దక్షిణాఫ్రికా జరిగిన తొలి ట్వంటీ 20లో భారత ఆటగాడు జస్ప్రిత్ బూమ్రా బౌండరీ లైన్‌పై అద్భుతమైన ఫీల్డింగ్‌తో మైమరిపించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు భారత మహిళా క్రికెటర్ స్మృతీ మంధన కూడా బౌండరీ లైన్ వద్దే అబ్బురపరిచే ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మూడో టీ 20లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళల లక్ష్య ఛేదనకు దిగిన సందర్భంలో భారత బౌలర్ అనుజ పాటిల్ వేసిన ఎనిమిదో ఓవర్ నాల్గో బంతిని డు ప్రీజ్ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టింది.