
మద్దిలో హనుమద్ హోమం
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా ఆలయంలో శ్రీ సువర్ఛలా హనుమద్ కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణం, అనంతరం హనుమద్ హోమం వైభవంగా నిర్వహించినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు.
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ కరుణాకాటాక్షాలు మాపై అందించమ్మా.. అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తులు రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ప్రధాన ఉప అర్చకులు పేటేటి పరమేశ్వర శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు, అమ్మవారి చిత్రపఠాల విక్రయాలు, వాహనపూజలు, విరాళాల ద్వారా రూ.58,342 ఆదాయం వచ్చిందని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.
అత్తిలి: అదనపు కట్నం కోసం వేఽధిస్తున్న భర్త అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ పి.శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న అత్తిలి మండలం స్కిన్నెరపురానికి చెందిన భానుకృష్ణను ఉండి మండలం యండగండికి చెందిన గంగుల సతీష్ కుమార్‌కి ఇచ్చి వివాహం చేశారు. ఈ సమయంలో రూ. 40 లక్షల నగదు, 36 కాసుల బంగారం, ఐదు కిలోల వెండి పూజా సామాగ్రి ఇచ్చినట్లు తెలిపారు. భర్త జర్మనీలో ఉద్యోగం చేయడంతో పుట్టింటి నుంచి ఆస్తులు అమ్మి డబ్బు తేవాలని అత్తమామలు వేధించేవారని తెలిపారు. గత నెల 17న నిందితుడు అత్తమామల ఇంటికి వచ్చి బెదిరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మద్దిలో హనుమద్ హోమం

మద్దిలో హనుమద్ హోమం