
వార్డెన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వార్డెన్ చేసిన నేరాలు రుజువు కావడంతో మంగళవారం ఐదేళ్లు జైలు, రూ. 5 వేలు జరిమానా విధించినట్లు రూరల్ ఎస్సై ఐ.వీర్రాజు తెలిపారు. భీమవరంలోని విష్ణు కళాశాలలో హాస్టల్ వార్డెన్‌గా బన్నరావూరి వెంకట సుదాకర్ విధులు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి హాస్టల్ ఫీజు వసూలు చేసి కళాశాల యాజమాన్యానికి కట్టకపోవడంతో 2020లో అప్పటి ఎస్సై కె.సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. మంగళవారం కేసు విచారణకు రావడంతో వార్డెన్ బన్నరావూరి వెంకట సుధాకర్ చేసిన నేరాలు రుజువు కావడంతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, మెజిస్ట్రేట్ భీమవరం జి.సురేష్ బాబు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని పేర్కొన్నారు.
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి వారికి నిత్య కై ంకర్యాలతో పాటు, నాగవల్లీ దళాల(తమలపాకులు)తో అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ ఆర్‌వీ చందన మాట్లాడుతూ ఆలయానికి మధ్యాహ్నం వరకు వివిధ సేవల రూపేణా రూ. 2,07,725 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే స్వామి వారి అన్నప్రసాదాన్ని 1868 మంది భక్తులు స్వీకరించారని పేర్కొన్నారు. అలాగే బుధవారం ఉదయం 8 గంటల నుంచి స్వామి వారి హుండీల ఆదాయాన్ని లెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు.