వైర‌ల్‌: క‌నిపించేదంతా నిజం కాదు | Man Rides Low Budget Bike Video Goes Viral | Sakshi
Sakshi News home page

వైర‌ల్‌: క‌నిపించేదంతా నిజం కాదు

Jul 12 2020 3:45 PM | Updated on Mar 22 2024 10:41 AM

మీరు సైకిల్ చూశారు, బైక్ చూశారు.. కానీ "సైకిల్ బైక్" మాత్రం చూసుండ‌రు. అదేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అవును.. ఓ యువ‌కుడు దీన్ని నిజంగానే త‌యారు చేశాడు. ఇది ముందు నుంచి బైక్‌లాగా, వెన‌క నుంచి సైకిల్‌గా కనిపిస్తుంది. దీన్ని తొక్కుతున్న‌ప్ప‌టికీ ముందు నుంచి చూసేవాళ్ల‌కు అరె.. ఎంత స్పీడుగా న‌డ‌పుతున్నాడో అనిపిస్తుంది. తీరా అది మ‌న‌ల్ని  దాటి వెళ్లిపోయాక అస‌లు సంగ‌తి అర్థ‌మ‌వుతుంది. ఇలాంటి ఓ ఫ‌న్నీ వీడియోను సీసీటీవీ ఇడియ‌ట్స్ సోష‌ల్ మీడియాలో విడుద‌ల‌ చేసింది.  

ఇందులో హీరోలా బైక్ నడుపుతున్న‌ట్లు క‌నిపించే వ్య‌క్తి ప‌క్క‌నున్న బైక‌ర్‌ను కూడా దాటి ముందుకెళ్లిపోయాడు. కానీ కొన్ని సెక‌న్ల లోపే అత‌ను న‌డ‌పుతోంది బైక్ కాదు సైకిల్ అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ల‌క్ష‌లాది మంది వీక్షించిన‌‌ ఈ వీడియోకు ఫ‌న్నీ కామెంట్లు పోటెత్తుతున్నాయి. "ఒక్క క్ష‌ణం అంద‌రినీ పిచ్చోళ్ల‌ను చేశావు క‌ద‌రా.." అంటూ నెటిజ‌న్లు ఫూల్ అయ్యామ‌ని ఒప్పేసుకుంటున్నారు. "కంటికి క‌నిపించేదంతా నిజం కాదు", "అత‌ని తెలివికి ఏమిచ్చినా త‌క్కువే..", "త‌క్కువ బ‌డ్జెట్ బైక్"‌ అంటూ మరికొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement