భీమవరం: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈనెల 7న చేపట్టిన చలో విజయవాడ పోరుబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పీఎస్ విజయరామరాజు పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ పాఠశాలల్లో కరపత్రాలు, పోస్టర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ జి.ప్రకాశంతో కలిసి ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో విజయవాడ పోరుబాట కార్యక్రమం చేపట్టామన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను ఉపాధ్యాయులకు పంపిణీ చేసి ధర్నాకు హాజరుకావాలని కోరామన్నారు. ఫ్యాప్టో నాయకులు మల్లేశ్వరరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో పరిశ్రమలు, టూరిజం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆ క్వా రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించి జిల్లా అభివృద్ధికి తోడ్ప డాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పెట్టుబడుల సమన్వయ సమావేశాన్ని జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ఊక నుంచి రైస్‌బ్రాన్ ఆయిల్, సిలికాన్ జెల్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో చిన్నపాటి పరికరాల తయారీపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో 19 కిలోమీటర్ల మేర గోదావరి తీర ప్రాంతంలో (అయోధ్యలంక నుంచి నరసాపురం వరకూ) రిసార్ట్స్, కాటేజీల ఏర్పాటుపై పరిశీలించాలన్నారు. లేసు ఉత్పత్తులు ప్రోత్సహించేలా, పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని జిల్లా టూరిజం అధికారి ఏవీ అప్పారావును ఆదేశించారు. వ్యవసాయ క్షేత్రాల్లో కాటేజీలు, ఓపెన్ రిసార్ట్స్ నెలకొల్పేలా వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించాలని సూచించారు. డీఆర్వో బి.శివనా రాయణరెడ్డి, డీపీఓ ఎం.రామనాథరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతి రావు, ఎల్‌డీఎం ఎ.నాగేంద్రప్రసాద్, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా చేనేత శాఖాధికారి కె.అప్పారావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి పాల్గొన్నారు.
పురుషుల విజేత తూర్పుగోదావరి
నూజివీడు: దసరా సందర్భంగా నూజివీడులో నిర్వహిస్తున్న 73వ అఖిలభారత పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. మహిళల కబడ్డీ విజేతగా శ్రీకాకుళం జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్ శ్రీకాకుళం–చిత్తూరు జట్ల మధ్య జరగ్గా చిత్తూరు జట్టుపై 40–29 స్కోర్‌తో శ్రీకాకుళం జట్టు గెలుపొందింది. చిత్తూరు జట్టు ద్వితీయస్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల ఫైనల్ మ్యాచ్ గుంటూరు–తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగింది. తూర్పుగోదావరి జట్టు 59–39 స్కోర్ తేడాతో గుంటూరు జట్టుపై గెలుపొంది విజేతగా నిలిచింది. విజేతలకు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నగదు బహుమతులను, ట్రోఫీలను అందజేశారు.
ఆటలకు నిలయం నూజివీడు:
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడులో పూర్వకాలం నుంచి ఆటలకు గొప్ప పేరుందని అన్నారు. ఆటలు, క్రీడలకు నూజివీడులో లభించే ప్రోత్సాహం జిల్లా లో మరెక్కడా లభించదన్నారు. ప్రతిఒక్కరూ క్రీడలను ప్రోత్సాహించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు ఆటల గురించి తెలియజేయడంతో పాటు ఆడుకునేలా అవకాశం కల్పించాలన్నారు. క్రీడల్లో ప్రతిభను కనబరిస్తే నలుదిశలా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయన్నారు. స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు రామిశెట్టి మురళీకృష్ణ, సెక్రటరీ టీవీ కృష్ణారావు, జాయింట్ సెక్రటరీ మల్లెపూడి రాజశేఖర్, జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కోటగిరి సతీష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
7న ఉపాధ్యాయుల ‘చలో విజయవాడ’
7న ఉపాధ్యాయుల ‘చలో విజయవాడ’