కేంద్ర మంత్రి రామ్‌కృపాల్ యాదవ్‌కు దమ్మున్న మహిళా కానిస్టేబుల్ ఒకరు గట్టి షాకిచ్చారు. మంగళవారం పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాంగ్ రూట్‌లో ఎగ్జిట్ ద్వారం గుండా వెళ్తున్న ఆయనను అక్కడ పని చేసే సీఐఎస్‌ఎఫ్ మహిళా పోలీసు అడ్డుకున్నారు.