● పురవీధుల్లో పూజారి రూపంలో పైడితల్లి విహారం ● వర్షంతో భక్తులకు చల్లదనం
● అడుగడుగునా అమ్మకు నీరాజనం ● తిలకించి పులకించిన భక్తజనం
● గంట ఆలస్యంగా ప్రారంభమైన సిరిమానోత్సవం ● అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
● రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించిన దేవదాయశాఖ మంత్రి ఆనం
రేషన్ బియ్యం స్వాధీనం
గుమ్మలక్ష్మీపురం నుంచి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న నాలుగున్నర టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్‌చేసినట్టు శ్రీకాకుళం విజిలెన్స్ సీఐ సతీష్‌కుమార్ తెలిపారు.
భక్తులకు ఆశీర్వచనాలు అందజేస్తున్న
సిరిమాను
పూజారి వెంకటరావు
విజయనగరం టౌన్/విజయనగరం: పూజారి రూపంలో సిరులతల్లి పైడితల్లి కదలివచ్చిన వేళ భక్తజనం పరవసించింది. తల్లి చల్లని కరుణాకటాక్షాల కోసం పరితపించింది. అరటిపళ్లను విసిరి ఆశీస్సులు అందుకుంది. సిరిమానోత్సవానికి తరలివచ్చిన అశేష భక్తజనంతో పైడితల్లి సిరిమాను సంబరం అంబరాన్ని తాకింది. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. అమ్మవారికి ప్రతి రూపమైన పూజారి సిరిమానును అధిరోహించి భక్త జనావళికి ఆశీర్వచనాలు అందజేశారు. నిర్ణీత సమయానికన్నా గంట ఆలస్యంగా సిరిమాను సంబరం ప్రారంభమైనా అమ్మవారిని తిలకించేందుకు భక్తులు ఓపికగా నిరీక్షించారు.
● గంట ఆలస్యంగా..
అధికారుల పర్యవేక్షణా లోపం.. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో నిర్ణీత సమయానికన్నా (మధ్యాహ్నం 3.05 నిముషాలకు) సిరిమాను సంబరం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే ఓ వైపు మేఘాలు కమ్ముకుంటూ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నా సిరిమాను రథాన్ని తయారు చేయించడంలో అధికార యంత్రాంగం లోపం కొట్టిచ్చినట్లు కనిపించింది. ఏటా మూడు నుంచి మూడున్నర గంటల మధ్యలో సిరిమాను సంబరం అరంభమయ్యేది. సిరిమాను సిద్ధంకాకపోవడంతో చీకటిపడేవరకూ సంబరం సాగింది.
● పర్యవేక్షణలో అధికార యంత్రాంగం
సిరిమానోత్సవానికి లక్షలాది మంది భక్తజనం తరలివచ్చారు. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మూడంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దారు. ఆలయానికి నాలుగువైపులా ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. దూరప్రాంతాల నుంచి వాహనాల ద్వారా వచ్చేవారికి ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాలను కేటాయించారు. 2,600 మంది పోలీస్ సిబ్బందితో డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ, క్రైమ్ పార్టీలు, కలెక్టర్ రామ్‌సుందర్ రెడ్డి, జేసీ సేతుమాధవన్, ఎస్పీ దామోదర్, అదనపు ఎస్పీ సౌమ్యలత స్వీయపర్యవేక్షణతో ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది.
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
జాతర ముచ్చట్లు..
సిరిమాను సాగిందిలా...
