
పోగొట్టుకున్న బ్యాగ్ అందజేత
భీమవరం: స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో స్కూటీపై వస్తూ బంగారపు వస్తువులు, నగదు కలిగిన బ్యాగ్‌ను జారవిడుచుకున్న మహిళకు మంగళవారం టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ అందచేశారు. గత నెల 27న చెనపాక జ్యోతి జువ్వలపాలెం రోడ్డులోని అడ్డవంతెన వైపు నుంచి కాసున్నర బంగారు వస్తువులు, రూ.60 వేల నగదు బ్యాగ్‌లో పెట్టుకుని స్కూటీపై బయలుదేరింది. మార్గమధ్యలో బ్యాగ్ జారవిడుచుకోగా ఆ బ్యాగ్ టూటౌన్ పోలీసుస్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బుంగా రాజుకు దొరికడంతో ఆయన పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. బ్యాగ్‌లో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్‌లోని వివరాలు ఆధారంగా బాధితురాలికి తెలియజేయడంతో సీఐ కాళీచరణ్ సమక్షంలో బ్యాగ్‌ను జ్యోతికి అందించారు.
యువకుడి మృతి
భీమవరం: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి రక్తదానం చేసిన యువకుడు కొద్దిసేపటికే మృతి చెందాడు. వివరాల ప్రకారం పాలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి చెందిన ఎన్.నరేష్ తన స్నేహితుడి బంధువైన వృద్ధురాలు పట్టణంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా నరేష్ రక్తదానం చేశాడు. అనంతరం నరేష్, అతని స్నేహితుడు బీర్ సేవించగా చాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో దగ్గరలోని వైద్యుడికి చూపించారు. అనంతరం ఒక్కసారిగా నరేష్ కుప్పకూలి మరణించాడు. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని వన్‌టౌన్ సీఐ ఎం.నాగరాజు తెలిపారు.