గుంటూరు జెడ్పీ ఛైర్‌పర్సన్ జానీమున్‌కు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు నుంచి బెదిరింపులు కలకలం రేపాయి. టీడీపీ నేత అయినప్పటికీ మహిళా నేతలపై ఇంకా ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. నిన్న (శనివారం) పలు మహిళ, దళిత, ప్రజాసంఘాల నాయకులు జిల్లాపరిషత్ కార్యాలయానికి వచ్చి జానీమూన్‌కు మద్దతు పలికారు. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహిళ కావడం వల్లే జానీమూన్‌ను వేధింపులకు గురిచేస్తున్నారని, మంత్రి రావెలను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేయగా.. మరోవైపు మంత్రి రావెల మాత్రం మహిళానేత జానీమూన్‌కు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాలను రంగంలోకి దించారు. క్రైస్తవ సంఘాలను ఆసరాగా చేసుకుని జానీమూన్‌పైనే ఎదురుదాడికి దిగాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
Dec 25 2016 11:27 AM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement