ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇచ్చిన హామీల అమలులో పురోగతిపై సమీక్ష జరపాలని సీఎం ఎన్.చంద్రబాబు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికమం త్రి అరుణ్ జైట్లీలతో విడివిడిగా సమావేశమ య్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డారు. ‘‘రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదు. విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు జరిగిందో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. విభజన తరువాత చేపట్టిన పనులు పూర్తి చేయాల్సిన అవసరముంది.