
జోహార్.. ఆరీ్డఆర్
నేడు అధికారిక లాంఛనాలతో
అంత్యక్రియలు
ప్రముఖుల నివాళి
సూర్యాపేట : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (ఆర్డీఆర్) మరణవార్త విని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈనెల 2వ తేదీ రాత్రి 10.10 గంటలకు దామోదర్‌రెడ్డి మృతిచెందిన విషయం విదితమే. ఆయన పార్థివదేహాన్ని శుక్రవారం సూర్యాపేటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన పార్థివదేహాన్ని అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సందర్శించి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెద్దపులి లాంటి దామన్నకు ఎవరూ సాటిరారని, దేవుడు తమకు అన్యాయం చేసి మా నాయకున్ని తీసుకెళ్లాడని దుఃఖించారు. జోహార్ దామన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ప్రజల సందర్శనార్థం రెడ్‌హౌస్‌కు..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో నివాళులర్పించిన అనంతరం రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో శుక్రవారం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్‌హౌస్)కు తీసుకొచ్చారు. తమ అభిమాన నాయకున్ని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు వేలాది మందిగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వేలాది మందిగా తరలివచ్చారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాళాల వద్ద మధ్యాహ్నం 3గంటల నుంచే ప్రజలు వేచిచూశారు. మరికొందరు రెడ్‌హౌస్ వద్ద బారులుదీరారు. సాయంత్రం 5.15 గంటలకు ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంది. దామోదర్‌రెడ్డి పార్థివదేహం ఉన్న ప్రత్యేక అంబులెన్స్ ముందుభాగంలో కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి కూ ర్చుని తన తండ్రిని చూసేందుకు వచ్చిన జనాన్ని చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్వీ ఇంజనీరింగ్ నుంచి కొత్తబస్టాండ్ మీదుగా ర్యాలీ గా పార్థివదేహాన్ని రెడ్‌హౌస్‌కు తీసుకెళ్లారు. వేలాది మంది అభిమానులు పాల్గొనడంతో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కడసారి తమ అభిమాన నాయకున్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
రాత్రి పొద్దుపోయిన తర్వాత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో తుంగతుర్తికి తరలించారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత శనివారం మధ్యాహ్నం 12గంటలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆర్డీఆర్ గడీ పక్కనే పామాయిల్ తోటలో మహా ప్రస్థానం కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్‌లు అంత్యక్రియల కోసం చేపట్టిన పనులను పర్యవేక్షించారు. సూర్యాపేటలో జరిగిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే వేదాపు వెంకయ్య, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు.
ఫ తుంగతుర్తికి చేరిన
రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పార్థివదేహం
ఫ అంతకుముందు సూర్యాపేటలో భారీ ర్యాలీ
ఫ రెడ్‌హౌస్‌లో మంత్రి సీతక్క, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జగదీష్‌రెడ్డి, జైవీర్‌రెడ్డి, ప్రముఖుల నివాళి
ఫ కన్నీటి పర్యంతమైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు
ఫ నేడు వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు
సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్ హౌస్)లో దామోదర్‌రెడ్డి పార్థివదేహానికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్, రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం రాత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వేదాసు వెంకయ్య, జూలకంటి రంగారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, దోసపాటి గోపాల్, వివిధ పార్టీల నాయకులు చెరుకు సుధాకర్, బడుగుల లింగయ్య యాదవ్, పిట్ట రాంరెడ్డి, మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున రెడ్డి నివాళులర్పించారు. వీరివెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ తదితరులు సర్వోత్తమ్‌రెడ్డి వెన్నంటే ఉన్నారు.

జోహార్.. ఆరీ్డఆర్