
ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలి
● ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి
పార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన ప్రతి సమస్యనూ పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ, ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమ పేరిట మోసాలపై ఎక్కువగా ఫిర్యాదలు వచ్చాయి. ఆయా ఫిర్యాదులను క్షుణ్ణంగా విన్న ఎస్పీ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.