రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనదారులకు బుద్ధి చెప్పేలా ఓ వ్యక్తి చేసిన పనిపై పలువురు అభినందనలు కురిస్తున్నారు. అయితే తప్పును ఎత్తి చూపే క్రమంలో ధైర్యంగా నిలబడిన యువకుడు దాడికి గురికావటం.. చుట్టుపక్కల వెళ్లేవారు కాసేపటి దాకా వారిని అడ్డుకునే యత్నం చేయకపోవటం ఇక్కడ గమనార్హం. నవంబర్ 3న ఈ ఘటన భోపాల్‌లోని ఓ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది. ఓ ఎస్‌యూవీ వాహనం రాంగ్ రూట్‌లో రావటం గమనించిన ఓ యువకుడు తన బైక్‌ను అడ్డుగా నిలిపాడు. చాలా సేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే బైక్ పై ఉన్న వ్యక్తి మాత్రం అస్సలు చలించలేదు. చివరకు ఎస్‌యూవీతో ఢీకొట్టేందుకు ఝలక్ ఇవ్వగా.. యువకుడు అస్సలు బెదరలేదు. చివరకు తన ఫోన్‌తో నెంబర్ ఫ్లేట్ ఫోటోలు తీశాడు. అది గమనించిన ఎస్‌యూవీ వాహనదారుడు కూడా అదే పని చేయగా.. చివరకు ఆ వాదులాట తన్నులాటకు దారితీసింది.
ఇలాంటోళ్లు ఉండాల్సిందే!
Nov 6 2017 4:54 PM | Updated on Mar 20 2024 12:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement