
వీడని యూరియా కషా్టలు
నేరేడుచర్ల : నాన్ ఆయకట్టులో వరికోతలు, పత్తి ఏరడం మొదలైనా ఆయకట్టు ప్రాంత రైతులను యూరియా కష్టాలు వీడడంలేదు. సోమవారం నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి (పీఏసీఎస్ కార్యాలయానికి) 444 బస్తాల యూరియా లోడు రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారి జావిద్ ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు.
క్యూలో కూర్చొని పడిగాపులు
మఠంపల్లి: మఠంపల్లి పీఏసీఎస్ గోదాముకు సోమవారం 20 టన్నుల యూరియా వచ్చిందని తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు వందలాదిగా తరలివచ్చి బారులుదీరారు. ఈ క్రమంలో కొందరు రైతులు నిలబడలేక లైన్‌లో కూర్చున్నారు. సుమారు 200మంది రైతులకు రెండు బస్తాల చొప్పున అధికారులు యూరియా అందజేశారు. యూరియా అందని సుమారు 300 మంది వరకు రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ సీఈఓ తిరుపతయ్య మాట్లాడుతూ యూరియా రాగానే వెంటనే రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు.

వీడని యూరియా కషా్టలు