తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం, పాస్ పుస్తకాల పంపిణిలో రాజన్న సిరిసిల్ల జిల్లా నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్‌లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతి రైతు ముఖంలో ఆనందాన్ని చూసి ప్రతిపక్షాలు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌ను, రెవెన్యూ, వ్యవసాయ అధికారులను అభినందించారు. వచ్చే వేసంగి పంటకు సాగు భుములకు గోదావరి జలాలు అందేలా చూస్తామన్నారు.