
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
● కురుపాం బాలికల గురుకుల
పాఠశాలను సందర్శించిన గిరిజన
సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్
కురుపాం: స్థానిక బాలికల గురుకులంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామని గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ అన్నారు. పాఠశాలను మంగళవారం సందర్శించారు. గురుకులంలో కొత్తగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్‌ను పరిశీలించారు. కిచెన్ గదులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యంతోపాటు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. బాలికలతో మాట్లాడి సౌకర్యాలు, సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులు, కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, జేసీ సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి మధ్యాహ్నం సహపంక్తి భోజనం చేశారు. ఆయన వెంట డీడీ కృష్ణవేణి, గిరిజన సంఘం నాయకులు నిమ్మక జయరాజ్ , పాఠశాల సిబ్బంది ఉన్నారు.