ ఏం చేశారంటే..

Published Fri, Jul 31 2020 1:36 PM

తొలిసారి డేట్‌కి వెళ్లిన ఓ జంటకి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు స్నేహితులు. ఎంగేజ్‌మెంట్‌ లెవల్లో వారి ‘ఫస్ట్‌డేట్‌’ను సెలబ్రేట్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అసలు ఏం జరిగిందంటే..నార్తర్న్ ఐర్లాండ్‌లోని డెర్రీకి చెందిన నీల్ హర్కిన్ (31), జీన్ మెక్‌ఆలే (31) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇటీవల తొలిసారి డేట్‌కి వెళ్లాలని నిర్ణయించుకొని లండన్డెరీలోని ఓల్డ్ డాక్స్ బార్‌కి వెళ్లారు. విషయం తెలుసుకున్న ఆ హోటల్‌ యజమాని, హర్కిన్‌ ప్రాణస్నేహితుడు లియామ్ షీల్స్ వారి ఫస్ట్‌డేట్‌ను గుర్తిండిపోయేలా సెలబ్రేట్‌ చేయాలనుకున్నారు.
 

అనుకున్నట్లే వారికి తెలియకుండా హోటల్‌లోని సెంట్రల్‌లో ఓ టేబుల్‌ వేయించాడు. మిగిలిన డేబుళ్లపై వారి స్నేహితులను కూర్చోబెట్టారు. లోపలికి వచ్చిన హర్కిన్‌ జంట.. అన్ని టేబుల్‌లో నిండిపోవడంతో సెంట్రల్‌లో ఏర్పాటు చేసిన టేబుల్‌ వద్దకు వచ్చి కూర్చున్నారు. డిన్నర్‌ కూడా చేశారు. తిరిగి వెళ్లే క్రమంలో ఓ వేటర్‌ భారీ స్పార్క్లర్‌తో పాటు ప్రాసికో బాటిల్‌ తెచ్చి వారి టేబుల్‌పై పెట్టాడు. వెంటనే రెస్టారెంట్‌లోని ఇతర డైనర్లు చప్పట్లు కొడుతూ వారిని విష్‌ చేస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న ఆ జంట.. సిగ్గుపడుతూ తలలు కిందకు దించుకున్నారు. తామేదో డిన్నర్‌ చేసి వెళ్దామని వస్తే.. ఈ వేడుకలు ఏంటో వారికి అర్థం కాలేదు. ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుండగా, అందరూ చప్పట్లు కొడుతు వారిని అభినందిస్తున్నారు. తర్వాత తెలిసింది ఇది తన స్నేహితుల నిర్వాహకం అని. తమ ఫస్ట్‌డేట్‌ను గుర్తిండిపోయేలా సెలబ్రేట్‌ చేసినందుకు తమ స్నేహితులకు ఆ జంట కృతజ్ఙతలు తెలిపింది.