
సంబరం.. శుభారంభం
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి జాతరలో కీలక ఘట్టమైన తొలేళ్ల ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి జాతరను తొలేళ్ల ఉత్సవంతో శ్రీకారం చుట్టారు. తొలిఏరుగా రైతులు జరుపుకునే పండగలో భాగంగా వేకువజామునుంచే అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజాధికాలను నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు, సారెను సమర్పించారు. వేదపండితులు వేదమంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా ఆలయ సంప్రదాయం ప్రకారం పూజలు చేపట్టారు.
పైడితల్లి అమ్మవారిని తొలేళ్ల రోజున దర్శించుకున్న వారిలో...
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు, ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చినవెంకట అప్పలనాయుడు తదితరులు పైడితల్లిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
ఘటాలతో నివేదన..
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం నగరంలోని పలువురు భక్తులు వివిధ వేషధారణలతో... డప్పుల మోతలతో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. తొలేళ్ల ఉత్సవం రోజున ఉదయం నుంచి రాత్రి వరకూ సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉచిత సేవలు
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఎన్‌సీసీ, రెడ్‌క్రాస్, పోలీస్ సేవాదళ్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు మంచినీరు, మజ్జిగ, ఆహారపొట్లాలను ఉచితంగా అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ స్వీయపర్యవేక్షణ చేశారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సిరిమాను రథాన్ని హుకుంపేట నుంచి పైడితల్లమ్మవారి చదురుగుడి ప్రాంగణానికి తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. నిర్ణీత సమయానికి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గతంలో 2వేల మంది మాత్రమే బందోబస్తు విధులు నిర్వహించేవారని, ఈ ఏడాది 3వేల

సంబరం.. శుభారంభం

సంబరం.. శుభారంభం