
గోపాలకృష్ణకి రాష్ట్రస్థాయి అవార్డు
చింతలపూడి: చింతలపూడికి చెందిన కిసాన్ అంగడి వ్యవస్థాపకుడు మరికంటి గోపాలకృష్ణ ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విస్తరణ నిపుణుల రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఏరువాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో తాను అవార్డు అందుకున్నట్టు గోపాల కృష్ణ ఆదివారం తెలిపారు. ఎనిమిదేళ్లుగా గోపాలకృష్ణ తన భూమిలోనే ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కిసాన్ అంగడి ద్వారా ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.