
వీధి వ్యాపారం.. అభివృద్ధికి రుణం
సూర్యాపేట కోదాడ హుజూర్‌నగర్ తిరుమలగిరి నేరేడుచర్ల
సూర్యాపేట అర్బన్: వీధి వ్యాపారులకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఇదివరకు పీఎం స్వనిధి పథకం కింద చిరు వ్యాపారులకు రుణాలు అందించగా.. గత పది నెలలుగా ఆ పథకం నిలిచిపోయింది. దాని స్థానంలో తాజాగా లోక్ కల్యాణ్ పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు మహిళా సంఘాలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఇప్పటికే కొంతమంది వీధి వ్యాపారులకు ఒకటి, రెండు విడతలుగా రుణాలు అందించగా.. ప్రస్తుతం మూడో విడత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
రుణ సదుపాయం పెంపు
ఐదేళ్ల కిందట వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందించారు. వడ్డీ వ్యాపారులతో ఇబ్బందులు గురికాకుండా బ్యాంకుల ద్వారా నేరుగా స్వల్ప కాలిక రుణాలు అందజేశారు. వందల సంఖ్యలో మహిళా సంఘం సభ్యులు తీసుకొని చెల్లించడంతో ఎక్కువ మొత్తం రుణం పొందడానికి అర్హత సాధించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి రుణాలు మంజూరు చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి పాతవారితో పాటు కొత్త సంఘాల సభ్యులు కూడా రుణాలు పొందే అవకాశం కల్పించారు. మొదటి విడతలో రూ.10వేలు అందించారు. ఇప్పుడు లోక్ కల్యాణ్ మేళా ద్వారా రుణాన్ని రూ.15 వేలకు పెంచారు. రెండో విడత రూ.20వేలు అందించగా ప్రస్తుతం దీనిని రూ.25వేలకు పెంచారు. మొదటి, రెండో విడతల్లో సక్రమంగా చెల్లించిన వారిని రూ.50వేల రుణానికి ఎంపిక చేసి ఇవ్వనున్నారు.
మున్సిపాలిటీల వారీగా
ఫ పీఎం స్వనిధి పథకం స్థానంలో
లోక్ కల్యాణ్ తీసుకువచ్చిన కేంద్రం
ఫ పాతవారితో పాటు కొత్త సంఘాల సభ్యులు రుణాలు పొందే అవకాశం
ఫ ఇప్పటికే అవగాహన సదస్సులు
నిర్వహించిన అధికారులు
జనాభా 1,53,000 75,000 35,850 18,474 14,853
వార్డుల సంఖ్య 48 35 8 15 15
నివాస గృహాలు 39,800 18,000 10,761 5,945 4,058
మహిళా సంఘాలు 2,519 1,499 749 426 414
మొత్తం సభ్యులు 24,737 14,990 7,490 4,230 4,140
ఆర్పీల సంఖ్య 86 49 38 15 15