
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కలెక్టర్ తన సతీమణితో కలిసి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ మహిళా ఉద్యోగులతో కలిసి కలెక్టర్ సతీమణి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీడబ్ల్యూఓ దయానందరాణి, డీసీఓ పద్మ, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్‌రెడ్డి, మహిళా ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.