బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన తృణమూల్ మాజీ ఎంపీ ముకుల్ రాయ్ శుక్రవారం బీజేపీలో చేరారు. ముకుల్ రాయ్ బీజేపీలో చేరారని, ఆయన చేరికను తాము సాదరంగా స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. ముకుల్ రాయ్ అక్టోబర్ 11న రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.