
‘సీఎంఆర్‌ఎఫ్’ నిందితుల అరెస్ట్
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన 8మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పూర్తిస్థాయి నీటి మట్టం :
590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 588 అడుగులు
ఇన్‌ఫ్లో : 54,427 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 54,427 క్యూసెక్కులు
విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 33,211 క్యూసెక్కులు
కుడికాల్వ ద్వారా : 10,040 క్యూసెక్కులు
ఎడమకాల్వ ద్వారా : 9,076 క్యూసెక్కులు
ఏఎమ్మార్పీకి : 1,800 క్యూసెక్కులు
వరద కాల్వకు : 300 క్యూసెక్కులు
- 8లో
శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృ తాభిషేకం గావించి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. కల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామికి ఏకాదశరుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, భక్తులు పాల్గొన్నారు.