సిరి జాతర సంప్రదాయబద్ధంగా సాగింది. మంగళవారం మధ్యాహ్నం 4.03 గంటలకు సిరిమానుపై పూజారి ఆశీనులయ్యారు. 4.24 గంటలకు భక్తుల జై పైడిమాంబ.. జైజై పైడిమాంబ జయజయ ధ్వానాల మధ్య కదిలిన సిరిమానును తనివితీరా చూడాలని లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దుష్టశక్తులను పారదోలుతూ పాలధార ముందుకు కదలగా, జాలరివల, ఎల్ల ఏనుగు, అంజలిరథం వెన్నంటి ఉండి ఉత్సవాన్ని ముందుకు నడిపించాయి. భక్తజన కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను భక్తులందరినీ అలరిస్తూ ముందుకు కదిలింది. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి చేరుకున్న భక్తులు అమ్మను దర్శించారు. గగనాన విహరించే పూజారి బంటుపల్లి వెంకటరావును అమ్మకు ప్రతిరూపంగా భావించి మొక్కుకున్నారు. చదురుగుడి నుంచి ప్రారంభమైన సిరిమానోత్సవం డెంకేషావలీబాబా దర్గా మీదుగా కోటకు చేరుకుని కోట శక్తికి మూడుసార్లు అభివాదం చేయడం ఆనవాయితీ. సిరిమాను తిరువీధి మూడుసార్లు పూర్తిచేసుకున్న వెంటనే కురిసిన వర్షంతో దేవతమూర్తులపై నుంచి తమకు వర్షపు నీటిబొట్ల రూపంలో ఆశీర్వచనాలను అందించారని భక్తజనం మురిసిపోయింది. 5.47 గంటలకు సిరిమానోత్సవం ముగిసింది.
సిరిమానోత్సవం సందర్శకులకు రెవెన్యూ సంఘం ఉచిత సేవలు అందించింది. పట్టణంలోని రైల్వేస్టేషన్, రెవెన్యూ హోమ్ ప్రాంతాల్లో భక్తులకు ఉచిత అన్నదానం కార్యక్రమాలను కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు తాడ్డి గోవింద్ మాట్లాడుతూ 2017 నుంచి ఉచిత సేవలు అందిస్తున్నామని తెలిపారు.
పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి ఆకాంక్షించారు.
శ్రీపైడితల్లి అమ్మవారి పండగను రాజకీయాలకు వాడుకోవడం మా తత్వం కాదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిరులతల్లి సిరిమాను జాతర ఓ వైపు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సమయంలో చదురుగుడిలో పైడితల్లికి వేదపండితులు లక్షపుష్పార్చన సేవను నిర్వహించారు. ఆలయమంతా వేదమంత్రోచ్ఛరణతో మార్మోగింది. జై పైడిమాంబ జైజై పైడిమాంబ నినాదాలతో భక్తజనం లక్ష పుష్పార్చన సేవలో తరించారు.
భక్తులు తమ మొక్కుబడులు చెల్లించేందుకు విసిరిన అరటి పండ్లు, పసుపు, కుంకుమలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు సుమారు 200 మంది కార్మికులు పనిచేశారు. కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య, ప్రజారోగ్యాధికారి డాక్టర్ కె.సాంబమూర్తి, ఏసీపీ రమణమూర్తి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఉత్తరాంధ్రుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర దిగ్విజయంగా జరిగిందని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉత్సవం ప్రశాంతంగా విజయవంతంగా జరగడానికి కృషి చేసిన అధికారులు, పోలీసు యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బందికి ముఖ్యంగా సంపూర్ణంగా సహకరించిన భక్తులందరికీ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
– విజయనగరం అర్బన్/విజయనగరం/
విజయనగరం ఫోర్ట్
ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఉదయం 11 గంటల సమయంలో ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పూజాక్రతువులు పూర్తిచేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం మరోసారి అమ్మవారిని దర్శించి పట్టువస్త్రాలను సమర్పించారు.
కోటపై నుంచి పూసపాటివంశీయులైన అశోక్‌తో పాటు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సుధా గజపతి, ఊర్మిళా గజపతి, ఇతర రాజకుటుంబీకులు ఎప్పటిలాగే కోట బురుజుపై నుంచి తిలకించారు. వీరితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, తదితరులు సిరిమానోత్సవాన్ని వీక్షించారు. మరోపక్క అర్బన్ బ్యాంక్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదిక నుంచి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా అధికార యంత్రాంగం ఉత్సవాన్ని తిలకించారు.
పూర్వజన్మసుకృతం
అమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలి. తొమ్మిదోసారి అమ్మవారి సిరిమానును అధిరోహించడం పూర్వజన్మసుకృతం. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో ఆనందమయ జీవితం గడపాలి. పంటలు సమృద్ధిగా పండాలి. ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరిపైనా అమ్మ ఆశీస్సులు ఉంటాయి.
– బంటుపల్లి వెంకటరావు, సిరిమాను పూజారి
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం