వచ్చే ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యే అవకాశముంది. ఇటీవల అమెరికా పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఒబామాను ఆహ్వానించారు. ఈ విషయాన్ని నరేంద్ర మోదీ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా తొలిసారి అమెరికా అధ్యక్షుడు హాజరయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని హోదాలో అమెరికా పర్యటించిన మోదీ... ఒబామాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో వైట్ హౌస్ లో విందుకు హాజరయ్యారు.