
భూ సమస్యలను పరిష్కరించాలి
అర్వపల్లి: భూ భారతిలో వచ్చిన భూ సమస్యలపై విచారణ చేసి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శనివారం అర్వపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ తనిఖీచేశారు. తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నియమావళిపై తహసీల్దార్ శ్రీకాంత్‌కు పలు సూచనలు చేసి మాట్లాడారు. స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. పీహెచ్‌సీలో రికార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు. పీహెచ్‌సీకి కుర్చీలు, ఫ్యాన్లు సమకూర్చినట్లు తెలిపారు. మందుల స్టాక్, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్‌నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

భూ సమస్యలను పరిష్కరించాలి