టీడీపీ నేతలు రోజురోజుకు బరితెగిస్తున్నారు. పోలింగ్ రోజున వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై ఇష్టారీతిన దాడులకు దిగిన టీడీపీ నేతలు.. ఇంకా అదే పంథాను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా పెదపారుపూడిలో పామర్రు శాసనసభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌పై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్లిన అనిల్‌కుమార్‌ను టీడీపీ నాయకుడు చప్పిడి కిషోర్ దూషించారు.