కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక ఏటీఎంలో జ్యోతి ఉదయ్ అనే మహిళ మీద కత్తితో దాడి చేసి, ఆమెను తీవ్రంగా గాయపరిచి సొమ్ముతో పరారైన ఘటనలో నిందితుడు చిత్తూరు జిల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం.. జనవరి 31న నిమ్మనపల్లికి చెందిన మధుకర్ రెడ్డి అనే ఈ నిందితుడిని మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. 2013 సెప్టెంబర్ నెలలో అతడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అతడి దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతి.. అప్పట్లో పక్షవాతానికి కూడా గురయ్యారు. తర్వాత కోలుకుని మళ్లీ విధుల్లో చేరారు