ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)... రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి సారథి. ఇంతటి కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒక సీఎస్ ఇళ్లపై ఐటీ దాడులు జరగడం బహుశా దేశచరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చేమో! ప్రముఖ కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ఆస్తులపై జరిగిన దాడులకు కొనసాగింపుగా ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.