
మట్టపల్లిలో కృష్ణమ్మకు హారతి
మఠంపల్లి: మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద పవిత్ర కృష్ణానదికి శుక్రవారం రాత్రి అర్చకులు హారతి పూజలు వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం పల్లకీలో మంగళ వాయిద్యాల నడుమ కృష్ణానదిలోని ప్రహ్లాద ఘాట్‌కు తరలించారు. అనంతరం చీర సారె, పసుపు కుంకుమలు సమర్పించి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు.
ఎన్నికలకు సిద్ధం కావాలి
సూర్యాపేట అర్బన్ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ, మండల, పట్టణ కార్యదర్శుల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎం అభ్యర్థులు, సానుభూతి పనులను గెలిపించాలని కోరారు. సీపీఎం పోటీచేయని చోట్ల పోటీ విషయమై శనివారం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున రెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్ రావు, సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గోదావరి జలాలు నిలిపివేత
అర్వపల్లి: జిల్లాకు వస్తున్న గోదావరి జలాలను నిలిపివేశారు. వారబందీ విధానంలో గతనెల 8వ తేదీ నుంచి నిరంతరాయంగా గోదావరి జలాలను వదులుతున్నారు. అయితే లోయర్ మానేర్‌డ్యాం నుంచి రెండో దశకు వారబందీ విధానంలో నీటిని నిలిపివేయడంతో జిల్లాకు ఆపారు. ఎల్‌ఎండీ నుంచి నీటిని పునరుద్ధరించగానే జిల్లాకు వదులుతామని నీటిపారుల శాఖ అధికారులు తెలిపారు.

మట్టపల్లిలో కృష్ణమ్మకు హారతి