
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
సూర్యాపేట : ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీజీసీపీఎస్‌ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవల్లి ఉపేందర్, రాష్ట్ర సహాధ్యక్షుడు మన్నూరు నాగన్న అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన సీపీఎస్ ఉద్యోగి జాన్ కిషోర్‌ను ఆదివారం వారు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. లోప భూయిష్టమైన సీపీఎస్ విధానంతో ఎందరో ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత వృద్ధాప్యంలో కనీసం భద్రత, భరోసా లేకుండా జీవితాలను దుర్భరంగా గడుపుతున్న పరిస్థితి వచ్చిందన్నారు. క్రాఫ్ట్ టీచర్ జాన్ కిషోర్ ఉద్యోగ విరమణ పొంది సంవత్సరం గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నేరెళ్ల దేవరాజు, పరమేష్ మల్లికార్జున్, రవీందర్, సుధాకర్, కేశవరెడ్డి, సైదులు, కేశవరెడ్డి, చిత్తరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ టీజీసీపీఎస్‌ఈయూ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి నాగవల్లి ఉపేందర్