దీదీ కాళ్లు మొక్కిన ఐపీఎస్‌ అధికారి

ఆమె ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అతను బాధ్యతాయుతమైన ఐపీఎస్‌ అధికారి. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా సరే జనాల్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరి హోదా ప్రకారం వారు నడుచుకోవాలి. లేదంటే విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ఆ వివరాలు.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో దీదీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారం రోజుల క్రితం దీదీ దిఘాలో పర్యటించారు. ఈ సందర్భంగా దీదీ తనతో పాటు ఉన్న అధికారులకు కేక్‌ తినిపించారు. ఈ క్రమంలో ఓ అధికారి దీదీ పాదాలకు నమస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ నాయకుడు కైలాష్‌ విజయ్‌వర్గియా తన ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top