వర్దా తుఫాను సృష్టించిన బీభత్సానికి చెన్నపట్నం చెల్లాచెదురైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇంటర్నెట్ సర్వీసులు ఆగిపోయాయి. మొబైల్ సేవలు స్తంభించాయి. అసలకే కేంద్రం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయానికి తీవ్ర కష్టాల్లో ఉన్న చెన్నపట్న వాసులకు ఈ సేవలు నిలిపివేత తీరని కష్టాల్లో పడేసింది. కనీసం తిండి దొరకని పరిస్థితిలోకి నెట్టేసింది. ప్రతిసారీ చెన్నై పట్నాన్ని ముంచెత్తి వరదలకు ప్రజల నుంచి కనీస మద్దతు వారికి అందేది. ప్రజలు తామున్నామంటూ డబ్బులు వసూలు చేసి మరీ చెన్నైను ఆదుకునే వారు. అక్కడి ప్రజలు కూడా ఒక్కరికొక్కరు చేదుడువాదుడుగా నిలిచేవారు. కానీ ఈసారి చెన్నై పరిస్థితి భిన్నంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. పాత నోట్లు రద్దయి ఉండటంతో వారికి కనీసం తిండి దొరకడానికి కూడా నగదు ఎక్కడి నుంచి పుట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు.
Dec 15 2016 7:50 AM | Updated on Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement