జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి
భీమవరం (ప్రకాశంచౌక్) : పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సూ చించారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ డా.కేసీహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 168 అర్జీలు అందాయి.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణ మే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలన్నారు. జిల్లా అ ధికారులు, వయోవృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక కలెక్టరేట్ లోని పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం జిల్లాస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందించారు. రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎమ్మె ల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
10న పింఛన్ అదాలత్
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ ఆడిటోరియంలో ఈనెల 10న ఉదయం 10 గంటలకు ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతి ప్రియ ఆధ్వర్యంలో పింఛన్ అదాలత్ నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు, రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పింఛన్ మంజూరు, జీపీఎఫ్, మిస్సింగ్ క్రెడిట్ సంబంధించి అన్ని సమస్యలను అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని సూచించారు. దీనిలో భాగంగా ఈనెల 9న పీజీఆర్‌ఎస్ సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నామన్నారు.
గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయాలి
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్
వేలేరుపాడు: గిరిజను ల అభ్యున్నతికి అధికారులు పాటుపడాలని, సంక్షేమ ఫలాలను గిరిజన కుటుంబాలకు అందేలా చూడాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ అన్నారు. సోమవారం మండలంలోని మోదెల గ్రామంలో మాజీ మంత్రి జల గం ప్రసాదరావుతో కలిసి ఆయన పర్యటించా రు. సంక్షేమ, అభివృద్ధి పనులపై గిరిజనులను ఆరా తీశారు. గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేని గ్రామాలపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని, మూడు నెలల్లో పనులకు శ్రీకారం చుట్టేలా చర్యలలు తీసుకుంటామన్నారు. గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. మాజీ మంత్రి జలగం, జేవీఆర్ స్వ చ్ఛంద సేవా సంస్థ ద్వారా గిరిజనులకు స్టీల్ కంచం, గ్లాస్, స్వీట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అధికారుల వైఫల్యం కనిపిస్తోందన్నారు.
ప్రతి గ్రామంలో సెల్ టవర్లు ఏ ర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన తండాల అభివృద్ధికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి విషయంలో ఎవరూ కోర్టులకు వెళ్లవద్దని, ఎస్టీ కమిషన్‌ను సంప్రదించాలని కోరారు. ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, ఇన్‌చార్చి ఆర్డీఓ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, డీఎఫ్ జి.సతీష్ రెడ్డి, జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి జి.త్రినాథబాబు, విద్యుత్ శాఖ ఈఈ ఫీర్ అహ్మద్ ఖాన్, హౌసింగ్ ఈఈ ప్రసాద్ పాల్గొన్నారు.

శాశ్వత పరిష్కారం చూపాలి