బకాయిలు చెల్లించకుంటే ఫ్లాట్లకు తాళాలు | - | Sakshi
Sakshi News home page

బకాయిలు చెల్లించకుంటే ఫ్లాట్లకు తాళాలు

Oct 7 2025 4:03 AM | Updated on Oct 7 2025 4:03 AM

బకాయి

బకాయిలు చెల్లించకుంటే ఫ్లాట్లకు తాళాలు

హామీ ఇచ్చి మోసం చేశారు

పాలకొల్లులో టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకు అధికారుల హెచ్చరిక

నోటీసులు అంటిస్తామంటూ హుకుం

లబోదిబోమంటున్న లబ్ధిదారులు

పాలకొల్లు సెంట్రల్‌: అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రావణమాసంలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లు ఇస్తామని చెప్పారు.. రెండు శ్రావణమాసాలు దాటాయి.. ఇళ్లు ఇవ్వలేదు సరికదా, బ్యాంకు అధికారుల వేధింపులతో టిడ్కో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. సోమవారం పాలకొల్లులోని పెంకుళ్లపాడు టిడ్కో గృహాల్లో లబ్ధిదారుల ఇళ్లకు బ్యాంకు అధికారులు వెళ్లి ఘాటుగా హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణం కోసం బ్యాంకు రుణాలు ఇచ్చామని, వాయిదాలు కట్టాల్సిందేనని హెచ్చరించారు. లేకుంటే నోటీసులు ఇచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారంలోపు బకాయిలు చెల్లించాలి లేదా వడ్డీ అయినా క ట్టాలని లేదంటే ఫ్లాట్లకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. యడ్లబజారు, యూనియన్‌ బ్యాంకు, ఎల్‌ఆర్‌పేట, పాలకొల్లు ఈఏపీ బ్రాంచ్‌ల నుంచి రికవరీ క్యాంపు నిమిత్తం వచ్చామని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

మాకు ఇళ్లు కట్టించింది ప్రభుత్వం

‘మాకు ఇళ్లు కట్టించింది ప్రభుత్వం.. బ్యాంకులు కాదు కదా మీరొచ్చి మమ్మల్ని అడుగుతారేంటి.. నాడు మా నుంచి ప్రభుత్వం రూ.లక్ష కట్టించుకుంది.. కానీ రూ.50 వేలకే రిజిస్ట్రేషన్లు చేయించి ఇచ్చారు.. మిగిలిన డబ్బులు సంగతేంటి పోనీ ఆ మిగిలిన డబ్బులైనా జమ వేసుకోవాలి కదా’ అంటూ బ్యాంకు అధికారులను లబ్ధిదారులు నిలదీశారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే మున్సిపల్‌ ఆఫీసుకు వెళ్లమంటారు, వారిని అడిగితే బ్యాంకులకు వెళ్లమంటారు, హామీలిచ్చిన నాయకులను అడిగితే కట్టేసుకోండమ్మా అంటున్నారు, మరి అలాంటప్పుడు హామీలివ్వడం ఎందుకంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ్లాట్లలో నిర్వహణ లోపం

టిడ్కో ఫ్లాట్లను సరిగా కట్టలేదని, దీంతో పలు ఫ్లాట్లలో నీళ్లు లీకవుతున్నాయని లబ్ధిదారులు అంటున్నారు. అయినా సర్దుబాటు చేసుకుని జీవిస్తున్నామని చెబుతున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేవని, పాములు యథేచ్ఛగా తిరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. మా అబ్బాయి మీద ఆధారపడి జీవిస్తున్నానని, బ్యాంకు వాయిదా కింద నెలకు రూ.3,500 చొప్పున చెల్లించాలంటే ఎలా అని ఓ మహిళా లబ్ధిదారులు వాపోయారు.

టిడ్కో గృహాల వద్ద లబ్ధిదారులను హెచ్చరిస్తున్న బ్యాంకు అధికారులు, లబోదిబోమంటున్న మహిళలు

గత ఎన్నికల సమయంలో టీడీపీకి ఓట్లేస్తే టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామని నాయకులు హామీ ఇచ్చారని, నమ్మి ఓట్లేస్తే ఇప్పుడు మొండిచేయి చూపిస్తున్నారని లబ్ధిదారులు వాపోయారు. ఎమ్మెల్యేని అడిగినా, ఏడాది క్రితం పాలకొల్లు వచ్చిన మంత్రి నారాయణను అడిగి నా బ్యాంకు వాయిదాలు కట్టుకోవాలని చెబుతున్నారని, అలా వాయిదాలు కట్టుకునే స్థోమతే ఉ ంటే ఇక్కడకు వచ్చి ఎందుకు ఉంటామని ప్రశ్నిస్తున్నారు. టిడ్కో గృహాల్లో ఉన్న వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలే అని, తమకు వాయిదాలు కట్టడం భారమని వాపోతున్నారు.

బకాయిలు చెల్లించకుంటే ఫ్లాట్లకు తాళాలు 1
1/1

బకాయిలు చెల్లించకుంటే ఫ్లాట్లకు తాళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement