డివిలియర్స్‌ తన భార్య, కుమారునితో ఆటోలో షికారు | AB de Villiers says “Ee saal cup namade” in an auto rickshaw | Sakshi
Sakshi News home page

డివిలియర్స్‌ తన భార్య, కుమారునితో ఆటోలో షికారు

Apr 27 2018 11:40 AM | Updated on Mar 22 2024 10:55 AM

దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌కు మన దేశంలో ఉన్న ఫాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రసుత ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తరుపున బరిలోకి దిగాడు ఈ ఆటగాడు. బుధవారం  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం డివిలియర్స్‌ తన భార్య, కుమారునితో కలిసి ఆటోలో షికారుకు బయలుదేరాడు. ఆటో రిక్షాలో ఉన్న డివిలియర్‌ను గమనించిన అభిమానులు ‘ఈ సాలా కప్‌ నమ్డే’ అని నినాదాలు చేస్తూ డివిలియర్‌ ప్రయాణిస్తున్న ఆటోను  వెంబడించారు. ‘ఈ సాలా కప్‌ నమ్డే’ అనేది ఈ ఐపీఎల్‌లో సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ నినాదం. ఈ ఆదివారం చిన్నస్వామీ స్టేడియంలో జరగునున్న మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్‌ చాలెంజర్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్సతో తలపడనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement